Karthika deepam october 8th episode: కాంచనను నిలదీసిన జ్యోత్స్న- మనవరాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తానన్న శివనారాయణ
Karthika deepam 2 serial today october 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అన్నయ్య దగ్గర తీసుకున్న మాటను ఎందుకు వెనక్కి తీసుకున్నావని జ్యోత్స్న కాంచనను నిలదీస్తుంది. నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కాంచన చెప్తుంది.
కార్తీక్ ఇంటికి జ్యోత్స్న ఆవేశంగా వచ్చి మాట్లాడుతుంది. నన్ను కోడలిని చేసుకుంటానని నేను పుట్టకముందే మీ అన్నయ్య దగ్గర మాట తీసుకుంది నువ్వే కదా. ఎవరో తప్పు చేస్తే ఇచ్చిన మాట కాదని అంటుంటే నువ్వే గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి కదా. మావయ్యతో పాటు మమ్మల్ని కూడా వద్దని అనుకున్నావా అని నిలదీస్తుంది.
నా పెళ్లి ఆపె హక్కు ఎవరిచ్చారు?
నువ్వు ఎందుకు నన్ను కాదని అనుకున్నావో తేల్చుకోవడానికి వచ్చాను. పుట్టినప్పటి నుంచి నా బుర్రలో బావ తప్ప ఇంకెవరూ లేకుండా చేసింది నువ్వే కదా. ఇప్పుడు మావయ్య తప్పు చేశాడని నా జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. నా పెళ్లి ఆపె హక్కు మీకు ఎవరిచ్చారు?
పెళ్లి చేయాలని అనుకోవడం వద్దని అనుకోవడం మీ ఇష్టమేనా? మీరు పెళ్లి ఎందుకు ఆపారో నిలదీసే హక్కు నాకుంది చెప్పమని అడుగుతుంది. వద్దని అనుకుంది మీ తాతయ్య నాన్న, వాళ్ళకు ఈ పెళ్లి వల్ల ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించు తాంబూలం పళ్ళెం తీసుకుని మీ అత్త మీ బావను తీసుకుని వస్తుందని అంటాడు.
పరువు తక్కువ పని కాదా?
తప్పు చేశాడని మావయ్యను గెంటేసిన మనిషి నువ్వు అక్రమ సంతానం ఇంటికి వెళ్ళి ఎందుకు అక్షింతలు వేసి నువ్వు తప్పు చేశావు. స్వప్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ నీ సవతి కూతురని మర్చిపోయావా? అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. కాంచన బాధపడుతుంటే కార్తీక్ మరదలను వారించడానికి చూస్తాడు.
కానీ జ్యోత్స్న మాత్రం తన మాటలకు అడ్డు కట్ట వేయదు. తండ్రి గౌరవం కోసం తన మాటను వెనక్కి తీసుకున్న గ్రేట్ అత్తగారు తన సవతి కూతురికి అక్షింతలు వేయడం కోసం వెళ్ళడం దిగజారిపోయినట్టు కాదా? ఇది పరువు తక్కువ పని కాదా? ఇది చేసిన వాళ్ళు ఛీ కొడతారని అంటుంది.
దీపతో షికార్లు తిరుగుతాడు
పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లలకు ఎందుకు శిక్ష అని కాంచన అంటుంది. నేను అడిగేది ఇదే నాకు ఎందుకు మీరు శిక్ష వేశారని అంటుంది. శిక్ష వేసింది మేం కాదు మీ నాన్న వెళ్ళి వాళ్ళను అడుగు అని కార్తీక్ కోపంగా చెప్తాడు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు.
ఇది మా అత్త ఇల్లు ఎప్పుడైనా వస్తానని అంటుంది. మీ తాత పర్మిషన్ తీసుకుని రావాలని చెప్తాడు. నేను వస్తే నీకు ఇబ్బంది అదే దీప వస్తే మాత్రం చక్కగా కారులో షికార్లు తిరుగుతారని జ్యోత్స్న అనేసరికి కార్తీక్ అరుస్తాడు. దీప వస్తే తప్పు ఏముందని కాంచన అంటుంది.
నిన్ను నా కోడలిని చేసుకుంటా
మిమ్మల్ని దీప మార్చేస్తుందని ఆవేశంగా మాట్లాడుతుంది. దీప గురించి తప్పుగా మాట్లాడొద్దు తను అన్ని విషయాల్లోనూ గొప్పే. స్వప్నకు అక్షింతలు వేస్తే మా అమ్మను పొగిడింది కానీ నువ్వు దిగజారిపోయావు అంటూ తిట్టావు. అది మీ ఇద్దరికీ ఉన్న తేడా అని అంటాడు.
మీకు దీప మంచిది అయితే విగ్రహం కట్టించుకో అంతే కానీ కుటుంబాన్ని ముక్కలు చేసిన మనిషిని పొగడకు అని జ్యోత్స్న తిడుతుంది. నిన్ను నా ఇంటి కోడలిని చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. మా నాన్న ఒప్పుకుంటే నాకు పెళ్లి చేయడానికి ఏ ఇబ్బంది లేదని కాంచన చెప్తుంది.
శౌర్యను ఇంటికి తీసుకురా
సరే అయితే అనేసి జ్యోత్స్న ఆవేశంగా వెళ్ళిపోతుంది. దీప కార్తీక్ వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తుంది. శివనారాయణతో మాట్లాడిన విషయాల గురించి అనసూయ మాట్లాడుతుంటే శౌర్య వస్తుంది. కార్తీక్ ఇక ఈ ఇంటికి రాడా? ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతుంది.
కాంచన దీపకు ఫోన్ చేసి శౌర్యను రెండు మూడు రోజులు మా ఇంటి దగ్గర ఉంచుతావా అని అడుగుతుంది. నా ఒక్కదానికి అదోలా ఉందని బాధగా అడుగుతుంది. దీప సరే అంటుంది. కాంచన బాధను అనసూయ అర్థం చేసుకుని మాట్లాడుతుంది. తనకు ఒంటరితనం తెలుస్తుంది ఇలాంటి టైమ్ లో ఎవరూ లేకపోతే బతుకు మీద ఆశ చచ్చిపోతుంది.
మాటకు మాట చెప్పిన జ్యోత్స్న
అదే జరిగితే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. వీలైనంత త్వరగా ఆవిడను ఇందులో నుంచి బయటపడేలా చేయాలి. అలా జరగాలి అంటే కార్తీక్ బాబు పెళ్లి జ్యోత్స్నతో జరగాలని చెప్తుంది. అందరూ భోజనం దగ్గర ఉంటే జ్యోత్స్న ఎక్కడని శివనారాయణ ఎక్కడని అడుగుతాడు.
ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందని సుమిత్ర చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అంటే అత్త ఇంటికి వెళ్లానని చెప్తుంది. నువ్వు మమ్మల్ని అడగకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని పెద్దాయన అంటాడు. జ్యోత్స్న మాటకు మాటకు ఎదురు సమాధానం చెప్తుంటే దశరథ తిడతాడు.
జ్యోత్స్నకు వేరే వ్యక్తితో
పెళ్లి గురించి డాడీ దగ్గర అత్తతో నేను మాట్లాడాను. తాత సరే అంటే తాంబూలం తీసుకుని ఇంటికి వస్తానని అత్త చెప్పిందని జ్యోత్స్న చెప్తుంది. మనవరాలి విషయంలో నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. నా ఫ్రెండ్ మనవడు అమెరికా నుంచి వచ్చాడు రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వద్దామని శివనారాయణ చెప్తాడు.
జ్యోత్స్నకు మరో సంబంధం చూస్తానని చెప్తాడు. బావను కాదని ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చిన పెళ్లి చేసుకొను. అంతగా మీరు బలవంతం చేస్తే మీకు కూతురు ఉండదని జ్యోత్స్న సుమిత్రను బెదిరిస్తుంది. ఇంటి బయట సుమిత్ర ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే దీప వచ్చి ఏమైందని అడుగుతుంది.
మావయ్య జ్యోత్స్నకు వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్