Karthika deepam october 18th episode: రసవత్తరంగా మారిన కథనం- దీప మెడలో తాళి కట్టిన కార్తీక్- జ్యోత్స్న గుండె ముక్కలు-karthika deepam 2 serial today october 18th episode deepa shocked karthik marries her to take sourya responsibility ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 18th Episode: రసవత్తరంగా మారిన కథనం- దీప మెడలో తాళి కట్టిన కార్తీక్- జ్యోత్స్న గుండె ముక్కలు

Karthika deepam october 18th episode: రసవత్తరంగా మారిన కథనం- దీప మెడలో తాళి కట్టిన కార్తీక్- జ్యోత్స్న గుండె ముక్కలు

Gunti Soundarya HT Telugu
Oct 18, 2024 07:09 AM IST

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యను దీప బలవంతంగా తీసుకుని వెళ్లబోతుంటే కార్తీక్ ఆపుతాడు. ఏ అధికారంతో తన కూతురిని ఆపుతున్నారని దీప నిలదీస్తుంది. దీంతో కార్తీక్ దీప మెడలో తాళి కట్టేస్తాడు. శౌర్య నా కూతురు తండ్రి స్థానంలో ఉండి అపుతున్నానని చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 18వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 18వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today october 18th episode: కాంచన దీపను ఆపేందుకు చూస్తుంది. ఎవరి మాట వినను నా కూతురిని తీసుకుని వెళ్లిపోతానని దీప వెళ్లబోతుంటే కార్తీక్ అపుతాడు. నరసింహలాగా ప్రవర్తించకు పాప పరిస్థితి అర్థం చేసుకోమని కోపంగా చెప్తాడు. వాళ్ళ అరుపులకు శౌర్య గదిలో నుంచి బయటకు వస్తుంది.

కార్తీక్ నాన్నగా కావాలి

దీప శౌర్యను తీసుకుని బయల్దేరబోతుంది. మనం ఊరు వెళ్లొద్దు అక్కడ కార్తీక్ ఉండదు. నేను రాను నాకు కార్తీక్ నువ్వు ఇద్దరూ కావాలి. మీరిద్దరూ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుంది. కార్తీక్ బాబు మనతో ఎందుకు ఉంటారని దీప కోపంగా చెప్తుంది.

దీప బలవంతంగా శౌర్యను తీసుకెళ్లబోతుంటే పాపను ఇబ్బంది పెట్టొద్దని కాంచన అంటుంది. కానీ దీప మాత్రం వినదు. నీకు అమ్మ తప్ప ఎవరూ లేరు నాకు నువ్వు నీకు నేను అంతే అంటుంది. శౌర్య కార్తీక్ నాన్నగా కావాలని దీపను అడుగుతుంది. కార్తీక్ నాన్నగా కావాలంటే ఏం చేయాలని అంటుంది.

ఏ హక్కుతో దూరం చేస్తున్నారు

నోర్ముయ్ నీకు నాన్న లేడు రాడు అమ్మ అయినా నాన్న అయినా అన్నీ నేనే అని దీప కోపంగా చెప్తుంది. శౌర్యను బలవంతంగా తీసుకువెళ్లడానికి వీల్లేదని కార్తీక్ ఆవేదనగా మాట్లాడతాడు. అలా తీసుకెళ్తే శౌర్య బాధపడుతుంది. ఒక్క రోజు బాధపడుతుందని నేను రోజు బాధపడలేను వెళ్లనివ్వమని దీప ఏడుస్తుంది.

ఎన్ని చెప్పినా కూడా శౌర్యను పంపించనని అంటాడు. నా కూతురిని నా నుంచి దూరం చేయడానికి మీరెవరు? ఏ హక్కుతో మా మధ్య గీత గీస్తున్నారని దీప నిలదీస్తుంది. కార్తీక్ వస్తే నేను నీతో వస్తానని శౌర్య అంటుంది. అలా కుదరదని దీప ఏడుస్తుంది. ఈ మనిషికి ఏ అధికారం ఉందని నన్ను నా కూతురిని శాసిస్తున్నాడని కూలబడి ఏడుస్తుంది.

దీప మెడలో తాళి కట్టిన కార్తీక్

నిన్ను శాసించాలంటే అధికారం కావాలా శౌర్య కోసం అధికారం నేనే తెచ్చుకుంటానని కార్తీక్ తాళి వైపు చూస్తాడు. అప్పుడే జ్యోత్స్న సంతోషంగా కార్తీక్ ఇంటికి వస్తుంది. కార్తీక్ పూజ గదిలోకి వెళ్ళి తాళి తీసుకొచ్చి దీప మెడలో కట్టేస్తాడు. సరిగా అప్పుడే జ్యోత్స్న కూడా ఎంట్రీ ఇస్తుంది.

అది చూసి జ్యోత్స్న గుండె ముక్కలవుతుంది. ఏ అధికారంతో శౌర్యను ఆపుతున్నావ్ అన్నావ్ కదా ఇప్పుడు విను నేను శౌర్యకు తండ్రిని అనే అధికారంతో ఆపుతున్నాను. ఇప్పుడు నాకు శౌర్య కూతురు. నా కూతురు ఎక్కడికి రాదు నాతోనే ఉంటుందని చెప్తాడు.

ఆత్రంగా పారిజాతం

మా అమ్మను మా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ మా నాన్న అని శౌర్య సంతోషంగా జ్యోత్స్నను పిలిచి మా అమ్మానాన్నకు పెళ్లి అయిపోయిందని చెప్తుంది. దీప షాక్ లో ఉంటుంది. ఇంటి దగ్గర జ్యోత్స్న కోసం పారిజాతం ఆత్రంగా ఎదురుచూస్తుంది.

జ్యోత్స్న కాంచనను తీసుకొస్తుందని అనుకుంటారు. కాంచనకు క్షమాపణ చెప్పాలని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న బాధగా వస్తుంది. ఏమైంది మీ బావ అత్త ఎక్కడని పారిజాతం అడుగుతుంది. ఏమైంది అత్తతో మాట్లాడావా ఏమైనా అన్నదా అని ఇంట్లో అందరూ ఏం జరిగిందని అడుగుతారు.

నాకు అన్యాయం జరిగింది

కానీ జ్యోత్స్న మాత్రం మౌనంగా ఏడుస్తుంది. అందరూ కంగారుగా ఏమైందని అంటారు. అన్యాయం జరిగిందని ఏడుస్తుంది. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది ఏమైందని సుమిత్ర అడుగుతుంది. నీ వల్లే నాకు అన్యాయం జరిగింది. మీరందరూ కలిసి నాకు అన్యాయం చేశారని అంటుంది.

మేం ఏం చేశాము పెళ్ళికి ఒప్పుకున్నాం కదా అని పెద్దాయన అంటాడు. బావ పెళ్లి చేసుకున్నాడు. బావ దీప మెడలో తాళి కట్టాడని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నా ముందే దీప మెడలో మూడు ముళ్ళు వేశాడు నాకు అన్యాయం చేశాడని తలబాదుకుని ఏడుస్తుంది.

బూచోడిని పోలీసులకు పట్టించా

కార్తీక్ ఇంటికి అనసూయ వస్తుంది. తలకు కట్టు ఏంటి అంటే నిన్ను ఎత్తుకుపోవాలనుకున్న బూచోడిని పట్టుకుని పోలీసులకు పట్టించానని చెప్తుంది. అనసూయకు కార్తీక్ థాంక్స్ చెప్తాడు. ఇక బూచోడి గురించి భయపడాల్సిన అవసరం లేదని కార్తీక్ శౌర్యకు చెప్తాడు.

పారిజాతంగారిని నీ గురించి అడిగితే తిట్టుకుంటూ ఇక్కడ ఉన్నావని చెప్పారు. ఏమైందని అడిగితే దీప ఏడుస్తుంది. మా ఫ్రెండ్ మా అమ్మను పెళ్లి చేసుకున్నాడని శౌర్య చెప్పడంతో అనసూయ దీప మెడలో తాళి చూస్తుంది. నీ కన్నీళ్ళు దేవుడు తుడిచేశాడు అని అనసూయ సంతోషంగా ఉందని చెప్తుంది.

కార్తీక్ దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడుతుంది. నా మేనకోడలికి ఐదోతనం వరంగా ఇచ్చారు. మీరు చేసిన పనికి మెచ్చుకోవడానికి మాటలు లేవు. అండగా ఉంటారు అంటే ధైర్యంగా ఉంటారని అనుకున్నాను. ఇలా తోడుగా నిలబడతారు అనుకోలేదని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner