Karthika deepam october 17th episode: శౌర్య కోసం కార్తీక్, దీప గొడవ- నరసింహను పోలీసులకు పట్టించిన అనసూయ-karthika deepam 2 serial today october 17th episode anasuya hands narasimha over to the police ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 17th Episode: శౌర్య కోసం కార్తీక్, దీప గొడవ- నరసింహను పోలీసులకు పట్టించిన అనసూయ

Karthika deepam october 17th episode: శౌర్య కోసం కార్తీక్, దీప గొడవ- నరసింహను పోలీసులకు పట్టించిన అనసూయ

Gunti Soundarya HT Telugu
Oct 17, 2024 07:11 AM IST

Karthika deepam 2 october 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యను తీసుకుని ఊరు వెళ్లిపోతానని దీప అనడంతో కార్తీక్ అడ్డుకుంటాడు. తనని ఎక్కడికీ పంపించేది లేదని తేల్చి చెప్తాడు. కానీ దీప మాత్రం వినిపించుకోదు.

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

శౌర్య కనిపించడం లేదని దీపక్క తాను వెతుకుతున్నామని కాశీ కార్తీక్ కి ఫోన్ చేసి చెప్తాడు. శౌర్య తన దగ్గరే ఉందని కార్తీక్ చెప్తాడు. శౌర్య మీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి కదా అంటే అమ్మకు చెప్పకు వస్తే తీసుకుని వెళ్లిపోతుందని శౌర్య అంటుంది. దీపను ఇంటికి రమ్మని పిలుస్తాడు.

నువ్వంటే చాలా ఇష్టం 

నువ్వు ఊరు వెళ్లకు అక్క నీకు ఆ ఇంటి దగ్గర ఇబ్బంది ఉంటే మన ఇంటికి వచ్చేయమని కాశీ పిలుస్తాడు. కానీ దీప మాత్రం ఇక్కడ ఉండటం మంచిది కాదని అనుకుంటుంది. అమ్మ వస్తే నన్ను ఊరు తీసుకెళ్లిపోతుంది. నాకు అమ్మ కావాలి, నువ్వు కావాలి. ఇద్దరూ నాతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పు.

నువ్వు నాకు నాన్నగా ఉంటే అప్పుడు నాతోనే ఉంటావ్ కదా. రౌడీ నీకోసం ఏదైనా చేస్తాను అంటావ్ కదా నాన్నగా ఉండలేవా కార్తీక్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో ఆడుకోవాలని కబుర్లు చెప్పాలని ఉంది. నువ్వు మంచివాడివి. నన్ను ప్రేమగా పిలుస్తావ్, మాట్లాడతావు.

అత్తకు సర్ ప్రైజ్ ఇస్తా 

అమ్మలా చూసుకుంటావు. నీతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. ఈ ఫ్రెండ్ కి నాన్నగా ఉండలేవా? నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా అని బాధగా అడుగుతుంది. జ్యోత్స్న చేసిన పనిని పారిజాతం తెగ మెచ్చుకుంటుంది. దశరథ నేను ఆ ఇంటికి రాలేను. నువ్వు సుమిత్ర వెళ్ళి వాళ్ళను ఇంటికి తీసుకు రమ్మని శివనారాయణ కొడుక్కి చెప్తాడు.

ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు నేనే వెళ్ళి తీసుకొస్తానని జ్యోత్స్న అంటుంది. ఒక్కదాన్నే వెళ్ళి అత్తకు విషయం చెప్పి సర్ ప్రైజ్ చేస్తానని జ్యోత్స్న కార్తీక్ ఇంటికి బయల్దేరుతుంది. అనసూయ నరసింహ దగ్గరకు వస్తుంది. కొడుక్కి బాగా గడ్డి పెడుతుంది. నీ మేనకోడల్ని నేను ఎలాగైనా చంపుతానని అంటాడు.

పోలీసులకు పట్టించిన అనసూయ 

అప్పటి దాకా నువ్వు బయట ఉంటే కదా అని పోలీసులను పిలిపించానని చెప్తుంది. నీలాంటి రాక్షసులు ఉండాల్సింది బయట కాదు జైల్లో అంటుంది. పోలీసులను చూసి నరసింహ పారిపోబోతుంటే అనసూయ అడ్డుకుని అప్పగిస్తుంది. పోలీసులు పట్టుకునేసరికి నరసింహ కర్ర తీసుకుని తల్లిని కొడతాడు.

కార్తీక్ తన బాధను తల్లితో పంచుకుంటాడు. శౌర్య చాక్లెట్ అడిగినట్టుగా నా జీవితాన్ని అడుగుతుంది. పసి దానికి ఆ ప్రశ్న లోతు ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకు తెలుసు కదా అంటుంది. ఆ పసిపిల్ల తండ్రి కోసం ఆరాటపడుతుంది. నీలాంటి మంచి మనసు ఉన్న తండ్రి కోసం వెంపర్లాడుతుంది.

ఎందుకు వెళ్లిపోతున్నావ్ 

అది ఎవరిని అడగాలో తెలియక నిన్ను అడుగుతుంది. అది నువ్వు తీర్చలేని కోరిక అని నాకు తెలుసు. పసిదాని బాధ చూసి దేవుడు తనకు మంచి తండ్రిని ఇస్తే బాగుండని కాంచన బాధగా అంటుంది. పాప ఆరోగ్యం గురించి దీపకు చెప్తావా అంటే చెప్పనని అంటాడు.

అప్పుడే దీప ఇంటికి వస్తుంది. బ్యాగ్ ఏంటి ఎవరికీ చెప్పకుండా ఊరికి వెళ్ళడం ఏంటని అడుగుతాడు. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటే జ్యోత్స్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఎవరైనా ఏమైనా అంటేనే వెళ్లిపోవాలా? అని అంటుంది. ఎవరికీ చెప్పకుండ నీ కూతురు రాను అన్నా కూతురిని బలవంతంగా ఎందుకు తీసుకెళ్లిపోతున్నావని అంటాడు.

మా అత్త ఊరుకోదు 

నేను సుమిత్రమ్మ ఇంటికి వచ్చింది మీ పెళ్లి చూడటానికి అది జరగదని అర్థం అయ్యింది. అందుకే వెళ్లిపోతున్నానని చెప్తుంది. ఇక్కడే ఉంటే నరసింహ ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా అని అడుగుతాడు. నన్ను చంపాలని అనుకున్నాడు కుదరలేదు నా మెడలో తాళి తెంపి మంటల్లో వేశాడు.

ఈసారి నా జోలికి నా బిడ్డ జోలికి వస్తే అవే మంటల్లో వేసి వాడిని తగలబెడతాను. నాకంటే ముందే మా అత్త ఊరుకోదు. వాడి సంగతి తేలుస్తానని వెళ్ళింది. ప్రశాంతంగా వెళ్ళక నాకు ఎందుకు ఈ గొడవలు నా బిడ్డను తీసుకుని వెళ్లిపోతున్నానని చెప్తుంది. శౌర్య ఎక్కడికి రాదు మీరు ఇక్కడే ఉండండి అంటాడు.

శౌర్య ఎక్కడికీ రాదు 

తమను వదిలేయమని దీప అంటుంది. శౌర్య ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తను నాకు బాగా అలవాటు అయ్యింది ఊరు వెళ్ళిపోయిన నాకోసం రాదని గ్యారెంటీ ఏంటని గట్టిగా అడుగుతాడు. కానీ దీప మాత్రం తన కూతురిని తీసుకుని వెళ్లిపోతానని అంటే ఈ పరిస్థితిలో శౌర్యను ఎక్కడికీ పంపించలేనని అంటాడు.

దీప ఎన్ని చెప్పినా వినిపించుకోడు. దీప మీరు ఎక్కడికీ వెళ్ళడం లేదు శౌర్య కూడా రాదు అని కోపంగా చెప్తాడు. నాకు ఇప్పుడు నీకంటే శౌర్య క్షేమంగా ఉండటం ముఖ్యం. ముందు నరసింహను పట్టుకుని వాడిని జైల్లో పెట్టిస్తాను. అప్పుడు మీరు ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు శౌర్య ఎక్కడికి రాదని చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner