Karthika deepam october 15th episode: రోడ్డుపై జ్యోత్స్న చెంప పగలగొట్టిన వంటలక్క-మరోసారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప-karthika deepam 2 serial today october 15th episode sourya plans to meet karthik and deepa gets tensed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 15th Episode: రోడ్డుపై జ్యోత్స్న చెంప పగలగొట్టిన వంటలక్క-మరోసారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప

Karthika deepam october 15th episode: రోడ్డుపై జ్యోత్స్న చెంప పగలగొట్టిన వంటలక్క-మరోసారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప

Gunti Soundarya HT Telugu
Oct 15, 2024 07:12 AM IST

Karthika deepam 2 serial today october 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ తో అక్రమ సంబంధం అంటగడుతూ జ్యోత్స్న రోడ్డు మీద దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో దీప కోపంగా తన చెంప పగలగొడుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 15వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 15వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today october 15th episode: దీప రోడ్డు మీద కనిపిస్తే జ్యోత్స్న గొడవ చేస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో వాళ్ళ చుట్టూ జనాలు చెరతారు. నా బావను నీ చుట్టూ తిప్పుకోవడం మానేయమని అంటుంది. అక్కడి ఉన్న వాళ్ళు దీప గురించి నీచంగా మాట్లాడతారు.

చెంప పగలగొట్టిన దీప 

నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనని దీప వార్నింగ్ ఇస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఆపకపోయే సరికి లాగిపెట్టి చెంప మీద ఒకటి ఇస్తుంది. దీంతో జనాలు అందరూ వెళ్లిపోతారు. నువ్వు అన్న మాటలకు చేత్తో కాదు చెప్పుతో కొట్టాలని అంటుంది. నా జీవితంలో నా కూతురికి తప్ప వేరొకరికి స్థానం లేదని ఎన్ని సార్లు చెప్పాలి.

ఈ మాట నిజమని నిరూపించాలంటే ఏం చేయాలని దీప అడుగుతుంది. మా ఇంట్లో నుంచి పో నువ్వు పోతే మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇన్ని ఘోరాలు జరిగిన ఎందుకు మా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావో తెలుసా? మా బావ కోసం. ఎలాగైనా నీ కూతురిని అడ్డుపెట్టుకుని బావను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావ్.

ఇంట్లో నుంచి పో దీప 

మా ఇంటికి రా అని పిలిచిన నోటితోనే చెప్తున్నాను మా ఇంట్లో నుంచి మా జీవితాల్లో నుంచి దూరంగా పో దీప. నువ్వు పోతే మేం మనశ్శాంతిగా ఉంటాం. నువ్వు ఉంటే మా బావ నాకు దక్కడు. ఇంత జరిగినా నువ్వు ఇంట్లో ఉంటే నీ మనసులో టప్పుడు ఉద్దేశం ఉన్నట్టే.

నువ్వు పోతేనే నాకు మాబావ దక్కుతాడు. నీకు ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా ఈ క్షణమే ఇంట్లో నుంచి పో లేదంటే నువ్వు మా బావ మీద ఆశపడుతున్నట్టే అని జ్యోత్స్న అనేసరికి దీప కోపంగా వెళ్ళిపోతుంది. ఇంటికి రాగానే దీప బట్టలన్నీ సర్దుతుంది. ఎక్కడికి వెళ్తున్నామని అంటే మన ఊరికి వెళ్తున్నామని అంటుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప 

మళ్ళీ ఎప్పుడు వస్తామని శౌర్య అడుగుతుంది. తర్వాత చెప్తానులే అంటే సరే ముందు కార్తీక్ కి ఫోన్ చేసి చెప్తానని ఫోన్ తీసుకుంటుంది. నేను చెప్తానులే అంటే ఇద్దరూ ఫోన్ లాక్కుంటారు దీంతో పగిలిపోతుంది. బూచోడు వచ్చిన సంగతి కార్తీక్ తో చెప్పాలని శౌర్య అంటుంది.

దీప కోపంగా కార్తీక్ నీ ఫ్రెండ్ తను అమ్మలా ఎప్పుడూ నీతోనే ఉండదని కోపంగా చెప్తుంది. కార్తీక్ తో మాట్లాడకుండా రానని శౌర్య మొండికేస్తుంది. మరొకసారి మీకేవరికీ చెప్పకుండా వెళ్లిపోతున్నాను క్షమించమని దీప మనసులోనే సుమిత్రకు క్షమాపణలు చెప్పుకుంటుంది.

ఆస్తి బావ రెండూ కావాలి 

శౌర్య రానని అంటున్నా దీప బలవంతంగా తనని తీసుకుని వెళ్తుంది. వాళ్ళను జ్యోత్స్న, పారిజాతం చూస్తారు. అది వెళ్లిపోతే ఇప్పుడు నష్టం మనకే అని పారిజాతం అంటుంది. కానీ జ్యోత్స్న వినిపించుకోదు. దీప ఉన్న దగ్గర నుంచి అన్నీ దరిద్రాలే. చచ్చిపోతానని బెదిరించి బావను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.

కానీ బావ లాగిపెట్టి కొట్టి నిజం చెప్పాడు. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే తాత నన్ను గెంటేస్తాడు. నాకు బావ ఈ ఆస్తి కావాలి. అందుకే అన్నింటికీ దీప అడ్డు. అందుకే దాన్ని పంపించేశాను. ఇప్పుడు ఎలాగైన పెళ్లి గురించి ఇంట్లో ఒప్పించాలని డిసైడ్ అవుతుంది.

దీపకు తెలియకుండా వెళ్ళిపోయిన శౌర్య 

శౌర్య మళ్ళీ కార్తీక్ గోల మొదలుపెడుతుంది. దీంతో దీప సీరియస్ అవుతుంది. నువ్వు కార్తీక్ బాబులో నాన్నను చూసుకుంటున్నావని అర్థం అవుతుంది. ఈరోజు జ్యోత్స్న అన్న మాటలు నలుగురూ అంటారు అది మంచిది కాదని దీప అనుకుంటుంది.

అమ్మ ఊరు తీసుకెళ్లిపోతే కార్తీక్ ని చూడకుండా వెళ్ళిపోవడం ఇష్టం లేదు ఎలాగైనా తనని చూడాలని శౌర్య అనుకుని దీప చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య పరిగెత్తుకుంటూ కార్తీక్ ఇంటికి వెళ్లబోతుంది. తనని వెతుక్కుంటూ దీప కూడా కార్తీక్ ఇంటికి బయల్దేరుతుంది.

స్పృహ కోల్పోయిన శౌర్య 

ఎలాగైనా కార్తీక్ ని కలిసి ఊరు వెళ్ళను నీతోనే ఉంటానని చెప్పాలని శౌర్య అనుకుంటుంది. దీప కార్తీక్ ఇంటి వైపు రావడం చూసి శౌర్య కనిపించకుండా దాక్కుంటుంది. అప్పుడే కార్తీక్ ఇంట్లో నుంచి బయటకు వెళతాడు. దీప ఇంట్లోకి వస్తుంది. వెంటనే శౌర్య కార్తీక్ కారు వెంట తనని పిలుస్తూ పరిగెడుతుంది.

దీప హడావుడిగా కాంచన దగ్గరకు వచ్చి శౌర్య ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. రాలేదని కాంచన చెప్తుంది. శౌర్యకు ఏమైందని అంటే ఏం లేదని చెప్పి హడావుడిగా వెళ్ళిపోతుంది. శౌర్య కారు వెనుక పరిగెత్తడం కార్తీక్ చూస్తాడు. పరిగెత్తి శౌర్య స్పృహ తప్పి పడిపోతుంది.

కార్తీక్ పరుగున తన దగ్గరకు వెళతాడు. వెంటనే తనని తీసుకుని వెళ్ళిపోతాడు. దీప శౌర్య కోసం ఏడుస్తూ రోడ్డు మీద వెతుకుతూ ఉంటుంది. తనకు కాశీ ఎదురుపడతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner