Karthika deepam october 12th episode: తాళి కట్టకపోతే చస్తానని బెదిరించిన జ్యోత్స్న-కార్తీక్ మరదలిని పెళ్లి చేసుకుంటాడా?
Karthika deepam 2 october 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న ఆవేశంగా తాళి పట్టుకుని కార్తీక్ ఇంటికి వస్తుంది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేనని తాళి కట్టమని అడుగుతుంది. తాత పర్మిషన్ లేకుండా తాళి కట్టేది లేదని చెప్తాడు.
Karthika deepam 2 serial today october 12th episode: దీప మెడలోని తాళిని నరసింహ తెంచేస్తాడు. దీంతో అది ఎగిరి నిప్పుల్లో పడిపోయి కాలిపోతుంది. తాళి తెగిపోవడంతో దీప షాక్ అయిపోతుంది. వెంటనే దీప కోపంగా అక్కడే ఉన్న రాయి తీసుకుని నరసింహ మీదకు ఎత్తెసరికి పారిపోతాడు. తాళి అని ఏడుస్తుంటే అగ్నిసాక్షిగా కట్టిన తాళి కాలిపోనీవ్వు అని అనసూయ అంటుంది.
దరిద్రం వదిలిపోయింది
కోర్టు విడాకులు ఇచ్చి మనషులుగా దూరం చేసింది. నిజమైన విడాకులు దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఇక వాడికి నీకు ఏ సంబంధం లేదు. వాడు అసలు మనిషే కాదు. అమ్మవారి పూజ చేస్తే మంచి జరుగుతుంది అన్నావ్ కదా మంచే జరిగింది. కాలిపోతున్న తాళితోనే దరిద్రం వదిలిపోయింది.
నీ మెడలో తాళి ఉరితాడులా కనిపించేది. తియ్యమంటే తీయలేదు. అమ్మవారే నీకు మూడు ముళ్ళ నుంచి విముక్తి కలిగించింది. నాకు చాలా ఆనందంగా ఉందని అనసూయ దీపను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నువ్వు నా కోడలిగా చచ్చిపోయావ్ ఇప్పుడు నువ్వు నా తమ్ముడు కూతురివి అని భరోసా ఇస్తుంది.
వారసురాలిని వెతుకుతా
దీప కాలిపోయిన తాళిని చూసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. దాసు ఎలాగైనా అసలు వారసురాలిని వెతికి పట్టుకోవాలని అనుకుంటాడు. పార్కులో కూర్చుని దీని గురించే ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒకడు పదే పదే దాసు దగ్గరకు వచ్చి మొహం చూసి వెళ్తూ ఉంటాడు.
వాడిని పట్టుకుని ఎందుకు నన్ను చూస్తున్నావని అడుగుతాడు. నేను ఆర్టిస్ట్ బొమ్మలు వేస్తానని అతను తనని పరిచయం చేసుకుని మీ బొమ్మ గీశానని చూపిస్తాడు. ఇంటి వారసురాలిని తీసుకెళ్లిన మనిషి మొహం గుర్తుంది కదా అతడి బొమ్మ గీయించాలని దాసు నిర్ణయించుకుంటాడు.
సంతోషంగా స్వప్న
జ్యోత్స్న తన జీవితం నాశనం అయిపోతుందని రగిలిపోతుంది. పెళ్లి చూపులకు వచ్చినంత మాత్రాన వాడు నీకు నచ్చాలి కదా. నచ్చలేదని చెప్పమని పారు చెప్తుంది. దీప చాలా ప్లాన్ గా ఫ్యామిలీని రెండు ముక్కలు చేసింది. నేను సైలెంట్ గా ఉంటే వీళ్ళు పెళ్లి చేస్తారు.
అలా జరగకూడదు అంటే నేను చేయాల్సింది నేను చేస్తానని ఆవేశంగా వెళ్ళిపోతుంది. ఈసారి ఏం జరుగుతుందోనని పారు టెన్షన్ పడుతుంది. స్వప్నను సాఫ్ట్ వేర్ కోర్సు నేర్చుకోమని కాశీ సలహా ఇస్తాడు. తాను ఉద్యోగం చేయనని ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేస్తానని చెప్తుంది.
నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకొను
దాసు అతడితో బొమ్మ గీయించుకుని ఇంటికి వస్తాడు. అతడు ఎవరో ఎక్కడ ఉంటాడో వెంటనే కనిపెట్టాలని అనుకుంటాడు. దీప మాట కాదనలేక అక్కడి వరకు వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సిందని కాంచన బాధపడుతుంది. ఇప్పటి వరకు పెళ్లి విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకుంటారని ఆశ ఉండేది.
కానీ ఎప్పుడైతే నా మేనకోడలికి వేరే సంబంధం చూసినప్పుడే అర్థం అయ్యింది నేను పుట్టింటికి దూరం అయ్యానని అంటుంది. అప్పుడే జ్యోత్స్న ఆవేశంగా ఇంట్లోకి వస్తుంది. మళ్ళీ ఎందుకొచ్చావని కార్తీక్ ని అడుగుతుంది. నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకొనని చెప్తుంది.
తాళి కట్టు బావ
నన్ను తప్ప ఎవరికైనా నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు మీ తాత అని కోపంగా చెప్తాడు. నా పెళ్లి విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన రెండు కుటుంబాలని కలపాలి అంటే నేను తీసుకున్న నిర్ణయం గౌరవించాలని అంటుంది.
ఏం నిర్ణయం తీసుకున్నావని అంటే తాళిబొట్టు చూపిస్తుంది. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ తాళి నా మెడలో కట్టు మన పెళ్లి ఎవరు ఆపుతారో చూస్తానని అంటుంది. ముందు ఇంటికి వెళ్ళమని కార్తీక్ చెప్తాడు. నీ బాధ నాకు అర్థం అవుతుంది నేను దీని గురించి వదినతో మాట్లాడతానని కాంచన సర్ది చెప్పడానికి చూస్తుంది.
విషం తాగి చస్తా
కాంచన ఎన్ని చెప్పినా జ్యోత్స్న మాత్రం వినిపించుకోదు. ఇప్పటికే మా నాన్న ఒక తప్పు చేశాడు. ఇప్పుడు మరొక తప్పు చేయలేనని కార్తీక్ అంటాడు. అన్నీ ఆలోచించే వచ్చాను తాళి కట్టమని జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది. అనుకున్నది జరగకపోతే ఏదైనా చేస్తాను.
నీకోసం చావమంటే చస్తాను అంతేకానీ నా మెడలో తాళి కట్టను అని చెప్పకని జ్యోత్స్న అంటుంది. మన పెళ్లి జరగాలి అంటే అది రెండు కుటుంబాల సమక్షంలో వారి అంగీకారంతోనే జరుగుతుంది లేదంటే మర్చిపోమ్మని చెప్తాడు. అలా ఎప్పటికీ జరగదని జ్యోత్స్న తెగేసి చెప్తుంది.
వెంటనే తాళి కట్టమని అంటుంది. నేను మీ తాతకు చెప్పకుండ నీ మెడలో తాళి కట్టలేనని కార్తీక్ తెగేసి చెప్తాడు. నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే నేను విషం తాగి ఇక్కడే చస్తానని బెదిరిస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్