Karthika deepam october 10th episode: దీప ప్లాన్ సక్సెస్, థాంక్స్ చెప్పిన జ్యోత్స్న- పెళ్లి ఫిక్స్ చేసిన శివనారాయణ-karthika deepam 2 serial today october 10th episode kanchana and sumithra are happy after meeting each other ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 10th Episode: దీప ప్లాన్ సక్సెస్, థాంక్స్ చెప్పిన జ్యోత్స్న- పెళ్లి ఫిక్స్ చేసిన శివనారాయణ

Karthika deepam october 10th episode: దీప ప్లాన్ సక్సెస్, థాంక్స్ చెప్పిన జ్యోత్స్న- పెళ్లి ఫిక్స్ చేసిన శివనారాయణ

Gunti Soundarya HT Telugu
Oct 10, 2024 07:17 AM IST

Karthika deepam 2 serial today october 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప వేసిన ప్లాన్ ప్రకారం సుమిత్ర, కాంచన కలుసుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎమోషనల్ అవుతారు. అదే సమయానికి అటు శివనారాయణ జ్యోత్స్నకు వేరే సంబంధం మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

సుమిత్ర ఇంట్లో పూజ చేసుకునేందుకు దీప ఒప్పుకుంటుంది. ఈ పూజతో అయినా అమ్మవారు ఇంటి కష్టాలు తొలగించాలని సుమిత్ర కోరుకుంటుంది. వాళ్ళ మాటలు విన్న జ్యోత్స్న రగిలిపోతుంది. పెళ్లి గురించి మాట్లాడుకోవడం మానేసి పూజ గురించి మాట్లాడుతుంది.

నువ్వు దాసు కూతురివి

దీప మా మమ్మీకి కూతురు అయితే మరి నేనేవరు అని జ్యోత్స్న అంటే దాసు కూతురివి అని పారిజాతం కౌంటర్ వేస్తుంది. నేను సుమిత్ర కూతురిని నిద్రలో లేపి అడిగినా ఇదే చెప్పాలని తిడుతుంది. దీప ఎందుకు పూజ చేస్తుందో కనిపెట్టాలని జ్యోత్స్న పారు అనుకుంటారు.

నువ్వు చేసే పని మంచిదే కానీ దీన్ని ఇప్పుడే ఆపడం మంచిదని అనసూయ భయపడుతూ అంటుంది. పెద్దాయన ఏదైనా మాటలు అంటే తట్టుకునే శక్తి కాంచనకు లేదు ఇది పెద్ద గొడవ అయ్యేలా ఉందని చెప్తుంది. ఈ రెండు కుటుంబాలను కలపడం నా బాధ్యత.

పెళ్లి చేయడమే లక్ష్యం

కార్తీక్ బాబు, జ్యోత్స్న పెళ్లి చేయడం నా లక్ష్యం. నన్ను కాపాడటానికి కార్తీక్ బాబు రాకపోయి ఉంటే వాళ్ళ పెళ్లి జరిగి ఉండేది. అప్పుడు శ్రీధర్ రెండో పెళ్లి విషయం తెలిసినా మనవరాలి కోసమైన ఏమి అనేవాళ్లు కాదు. ఈ పెళ్లి జరగడం కోసం ఎన్ని అవమానాలైన పడతాను.

మరోవైపు నరసింహ పోలీసులకు దొరకలేదు. మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు ప్రమాదం మన చుట్టూ పొంచి ఉందని అంటుంది. ఆ మాటలు నరసింహ ఇంటి కిటికీ దగ్గర నిలబడి వింటాడు. త్వరలోనే వంటలక్కను పైకి పంపించాలని అనుకుంటాడు.

శౌర్యను చూసి మురిసిన సుమిత్ర

సుమిత్ర ఇంట్లో పూజకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. శౌర్యను సుమిత్ర బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తుంది. ఇంట్లో తాతయ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారని దీప సుమిత్రను అడిగితే బయటకు వెళ్లారని పూజకు కూడా రాకపోవచ్చని చెప్తుంది.

ఎలాగైనా కాంచన, కార్తీక్ బాబును ఇంట్లోకి తీసుకురావాలని అనుకుంటుంది. అప్పుడే పూజ కోసం కాంచన వాళ్ళు వస్తారు. శౌర్యను చూసుకుని సుమిత్ర మురిసిపోతుంది. దీప వచ్చి పూజ సుమిత్రమ్మ ఇంట్లో జరుగుతుందని చెప్తుంది. ఆ విషయం చెప్తే ముందే ఆగిపోయే వాళ్ళం కదాని కార్తీక్ కోపంగా అంటాడు.

కాంచనను ఒప్పించిన దీప

ఆ ఇంట్లో అయినా పూజ చేసుకుంటుంది తానేనని దీప అంటుంది. నువ్వు ఈ ఇంటికి సొంత మనిషివి కావచ్చు కానీ మేం ఇప్పుడు పరాయి వాళ్ళమని చెప్తాడు. నేను మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్లిపోయే దాన్ని అని దీప అంటుంది. నాన్న, అన్నయ్య లేకపోయిన ఇంట్లోకి రాలేమని కాంచన చెప్తుంది.

దీప మాత్రం మీరు వచ్చింది నాకోసం కాబట్టి నా మనుషులుగానే రండి. మిమ్మల్ని ఆపేవాళ్ళు అక్కడ ఎవరూ లేరని దీప అంటుంది. వాళ్ళను ఒప్పించి ఇంట్లోకి తీసుకెళ్తుంది. శౌర్య వచ్చి కార్తీక్ ని ఇంట్లోకి పిలుస్తుంది. దీప ఇంట్లోకి వచ్చి పూజకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు మీకేం అభ్యంతరం లేదు కదాని సుమిత్రను అడుగుతుంది.

కలుసుకున్న సుమిత్ర, కాంచన

కాంచన వాళ్ళను చూసి సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. పారిజాతం, జ్యోత్స్న కూడ వాళ్ళను చూసి సంతోషిస్తారు. తన బాధను అంతా సుమిత్ర చెప్పుకుంటుంది. తప్పు చేసిన మనిషిలా తలదాచుకోవడం ఎందుకు అందుకే వచ్చానని కాంచన ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

కొద్ది రోజులు ఓపిక పడితే కోపలు చల్లారి అంతా కలుస్తామని సుమిత్ర ధైర్యం చెప్తుంది. హాల్లో ఫ్యామిలీ ఫోటో లేకపోవడం గమనించిన కాంచన ఫోటో ఏది అని అడుగుతుంది. సుమిత్ర మౌనంగా తలదించుకుంటుంది. నాన్న తీసి విసిరేశారా? మా ఫోటోకి ఇంట్లో చోటు లేకపోతే మాకేం చోటు ఉంటుంది.

దీపకు థాంక్స్ చెప్పిన జ్యోత్స్న

మేం ఇప్పుడు దీప మనుషుల్లాగే వచ్చాం. మమ్మల్ని అలాగే చూడమని కాంచన అంటుంది. నువ్వు ఎప్పుడూ ఈ ఇంటికి ఆడపడుచువు. మిమ్మల్ని పిలిచినందుకు దీపకు థాంక్స్ చెప్పాలి అని జ్యోత్స్న తనకు థాంక్స్ చెప్తుంది. శివనారాయణ దశరథ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటారు.

జ్యోత్స్న, కార్తీక్ కి పెళ్లి జరిగిన తర్వాత శ్రీధర్ బావ విషయం తెలిస్తే ఏం చేసే వాడివని దశరథ అడుగుతాడు. అప్పుడు నా కూతురితో పాటు నీ కూతురు కూడా పుట్టింటికి దూరం అయ్యేది. వాళ్ళకు కలిసే రాత లేదు అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు మనం దాని గురించి వదిలేసి ఇంటికి వెళ్ళగానే పెళ్లి సంబంధం ఖాయం అయిన విషయం చెప్పాలని పెద్దాయన అంటాడు.

అంతా ఒకే అయితే వచ్చే ముహూర్తాలలోనే జ్యోత్స్నకు పెళ్లి చేద్దామని చెప్తాడు. అందుకు దశరథ కూడా అంగీకరిస్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner