Karthika deepam october 1st episode: కార్తీక్ తో వెళ్ళిపోతానన్న జ్యోత్స్న- అదే జరిగితే చావడమే మార్గమన్న శివనారాయణ
Karthika deepam 2 serial:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తప్పు మావయ్య చేస్తే శిక్ష నాకు ఎందుకు వేశారు. నాకు బావతో పెళ్లి కావాలి అంటూ జ్యోత్స్న ఇంట్లో రచ్చ చేస్తుంది. నిర్ణయం మార్చుకోమని శివనారాయణని అడుగుతుంది. కానీ తాను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని తెగేసి చెప్తాడు.
Karthika deepam 2 serial today october 1st episode: కార్తీక్ బావతో నా పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వే. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని అనుకున్నావ్ చేశావ్. నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావ్ చేశావ్. ఇంకెందుకు ఆలస్యం పోయి మా బావను పెళ్లి చేసుకో. దాని కోసమే కదా ఇలా నాటకాలు ఆడిందని జ్యోత్స్న అంటుంది.
దీప తప్పు లేదు
ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడటానికి బుద్ధి ఉండాలని సుమిత్ర తిడుతుంది. నీ కూతురు పెళ్లి చెడిపోయిందని పారు అంటే దానికి కారణం దీప కాదు. తప్పు చేసింది అన్నయ్య, దానికి శిక్ష అనుభవిస్తుంది జ్యోత్స్న. దీన్ని కన్నందుకు లేని ఆశలు పెట్టినందుకు మేము శిక్ష అనుభవించాలి.
దీప పెళ్లి చేయకపోతే స్వప్న కాశీ పెళ్లి చేసుకోరా? ఈ నిజం తర్వాత అయినా బయట పడేది కదా. అప్పుడు మాత్రం క్షమిస్తారని అనుకుంటున్నారా? ఈరోజు కూతురిని కాదనుకున్న మనిషి రేపు మనవరాలిని కాదని అనుకుంటారు. సంబంధం లేకపోయిన అన్నింటికీ దీపను అనడం అలవాటు అయిపోయింది.
నా కలల మీద కొట్టింది
తప్పు చేసిన మనిషిని వదిలేసి సాయం చేసిన మనిషిని తిడుతున్నారని సుమిత్ర తిడుతుంది. దీప నన్ను చావు దెబ్బ కొట్టింది. గుండెల మీద కొట్టింది, నా ప్రేమ మీద, నా కలల మీద కొట్టింది. నన్ను బతికి ఉండగానే చంపేసిందని జ్యోత్స్న ఏడుస్తుంది.
పారిజాతం కూడా దీపను దరిద్రురాలు అని తిడుతుంది. జ్యోత్స్న మాటలకు దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తాతయ్య ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. తప్పు చేసింది శ్రీధర్ గారు అయితే కార్తీక్ బాబు, కాంచన గారు ఏం చేశారు. ఇప్పుడు కార్తీక్, జ్యోత్స్న పెళ్లి ఎలా చేయాలని దీప అనుకుంటుంది.
కాంచన ఎమోషనల్
కార్తీక్ ని మళ్ళీ లండన్ వెళ్లిపొమ్మని నీతో పాటు నేను వస్తానని కాంచన అంటుంది. అక్కడ ఎవరు ఉన్నారు ఇక్కడ అన్నీ వదులుకుని వెళ్లడానికని అంటాడు. మనకు ఎవరూ లేరు నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరూ మిగల్లేదు. తప్పు చేశాడని మీ తాతయ్య మీ నాన్నను మాత్రమే కాదు నన్నూ వదులుకున్నాడు.
పుట్టింటి మీద నాకున్న ప్రేమ అన్నయ్య మీద నేను పెంచుకున్న మమకారం మీ పెళ్ళితో మరింత పెరుగుతుందని అనుకున్నాను. మీ నాన్న చేసిన ఒక తప్పు నాకు అన్నింటినీ దూరం చేసింది. దీప పరిస్థితి నాకు వచ్చింది. కానీ దీపలా పోరాడే శక్తి నాకు లేదు. పుట్టింటితో బంధం తెగిపోతే ప్రాణం పోయినట్టే. మనం ఎక్కడికైనా వెళ్లిపోదామని కాంచన ఏడుస్తుంది.
జ్యోత్స్న రచ్చ
మనం వెళ్లిపోతే తాతయ్య, మావయ్యను మర్చిపోతావా అని కార్తీక్ అడుగుతాడు. జన్మనిచ్చిన తండ్రి, రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువులు ప్రపంచంలో ఎక్కడా దొరకరు వాళ్ళను ఎలా మర్చిపోతాను అని ఎమోషనల్ అవుతుంది. వయసు పెరిగింది కానీ తాతయ్యకు బుద్ధి లేదని కార్తీక్ అంటే కాంచన తన తండ్రిని ఏమి అనొద్దని అంటుంది.
ఆయన స్థానంలో నేను ఉన్నా ఇదే పని చేసేదాన్ని అని అంటుంది. తల్లి పరిస్థితి చూసి కార్తీక్ విలవిల్లాడిపోతాడు. జ్యోత్స్న ఇంట్లో రచ్చ మొదలుపెడుతుంది. నేనేం తప్పు చేశాను నాకెందుకు ఈ శిక్ష. బావతో పెళ్లి జరగదని సంబంధం వద్దని అత్తతో చెప్పి వచ్చారని జ్యోత్స్న తండ్రిని నిలదీస్తుంది.
నేను ఇష్టాన్ని చంపుకోవాలా?
అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా అంటాడు. మీరు మనసు మార్చుకున్నంతగా నేను మార్చుకోలేను. ఊహ తెలిసినప్పటి నుంచి బావ నీ మొగుడు అని అందరూ అన్నారు. అప్పటి నుంచి నేను బావ ఒక్కటే అనుకున్నాను. బావతో జీవితం ఊహించుకున్నాను.
అలా ఊహించుకునేలా చేయడం నా తప్పా మీ తప్పా? పెళ్లి అన్నారు నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహూర్తాలు పెట్టారు. మీకు అనుకూలంగా ఉందని పెళ్లి చేస్తాం అన్నారు. ఇప్పుడు మీకు అనుకూలంగా లేదని నా ఇష్టాన్ని చంపుకోమని అంటే ఎలా? అని నిలదీస్తుంది.
నింద నువ్వు మోయాలి
మీ మావయ్య చేసిన తప్పుకు నా కూతురు, కొడుకు బతికున్నంత కాలం నిందలు మోయాల్సిందే. నిన్ను ఆ ఇంటికి కోడలిని చేస్తే ఆ నిందను, చెడ్డ పేరును నువ్వు మోయాల్సి వస్తుంది. అలాంటి ఖర్మ నీకు పట్టకూడదని అనుకున్నాను. గౌరవంగా బతకాలని ఈ నిర్ణయం తీసుకున్నానని శివనారాయణ చెప్తాడు.
నాకు బావ కావాలి తాత. మా ఇద్దరికీ పెళ్లి చేయండి. మీ కళ్ల ముందు ఉండటం ఇష్టం లేకపోతే మేం ఫారిన్ వెళ్లిపోతామని అడుగుతుంది. ఫారిన్ కాదు ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్న శ్రీధర్ కోడలివి అవుతావని అంటాడు. అయితే పరవాలేదు నేను నిందను మోస్తానని చెప్తుంది.
అదే జరిగితే నేను చావాలి
నువ్వు ఫారిన్ వెళ్తే మేం ఎక్కడికి వెళ్ళాలి. సొసైటీలో మనకు గుర్తింపు, మాటకు మర్యాద నమ్మకం ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లిపోతాం. తర్వాత రెస్టారెంట్ లో తినడానికి వచ్చినవాళ్ళు శ్రీధర్ గురించి మాట్లాడుతూ వెటకారంగా అడుగుతారు.
అప్పుడు నేను ఆలోచించకుండా పై అంతస్తు నుంచి కిందకు దూకేయాలి. నా పరిస్థితి మాత్రమే కాదు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నలుగురు వేలెత్తి చూపించే పరిస్థితి మనమే తెచ్చుకోవడమే అవసరమా? నీ భవిష్యత్ గురించి ఆలోచించే మనసుకు కష్టంగా ఉన్న ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తాడు.
బావను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకొను
నాకు బావ కావాలి నేను పెళ్లి చేసుకుంటాను. మీకు మా పెళ్లి చేయడం పరువు తక్కువ అయితే నేను బావతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటానని అంటుంది. అప్పుడు శివనారాయణ మనవరాలు లేచిపోయిందని అంటారు. నేను జనాలను పట్టించుకొనని తాతకు ఎదురుచెప్తుంది.
నాకు బావ మాత్రమే కావాలి అంతే అని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వెళ్ళి వాళ్ళకు చెప్పడం కూడా జరిగిపోయింది. ఇక ఈ పెళ్లి ప్రస్తావన మర్చిపోవడం మంచిదని చెప్తాడు. నేను బావను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకొనని అంటుంది.
నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదని శివనారాయణ అంటే అర్థం అవుతుంది నువ్వొక స్వార్థపరుడివి అని జ్యోత్స్న వేలెత్తి చూపిస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్