Karthika deepam october 15th episode: ఊహించని మలుపు- కార్తీక్ ని నాన్నగా ఉండమన్న శౌర్య- జ్యోత్స్న సూసైడ్ ప్లాన్ సక్సెస్
Karthika deepam 2 serial today october 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కథ ఊహించని మలుపు తీసుకుంది. తనకు నాన్నగా ఉండమని కార్తీక్ ని శౌర్య అడుగుతుంది. అటు బావతో పెళ్లి చేయమని జ్యోత్స్న సూసైడ్ నాటకం ఆడుతుంది. దీంతో శివనారాయణ పెళ్ళికి ఒకే చెప్తాడు.
Karthika deepam 2 serial today october 16th episode: దీప రోడ్డు మీద శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంటే కాశీ ఎదురుపడతాడు. ఏమైందని అంటే ఊరు వెళ్లిపోతుంటే శౌర్య కార్తీక్ కోసం వెళ్లిపోయిందని చెప్తుంది. సుమిత్ర ఇంటికి వెళ్ళిందేమోనని దీప అంటే వెంటనే పారిజాతానికి ఫోన్ చేసి కనుక్కుంటాడు. ఇంట్లో ఎవరూ లేరని చెప్తుంది.
శౌర్యకు అరుదైన వ్యాధి
శౌర్య అక్కడికి కూడా వెళ్లకపోతే ఏమైందని దీప టెన్షన్ పడుతుంది. కార్తీక్ శౌర్యను హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. శౌర్య బయటకు ఎందుకు వచ్చిందని అనుకుంటాడు. తనకు గుండె జబ్బు ఉందన్న విషయం దీపకు చెప్పాలని లేదంటే పాపను ఇబ్బందుల్లో పడేసినట్టు అవుతుందని అనుకుంటాడు.
శౌర్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. తనకు వచ్చింది అరుదైన వ్యాధిలాగా ఉందని డాక్టర్ చెప్తాడు. శౌర్యకు ఈ వ్యాధి ఉందని చెప్పలేను కానీ ఉందేమో అని అనుమానంగా ఉందని డాక్టర్ చెప్పేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఒకవేళ తనకు ఈ డీసీజ్ ఉంటే కాపాడుకోవడం ఎలా అంటాడు.
దీపను ఏమన్నావ్?
ఇది ఖర్చుతో కూడుకున్నది. దానికి ఇంజెక్షన్ కూడా ఉన్నాయి రెండు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడంతో కార్తీక్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. పాప మిమ్మల్నే కలవరిస్తుంది, తను మీతో ఉంటే ఆనందంగా బతుకుతుందని చెప్తాడు. పాపకు ఇంత పెద్ద సమస్య వస్తే దీపకు ఎలా చెప్పాలని బాధపడతాడు.
కార్తీక్ సుమిత్రకు ఫోన్ చేసి దీప గురించి అడుగుతాడు. లేదని అంటే దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ మనిషిని కాస్త బతకనివ్వమని ఇంట్లో వాళ్ళకు చెప్పమని కోపంగా అంటాడు. సుమిత్ర కోపంగా జ్యోత్స్నను పిలుస్తుంది. దీపను ఏమన్నావ్ తను ఎందుకు వెళ్లిపోయిందని నిలదీస్తుంది.
గొడవలకు కారణమే దీప
దశరథ దీప వెళ్లిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందని అంటాడు. దీప వెళ్లిపోవడానికి కారణం నేనే అయితే ఏంటని జ్యోత్స్న ఎదురు ప్రశ్నిస్తుంది. దీప నీకు ఏం అన్యాయం చేసిందని సుమిత్ర అంటుంది. శివనారాయణ ఏమైందని అంటే దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తాతయ్య అందుకే అమ్మగారు టెన్షన్ పడుతున్నారని వెటకారంగా అంటుంది.
ఇప్పటి వరకు బావ నాకు భర్త అవుతాడని హోప్ ఉండేది కానీ దీప ఇంట్లో పూజ చేసుకుని అత్త, బావను పిలిచి ఉన్న దూరాన్ని ఇంకా పెంచింది. దీప మనం అనుకున్నంత అమాయకురాలు కాదు అసలు ఈ గొడవలు జరగడానికి కారణం దీప అంటుంది. తనకు బావకు పెళ్లి చేయమని అడిగితే అది జరగదని పెద్దాయన చెప్తాడు.
జ్యోత్స్న సూసైడ్ నాటకం
ఎందుకు జరగదని పారిజాతం అడుగుతుంది. ఈరోజు నా మనవడిని క్షమిస్తే రేపు నీ మనవడిని క్షమించాలి. అలా జరిగితే నేను చచ్చిపోయినట్టే అంటాడు. వద్దు తాత నేనే నా బావ కోసం చస్తానని వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. దీంతో అందరూ కంగారుగా జ్యోత్స్నను పిలుస్తారు.
బావతో పెళ్లి కోసం చావు అంచుల వరకు వెళ్తానని అనుకుంటుంది. మీరు పెళ్లి చేస్తానంటే బయటకు వస్తాను లేదంటే నా చావు నేను చస్తానని బెదిరిస్తుంది. సుమిత్ర, పారిజాతం పెళ్ళికి ఒప్పుకోమని శివనారాయణను అడుగుతారు. నా కూతురు బతకాలంటే అడిగింది చేయాల్సిందే అంటుంది.
కార్తీక్ తో పెళ్లి చేస్తాను
కూతురిని పోగొట్టుకుని నేను బతకలేను అలాగని మీ మాట కాదనలేను. నా కూతురిని ప్రాణభిక్ష పెట్టమని దశరథ కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతాడు. తన కూతురిని బతికించమని సుమిత్ర కూడా ఏడుస్తూ వేడుకుంటుంది. కార్తీక్ తో జ్యోత్స్న పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నానని శివనారాయణ అంటాడు.
ఇచ్చిన మాట కాదన్న వాడివి ఈ మాట ఎలా నమ్మాలని జ్యోత్స్న అడుగుతుంది. తన తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి పెళ్లి చేస్తానని మాట ఇవ్వమని అడుగుతుంది. అలాగే చేయడంతో వెంటనే జ్యోత్స్న బయటకు వచ్చేస్తుంది. నీకు నా మనవడికి పెళ్లి చేసే బాధ్యత తనదని జ్యోత్స్నకు మాట ఇస్తాడు.
బూచోడు వచ్చాడు
శౌర్యను కార్తీక్ ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంట్లో నుంచి దీప వెళ్ళిపోయిన సంగతి అత్తకు కూడా తెలియదని చెప్తాడు. పాప తన దగ్గరే ఉందని దీపకు చెప్పాలని అనుకుంటే ఫోన్ పని చేయడం లేదని అంటాడు. కార్తీక్ దీప కోసం వెళ్తానని అంటే అమ్మ వస్తే నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది.
బూచోడు వచ్చాడు నేను ఇంటి బయట ఉంటే నన్ను ఎత్తుకుపోయాడు. అమ్మ నానమ్మ బూచోడిని కొట్టి నన్ను కాపాడారని చెప్తుంది. నేను ఉండగా బూచోడు రాడని చెప్తాడు. నాకు నాన్న కావాలి కార్తీక్ అని అడుగుతుంది. మీ నాన్న వల్లే కదా ఈ పరిస్థితి అంటే నాకు నాన్నగా బూచోడు వద్దు.
నాన్నగా నువ్వు కావాలి
నాన్నగా నువ్వు కావాలి అనడంతో కార్తీక్, కాంచన షాక్ అవుతారు. నాకు నీ లాంటి మంచి నాన్న కావాలి, నాకు నాన్నగా ఉంటావా? నువ్వు ఉంటే నన్ను బూచోడు ఎత్తుకుపోతాడని భయం ఉండదు. అమ్మకు నానమ్మకు ఏం కాదు అని అడుగుతుంది. దీప కూతురి కోసం రోడ్డు మీద ఏడుస్తుంటే బావ హెల్ప్ తీసుకుందామని కాశీ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు.
శౌర్య కనిపించడం లేదు. అక్క నేను వెతుకుతున్నామని చెప్తాడు. ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు శౌర్య నా దగ్గరే ఉందని అంటాడు. అమ్మకు నేను ఇక్కడే ఉన్నానని చెప్పకని శౌర్య అంటుంది. ఆ మాటలు దీప ఫోన్లో వింటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్