Karthika deepam october 21st episode: 'శౌర్యకు తండ్రిగానే ఉంటాను' కార్తీక్- దీపను తాళి తెంపి పారేయమన్న జ్యోత్స్న
Karthika deepam 2 today october 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. తన మెడలో తాళి ఎందుకు కట్టారని దీప కార్తీక్ ని నిలదీస్తుంది. తాను శౌర్యకు తండ్రిగా మాత్రమే ఉంటానని కార్తీక్ దీపకు హామీ ఇస్తాడు. దీప సుమిత్రకు సమాధానం చెప్పుకోవాలని ఆ ఇంటికి వెళ్తుంది.
Karthika deepam 2 serial today october 21st episode: తన మెడలో తాళి ఎందుకు కట్టారని కార్తీక్ ని నిలదీస్తుంది. తాళి కట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తుంది. నీ కూతురు ఇచ్చింది. నీకు ఇంతకముందే చెప్పాను శౌర్య కోసం అవసరం అయితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటానని అందుకే చేశానని చెప్తాడు.
నాన్నను గొప్పగా ఊహించుకుంది
అందుకని తల్లి మెడలో తాళి కడతారా అని నిలదీస్తుంది. ఫ్రెండ్ లా ఉండాలంటే తాళి కట్టాల్సిన అవసరం లేదు కానీ నాన్నలా ఉండాలంటే తాళి కట్టాలని చెప్తాడు. శౌర్య దృష్టిలో నాన్న అంటే చాలా గొప్పగా ఊహించుకుంది. కానీ నరసింహను చూసిన తర్వాత మంచి నాన్న కావాలని కోరుకుంది.
పాపను తీసుకెళ్లడానికి రెండు సార్లు నరసింహ ప్రయత్నిస్తే నువ్వు కాపాడావు. ఇప్పుడు నువ్వు తనని బలవంతంగా ఊరు తీసుకెళ్లాలని చూసేసరికి దానికి నన్ను ఎక్కడ దూరం చేస్తావోనని భయపడింది. అందుకే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉండాలంటే ఏం చేయాలి?
ఆదర్శం కాదు ఆవేశం
నాన్నగా ఉంటావా అని అడిగింది. ఏం చేయాలో అర్థం కానీ నాకు నీ మాటల్లో నాకు సమాధానం దొరికింది. ఏ అధికారంతో నా కూతురిని ఆపుతున్నారని అన్నావ్. అందుకే అధికారం తీసుకోవాలని అనిపించింది అందుకే తాళి కట్టానని చెప్తాడు. తప్పును సమర్ధించుకోవద్దు.
ఇది ఆదర్శం కాదు ఆవేశం. ఆరోజు హాస్పిటల్ లో శౌర్య మీ కూతురు అని చెప్పారు. ఇప్పుడు అదే నిజం చేస్తూ తాళి కట్టారు. మీ మాటలు చేతలకు నా జీవితం ఏమవుతుందోనని ఆలోచించారా? ఇప్పుడు నా మొహం అందరికీ ఎలా చూపించాలని నిలదీస్తుంది. అన్నింటినీ ఒకటే సమాధానం నీ మెడలో తాళి అంటాడు.
చచ్చిపోతుంది
శౌర్య నాకు కావాలి. నువ్వు దాన్ని బలవంతంగా తీసుకెళ్తే దానికి ఏమైనా అయితే అని ఆవేశంగా అంటాడు. ఏమవుతుందని దీప గట్టిగా నిలదీస్తుంది. చచ్చిపోతుంది దీప అని నోరు జారతాడు. దీప కంగారుగా ఏమన్నారు అని అడిగేసరికి మాట మారుస్తాడు. శౌర్య సంతోషంగా ఉండాలి. అది సంతోషంగా ఉండాలంటే అడిగింది ఇవ్వాలి.
నాన్నను అడిగింది అందుకే నాన్నను ఇచ్చానని చెప్తాడు. నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని అవాలని ఈ తాళి కట్టాను. నేను కేవలం శౌర్యకు తండ్రిగా ఉంటాను. అయిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అని ప్రశ్నిస్తుంది. సమాజం ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంది.
నేను శౌర్యకు నాన్నని
నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడే వాళ్ళకు చెప్పు దెబ్బలాంటిది ఈ తాళి. ఈసారి ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు చెప్తాను. నేను తాళి కట్టింది శౌర్యకు తండ్రిగా ఉండటానికి. నా హద్దుల్లో నేను ఉంటాను. తాళి కట్టాను కదాని భర్తగా ప్రవర్తిస్తానని అనుకోవద్దు.
నేను ఇంతకముందులాగే నీకు గౌరవం ఇస్తాను. నేను శౌర్యకు నాన్ననే. నీ అంతట నువ్వు నన్ను భర్తగా అనుకునేంత వరకు నీకు మాత్రం నేను శ్రేయోభిలాషినే. నీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తినని చెప్తాడు. నువ్వు అవునన్నా కాదన్న ఒకటి నిజం శౌర్య మన బిడ్డ. నువ్వు తల్లివి, నేను తండ్రిని అంటాడు.
సుమిత్ర ఇంట్లో దీప
ఇది జ్యోత్స్న మెడలో పడాల్సిన తాళి. ఇప్పుడు తల్లిలాంటి సుమిత్రమ్మ నన్ను ఏమనుకుంటారు? ఇప్పుడు నేను వాళ్ళకు ఏమని సమాధానం చెప్పుకోవాలి. నేను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలని దీప బాధపడుతుంది. శౌర్య దీప కోసం చూస్తుంది.
ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందని అందరూ కంగారుపడతారు. అమ్మ ఊరు వెళ్ళిందేనని శౌర్య ఏడుస్తుంది. దీప దశరథ ఇంటికి వస్తుంది. పారిజాతం దీపను తిడుతూ ఉంటుంది. అన్నీ తెలిసి దీప కార్తీక్ ని ఎలా పెళ్లి చేసుకుంటుంది. మీరు వెళ్ళి ఆ మనిషిని కడిగి పారేయాలి కదా అంటుంది.
పారిజాతం ఫైర్
నేను ఆ మనిషి కోసం ఆ ఇంటి గుమ్మం తొక్కడం కాదు తనని ఈ ఇంటి గుమ్మం తొక్కనివ్వనని శివనారాయణ అంటాడు. అప్పుడే దీప ఇంట్లోకి అడుగుపెడుతుంది. పారిజాతం దీప మీద ఒంటి కాలి మీద లేస్తుంది. ఈ ఇంటి ఆడపిల్ల మెడలో పడాల్సిన తాళి నీ మెడలో కట్టించుకోవడానికి సిగ్గు లేదా అని నిలదీస్తుంది.
తాను ఏ తప్పు చేయలేదని దీప అంటే చాలు ఆపు జరిగింది ఇంత స్పష్టంగా కనిపిస్తే అర్థం కాదా. నా మనవరాలు మొదటి నుంచి చెప్తూనే ఉంది దీప అవకాశవాది అవసరం వచ్చినప్పుడు బుద్ధి చూపిస్తుందని మేమే నమ్మలేదని అంటాడు. అల్లుడు తప్పు చేస్తేనే క్షమించలేదు నిన్ను ఎలా క్షమిస్తానని శివనారాయణ అంటాడు.
తాళి తెంపేయ్ దీప
కార్తీక్ బాబు తాళి కట్టడంలో నా ఇష్టం ప్రమేయం రెండూ లేవని దీప చెప్తుంది. అయితే తాళి తెంపి అవతల పడేయమని జ్యోత్స్న కోపంగా అంటుంది. ఇష్టం లేనప్పుడు తాళికి విలువ లేదు ఇప్పుడే దీన్ని తెంపి పడేయమని చెప్తుంది. నువ్వు తెంపుతావా నన్ను తెంపమంటావా అని జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది.
అటు ఇంటి దగ్గర దీప కోసం శౌర్య ఏడుస్తుంది. ఎవరికీ చెప్పకుండా దీప ఎక్కడికి వెళ్ళిందని కాంచన అంటుంది. దీప ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసని వెంటనే కార్తీక్ జ్యోత్స్న ఇంటికి బయల్దేరతాడు. నా పెళ్లి చేయడానికి ఇంటికి వచ్చానని అన్నావ్. నా పెళ్లి చెడగొట్టావ్.
జ్యోత్స్న ఆవేదన
నా పెళ్లి చేసి ఇంట్లో నుంచి పోతాను అన్నావ్ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావ్. నా అదృష్టానికి ఎంత దరిద్రం పట్టిందంటే నీ మెడలో పడిన తాళి నేనే తీసుకొచ్చానని చెప్తుంది. కన్నకూతురిని పక్కన పెట్టి దీపకు సపోర్ట్ చేశావ్ కదా ఏం అడగవా అని సుమిత్రను అంటుంది.
అడగటానికి ఏం ఉంది జరగాల్సింది జరిగిపోయింది కదాని దశరథ అంటాడు. మీకు తెలియదు డాడీ అమ్మ దీప మధ్య సెంటిమెంట్ బాగా నడిచింది. వాళ్ళను చూస్తే నాకే వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్లని అనిపించదని జ్యోత్స్న అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.