Karthika deepam november 2nd episode: శివనారాయణ కాళ్ళ మీద పడిన జ్యోత్స్న- కార్తీక్ బాబు భర్త కాదు ఎప్పటికీ దేవుడే-karthika deepam 2 serial today november 2nd episode parijatham upset jyotsna argues with shivanarayana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 2nd Episode: శివనారాయణ కాళ్ళ మీద పడిన జ్యోత్స్న- కార్తీక్ బాబు భర్త కాదు ఎప్పటికీ దేవుడే

Karthika deepam november 2nd episode: శివనారాయణ కాళ్ళ మీద పడిన జ్యోత్స్న- కార్తీక్ బాబు భర్త కాదు ఎప్పటికీ దేవుడే

Gunti Soundarya HT Telugu
Nov 02, 2024 07:13 AM IST

Karthika deepam 2 serial today november 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 2వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ బాబు పక్కన తనది భార్య స్థానం కాదని దీప అంటుంది. తొందర్లోనే దీప తన భార్య అనే విషయం అందరికీ తెలిసేలా చేస్తానని కార్తీక్ అంటాడు.

కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 2 ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 2 ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today november 2nd episode: కార్తీక్ ఫ్రెండ్స్ దీపను పని మనిషి అంటారు. దీంతో కార్తీక్ కోపంగా దీప నా భార్య, శౌర్య నా కూతురు, ఇది నా ఫ్యామిలీ అని చెప్తాడు. నీకెప్పుడు పెళ్లి అయ్యిందని సిరి అడుగుతుంది. అదంతా పెద్ద కథ తర్వాత చెప్తాలే అంటాడు. దీప బాధగా వెళ్ళిపోతుంది.

దీప నీ భార్యగా ఉండే మనిషి కాదు

దీప నీ వైఫ్ అని ఎవరూ అనుకోరు. తను చూస్తే మరీ పల్లెటూరి మనిషిలా ఉంది. దీప నీ పక్కన భార్యగా ఉండే మనిషి కాదని సిరి చెప్తుంది. కానీ కార్తీక్ మాత్రం దీప వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడతాడు. నా పక్కన భార్యగా నిలబడటానికి నేను కోరుకున్న అన్నీ అర్హతలు ఉన్నాయని చెప్తాడు.

ఇదంతా కాంచన, అనసూయ చూస్తారు. వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం ఉంది ఏదో ఒకటి చేసి వాళ్ళని కలపాలని కాంచన అంటుంది. బావ ఎవరి మెడలో తాళి కట్టిన భార్యను మాత్రం నేనే. దీప ఉన్న ప్లేస్ నాది. దీపను చంపేసి అయినా నేను బావను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న చెప్తుంది.

ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావాలి

మన టార్గెట్ కార్తీక్ ని పెళ్లి చేసుకుని యావదాస్థికి వారసురాలివి కావాలి. మనం ఏదైనా చేయాలంటే ఇంట్లోనే సపోర్ట్ లేదు. అందుకే ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తెచ్చుకోవాలి. అన్నింటికీ మూలం శివనారాయణ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడమని పారిజాతం చెప్తుంది.

ఆ పని చేయలేనని అంటుంది. అయితే దాసు కూతురిగానే బతుకుతావా అంటే దాని కంటే చావడం బెటర్ అంటుంది. అయితే వెళ్ళి కాళ్ళు పట్టుకోమని సలహా ఇస్తుంది. తన వల్ల కార్తీక్ బాబుకు అవమానం జరిగిందని దీప ఫీల్ అవుతుంది. అలా అని నేనేమీ చెప్పలేదు కదా అని కార్తీక్ అంటాడు.

ఎంత మంచి కోడలు

దీప నువ్వు నా భార్యవి వీలైనంత త్వరగా ఇదే విషయం అందరికీ అర్థం అయ్యేలా చేస్తానని చెప్తాడు. మీ త్యాగానికి తాను అర్హురాలిని కాదని అంటుంది. ఇద్దరి మధ్య దీని గురించి కాసేపు వాదన జరుగుతుంది. కొడుకు మాటలు విని కాంచన సంతోషపడుతుంది.

ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలు అనుకునే మనుషులలో నేను ఏమైపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు బాగుంటే చాలు అనుకునే కోడలు నాకు ఎక్కడ దొరుకుతుందని కాంచన అంటుంది. నా భార్య, కూతురి గురించి అందరికీ తెలిసేలా చేస్తానని కార్తీక్ తెగసి చెప్తాడు.

కార్తీక్ బాబు నాకు దేవుడు

నాది ఈ ఇంటి కోడలి స్థాయి కాదు పని మనిషి స్థాయి అని దీప బాధగా అంటుంది. అందుకే నువ్వు ఈ పాత చీరలు, చింపిరి జుట్టు మానేసి కార్తీక్ బాబు భార్యగా ఉండమని అనసూయ చెప్తుంది. కానీ దీప మాత్రం కార్తీక్ బాబు నా భర్త అని మీరు అనుకుంటున్నారు కానీ ఆయన ఎప్పుడూ నాకు దేవుడేనని చెప్తుంది.

జ్యోత్స్న శివనారాయణ దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడి వ్రతం దగ్గరకు వెళ్లినందుకు సోరి చెప్తుంది. నువ్వేమి నాకు శత్రువు కాదు మేం సంపాదించే ప్రతి రూపాయి నీకే చెందుతుంది. నువ్విలా మా మాట వినకుండా జీవితాన్ని పాడుచేసుకుంటుంటే బాధపడతాము కదా అంటాడు.

బావనే పెళ్లి చేసుకుంటా

మిమ్మల్ని ఇంకెప్పుడూ బాధపెట్టను అంటుంది. ముందు పారిజాతం మాట వినడం మానేయి. రేపు విశ్వనాథం మనవడిని పిలుస్తాను వాడిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. సోరి తాత నేను బావను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకొనని తెగేసి చెప్తుంది. మీరంతా నాకు బావకు ఎలా పెళ్లి చేయాలో ఆలోచించమని అంటుంది.

కార్తీక్ ని తప్ప ఎవరి పెళ్లి చేసుకోమని చెప్పినా చేసుకొను. మీరు నా దారికి రావాలి తప్ప నేను మనసు మార్చుకోను అని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. అదంతా చాటుగా వింటున్న పారు దీనికి కారణం దాసు అని తిట్టుకుంటుంది. స్వప్న, కాశీ దీప వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు.

అది పెళ్ళేనా?

అప్పుడే పారిజాతం ఆవేశంగా దాసు ఇంటికి వస్తుంది. కాశీ పారిజాతానికి బాగా చురకలు పెడతాడు. వాళ్ళ వ్రతానికి మీరంతా ఎందుకు వెళ్లారని దాసును అడుగుతుంది. మా అక్క మేము వెళ్తాం మా ఇష్టమని కాశీ పొగరుగా చెప్తాడు. పనికి మాలిన జంటను దీవించడానికి మీరంతా కట్టకట్టుకుని వెళ్లారని తిడుతుంది.

మా అన్నయ్యను ఏమైనా అంటే ఊరుకొనని స్వప్న ఆవేశంగా మాట్లాడుతుంది. నాలుగు గోడల మధ్య తాళి కడితే దాన్ని పెళ్లి అంటారా? అంటూ పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner