Karthika deepam november 1st episode: తాళి తీసేసి విముక్తి కలిగించమన్న దీప- ఎప్పటికీ బావే నా భర్త అంటోన్న జ్యోత్స్న
Karthika deepam 2 serial today november 1st episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 1వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అందరినీ ఏడిపించి తాను సంతోషంగా ఉండలేనని తన మెడలో తాళి తీసేసి తనకు విముక్తి కలిగించమని దీప అడుగుతుంది. సమాజం గురించి కాదు కూతురి కోసం ఆలోచించమని కార్తీక్ అంటాడు.
Karthika deepam 2 serial today november 1st episode: సుమిత్ర కార్తీక్ వాళ్ళను అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. శ్రీధర్ కాంచన పక్కన నిలబడితే దీప, కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటారు. హ్యాపీ మూమెంట్ లో అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామని కాశీ అంటే దీప మొహం మాడ్చుకుని వెళ్ళిపోతుంది.
తాళి తీసేయండి
దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితని అనసూయ అంటే ఇవి కాలం పెట్టె పరీక్షలు తట్టుకుని నిలబడాలని కాంచన ధైర్యంగా మాట్లాడుతుంది. కాంచనగారికి ఇచ్చి మాట కాదనలేక పీటల మీద మీ పక్కన కూర్చున్నాను కానీ మీ భార్య స్థానం కోసం కాదు.
జ్యోత్స్న మిమ్మల్ని మర్చిపోలేదు. అలాగని మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇలా జీవితాంతం మీకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఇలా గొడవ చేస్తూనే ఉంటుంది. ఒకరిని ఏడిపించి నేను నవ్వలేను. ఒకరి ఉసురు పోసుకుని నేను బతకలేను. మీరు కట్టిన తాళి మీ చేతులతోనే తీసేయండి.
శౌర్యను నాతోనే ఉంచు
నీ వల్ల మా కుటుంబం సంతోషంగా ఉంది అన్నవాళ్లే ఈరోజు నీ వల్ల మా కుటుంబం ఏడుస్తుందని అన్నారు. ఇవన్నీ దులుపుకుని పోలేను. అంతమందిని బాధపెట్టే సంతోషం నాకు వద్దు. నాకు విముక్తి కలిగించండి. నా మెడలో ఈ తాళి తీసేసి నా దారిన నన్ను పోనివ్వమని దీప ఏడుస్తుంది.
నీ కోరిక ఇదే అయితే నేను తీరుస్తానని కార్తీక్ అంటాడు. కానీ ఒక షరతు నువ్వు మాత్రమే వెళ్ళు శౌర్యను నాతోనే ఉంచు అంటాడు. నిన్ను కూడా నేను భర్తగా శాసించగలను కానీ నేను అలా చేయలేను. శౌర్య ఇప్పుడు నా కూతురు. తను బాగుండాలంటే నా కూతురు నా దగ్గరే ఉండాలని అంటాడు.
జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర
శౌర్య లేకుండా నేను వెళ్లిపోవచ్చా అంటే వెళ్లిపోవచ్చు. నా భార్యగా నేను ఆపను, కానీ తల్లిగా మాత్రం అపుతాను. నా కూతురికి తల్లి, తండ్రి ఇద్దరూ కావాలని కార్తీక్ మెలిక పెడతాడు. మీరు నన్ను భర్త అనుకునేవరకు నేను మీ శ్రేయోభిలాషినే. జనం కోసం కాదు నీ కూతురి కోసం బతుకు.
మాతోనే ఇక్కడే ఉండు అంటాడు. సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఎవరిని అడిగి అక్కడికి వెళ్ళావు అంటుంది. అసలు కొట్టాల్సింది నిన్నే అని శివనారాయణ పారిజాతాన్ని తిడతాడు. నా గొంతులో ప్రాణం ఉండగా వాళ్ళను క్షమించను. సుమిత్ర రేపే నీ కూతురికి పెళ్లి చూపులు. ఏర్పాట్లు చేయమని అంటాడు.
బావ కావాలి
బావను తప్ప ఎవరినీ చేసుకొనని జ్యోత్స్న అంటే మీ బావకు దీపతో పెళ్లి అయిందని దశరథ అంటాడు. బావ పక్కన భార్య స్థానంలో కూర్చోవాల్సింది నేను దీప కాదు అంటుంది. బావ మాత్రమే నా భర్త, నేనే తన భార్యను అంటుంది. మీ బావ పక్కన భార్య స్థానంలో దీప ఉందని శివనారాయణ చెప్తాడు.
అయినా పరవాలేదు నాకు బావ కావాలని తెగించి మాట్లాడుతుంది. పెళ్ళైన మగవాడిని భర్తగా చేసుకుంటాను అంటే అది ప్రేమ అనరు ఏమంటారో నా నోటితో చెప్పలేను. వీలైనంత త్వరగా జ్యోత్స్నకు పెళ్లి చేయకపోతే ఇంటి పరువు పోతుందని పెద్దాయన అంటాడు.
పెళ్లి ఒక్కటే పరిష్కారం
ఎవరు కొట్టినా చంపినా బావ నా భర్త అనేసి వెళ్ళిపోతుంది. వీలైనంత త్వరగా జ్యోత్స్నకు పెళ్లి చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న పెళ్లి చేసుకొనని అంటుంది కదా ఫారిన్ పంపించి చదువుకోమని చెప్దామని సుమిత్ర అంటే దాన్ని మనం ఆపలేము పెళ్లి ఒక్కటే పరిష్కారమని దశరథ కూడా తేల్చేస్తాడు.
శౌర్య దిండ్లు పక్కన పెట్టుకుని అమ్మానాన్నగా భావించి మాట్లాడుకుంటుంది. మీరిద్దరూ కలిసి వ్రతం చేసుకుంటే చాలా బాగుంది. ఎందుకు అక్కడ గొడవ జరిగింది. అమ్మానాన్న కలిసి ఉంటేనే నాకు నచ్చుతుంది. లేకపోతే నేను ఏడుస్తాను బాధపడతాను అంటుంది.
కూతురి కోసం ఆలోచించు
ఈ మాటలు కార్తీక్, దీప గుమ్మం దగ్గర వింటారు. నువ్వు ఆలోచించాల్సింది సమాజం గురించి కాదు నీ బిడ్డ గురించి. ఎవరో ఏదో అనుకుంటారని నీలో నువ్వే కుమిలిపోతుంటే తనను ఎవరి పట్టించుకుంటారు. తండ్రిగా నేను ఉన్నాను తల్లిగా నువ్వు పట్టించుకో.
నా కూతురి కోసం నేను ఉన్నాను. నువ్వు ఉండు అప్పుడు అది ఇలా గోడలు, దిండ్లుతో మాట్లాడుకోవాల్సిన అవసరం దానికి రాదు అర్థం చేసుకో అంటాడు. మీరు సమస్యను ఒకవైపు మాత్రమే చూస్తున్నారు. నా బాధ తొందర్లోనే మీకు అర్థం అవుతుందని దీప అనుకుంటుంది.
దీప నా భార్య
కార్తీక్ ఇంటికి తన ఫ్రెండ్స్ వస్తారు. దీప వాళ్ళకు కాఫీ తీసుకెళ్తుంది. దీపను చూసి పని మనిషి అని మాట్లాడతారు. ఆ మాటలు కార్తీక్ వింటాడు. మీరు పని మనిషే కదా అని కార్తీక్ ఫ్రెండ్ సిరి అడిగితే అవును నేను పని మనిషే అంటుంది. కాదు దీప పని మనిషి కాదు ఈ ఇంటి మనిషి.
దీప భుజం మీద చెయ్యి వేసి తను నా భార్య అంటాడు. శౌర్యను పిలిచి దీప నా భార్య, శౌర్య నాకూతురు. ఇదే నా ఫ్యామిలీ అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్