Karthika deepam october 31st episode: వ్రతం పూర్తి చేసిన కొత్త దంపతులు- దీప, కార్తీక్ ని ఆశీర్వదించి శివనారాయణ, సుమిత్ర
Karthika deepam 2 serial today october 31st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కార్తీక్ చేస్తున్న వ్రతం ఎలాగైనా ఆపాలని జ్యోత్స్న ఆవేశంగా వస్తుంది. తనను ఆపడానికి శివనారాయణ కుటుంబం కూడా వస్తుంది. వాళ్ళని ఆశీర్వదించమని కాంచన అడుగుతుంది.
Karthika deepam 2 serial today october 31st episode: గుడిలో దీప, కార్తీక్ వ్రతం చేస్తారు. జ్యోత్స్న ఆవేశంగా వస్తుంది. తనని చూసి ఇప్పుడు వచ్చింది ఏంటి? ఇది ఖచ్చితంగా వ్రతం చెడగొట్టడానికి వచ్చి ఉంటుంది. ఏదో ఒకటి చేసి తనని ఆపమని కాంచన అనసూయకు చెప్తుంది. ఈ వ్రతం ఆగదని అనసూయ జ్యోత్స్నను ఆపేందుకు వెళ్తుంది.
జ్యోత్స్నను లాక్ చేసిన అనసూయ
నీకోడలు నాకు కాబోయే భర్తతో వ్రతం ఎలా చేసుకుంటుందో అడగడానికి వచ్చానని జ్యోత్స్న అంటుంది. దీప ఇప్పుడు నా కోడలు కాదు కాంచనఅమ్మ కోడలు కార్తీక్ బాబు భార్య. ఇంట్లో తాళి కట్టినా వాళ్ళు భార్యాభర్తలు అయ్యింది ఇప్పుడే. ఈ వ్రతం జరిగితే పూర్తి భార్యాభర్తలు అవుతారు ఇంటికి వెళ్లిపొమ్మని అనసూయ అంటుంది.
జ్యోత్స్న అడ్డుతప్పుకో అంటే లేదు అనేసరి అనసూయ కోపంగా జ్యోత్స్నను లాక్కుని వెళ్తుంది. గుడి దగ్గర ఉన్న ఒక గదిలో తనని పెట్టి గడియ పెట్టేస్తుంది. ఏం తెలియనట్టు మళ్ళీ అనసూయ వ్రతం దగ్గరకు వస్తుంది. శ్రీధర్ ఇంకా రాలేదని కాంచన కంగారుపడుతుంది.
పరువు వదులుకోను
అప్పుడే శ్రీధర్ గుడికి వస్తాడు. వెనుకే శివనారాయణ కుటుంబం కూడా వస్తుంది. అందరూ కలిసిపోయారు అనుకుంటా అని శివనారాయణ అనుకుంటాడు. సుమిత్ర వెళ్ళి శ్రీధర్ ని పలకరించబోతే దశరథ ఆపుతాడు. సిగ్గు లేకుండా భార్య పిలవగానే వచ్చావంటే నీ స్థాయి ఏంటో అర్థం అయ్యిందని శివనారాయణ శ్రీధర్ ని దెప్పిపొడుస్తాడు.
నాకు సిగ్గులేదు మరి మీ స్థాయి ఏమైంది. మనవరాలిని నా కొడుకు ఛీ కొట్టి దీప మెడలో తాళి కట్టాడు. వ్రతానికి మీరు ఎందుకు వచ్చారని శ్రీధర్ ఎదురు ప్రశ్నిస్తాడు. అవసరం అయితే ప్రాణం అయినా వదిలేస్తాను కానీ పరువును వదులుకోనని పెద్దాయన చెప్తాడు.
జ్యోత్స్నను విడిపించిన పారు
మేం వచ్చింది వ్రతానికి కాదు నా మనవరాలి కోసమని చెప్పి గుడిలోకి వెళతారు. అందరినీ చూసి కాంచన కంగారుపడుతుంది. వ్రతం జరిగే దగ్గరకు వచ్చి జ్యోత్స్న ఎక్కడని పారిజాతం కాంచనను అడుగుతుంది. జ్యోత్స్న ఇక్కడికి రాలేదని కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్న ఎక్కడ ఉందో వెళ్ళి వెతుక్కోమని చెప్తాడు. దీంతో శివనారాయణ కుటుంబం జ్యోత్స్నను వెతకడానికి వెళ్లిపోతారు. కాంచన జ్యోత్స్నను ఏం చేశావని అనసూయను అడుగుతుంది. గదిలో పెట్టి గడి పెట్టానని చెప్పడంతో కాంచన భయపడుతుంది.
జ్యోత్స్న అరుపులు విని పారిజాతం అటుగా వచ్చి గది గడియ తీస్తుంది. వ్రతం ఆపాలని జ్యోత్స్న పరుగుపరునా వెళ్తుంది. వ్రతం పూర్తయ్యిందని పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కార్తీక్ వాళ్ళకు పంతులు చెప్తాడు. మా బావతో కలిసి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునే హక్కు దీపకు లేదని జ్యోత్స్న అంటుంది.
చెంప పగులుతుంది
నా మెడలో కట్టాల్సిన తాళి దీప మెడలో కట్టాడు. కట్టాడు కాదు కట్టించుకుంది. నీ స్వార్థం కోసం పక్కవాళ్ళ అదృష్టాన్ని లాక్కుపోయే నీచమైన మనిషివి నువ్వు అని జ్యోత్స్న తిడుతుంది. నా భార్యను ఏమైనా అంటే చెంప పగులుతుందని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
శివనారాయణ కార్తీక్ మీద అరుస్తాడు. కాంచన నాన్న అని పిలిస్తే తనని తిడతాడు. మీరు నన్ను వద్దని అనుకున్నా దసరా పండుగకు మీ ఇంటికి రాలేదా? నువ్వు అవమానించినా నా కొడుకు నిన్ను బతిమలాడుకోవడానికి రాలేదా అని నిలదీస్తుంది. నేను నా పంతం వదులుకుని నీ కొడుకుతో నా మనవరాలి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నువ్వు దీపతో పెళ్లి చేశావని అంటాడు.
దీప మెడలోనే తాళి కడతా
నేను దిగొచ్చిన తర్వాత కూడా నా మాట లెక్కచేయలేదంటే నీ దృష్టిలో తండ్రి చచ్చినట్టే కదా అంటాడు. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్న సంగతి నాకు తెలియదని కాంచన చెప్తుంది. దీప మెడలో తాళి కట్టిన తర్వాత తనకి సంగతి తెలుసని కార్తీక్ అంటాడు.
ముందే తెలిస్తే దీప మెడలో తాళి కట్టేవాడివి కాదు కదా బావ అని జ్యోత్స్న అడుగుతుంది. ముందే తెలిసినా నేను దీప మెడలోనే తాళి కట్టేవాడిని అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇవన్నీ జరగడానికి కారణం మావయ్యగారే అని శ్రీధర్ చురకలేస్తాడు.
నా కోడలిని ఏమి అనొద్దు
శివనారాయణ శ్రీధర్ ని తిడితే ఆయన్ని పిలిచింది నేను తనని అవమానించొద్దని కాంచన అంటుంది. అందరూ తలా ఒక మాట అనుకుంటారు. శివనారాయణ జరిగింది చాలు వెళ్దాం పద అని జ్యోత్స్నను పిలుస్తాడు. నా కొడుకు, కోడలిని ఆశీర్వదించమని కాంచన అడుగుతుంది.
శివనారాయణ దీప, కార్తీక్ ని ఏకిపారేస్తాడు. దీప వల్ల ఈరోజు నా కుటుంబం మొత్తం ఏడుస్తుందని అంటాడు. నీ మనవడు కాబట్టి నా కొడుకుని ఏమైనా అను కానీ నా కోడలిని ఏమి అనొద్దని కాంచన అంటుంది. స్వప్నను అక్షింతలు తీసుకురమ్మని పిలుస్తుంది.
ఆశీర్వదించిన శివనారాయణ
పెద్దవాడివి నువ్వు ఆశీర్వదించకుండా వెళ్తే అశుభం నాన్న అక్షింతలు వేసి వెళ్ళమని కాంచన అడుగుతుంది. దీంతో కోపంగా శివనారాయణ అక్షింతల పళ్ళెం విసిరేయడంతో అవి వెళ్ళి దీప వాళ్ళ మీద పడతాయి. నీ కోపాన్ని దేవుడు దీవెనగా మార్చాడని కాంచన సంతోషపడుతుంది.
పారిజాతం దీపను తిడుతుంటే నా భార్యను అవమానించొద్దని కార్తీక్ సీరియస్ అవుతాడు. దీంతో పారు కోపంగా వాళ్ళకు శాపాలు పెట్టి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర వాళ్ళిద్దరినీ అక్షింతలు వేసి ఆశీర్వదించి సంతోషంగా ఉండమని చెప్తుంది.
తరువాయి భాగంలో..
శౌర్య దిండ్లు అమ్మానాన్నగా పిలుస్తూ మీరిద్దరూ వ్రతం చేసుకున్నారని మేమంతా ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా?మీరిద్దరూ పక్క పక్కన కూర్చుంటే ఎందుకు అందరికీ నచ్చలేదు. మీరిద్దరూ కలిసి ఉంటేనే నాకు నచ్చుతుందని అంటుంది. ఆ మాటలు దీప, కార్తీక్ వింటారు. నువ్వు ఆలోచించాల్సింది సమాజం గురించి కాదు నీ కూతురి గురించి. నా కూతురు కోరుకున్నట్టు నేను ఉంటాను నీ కూతురు కోరుకున్నట్టు నువ్వు ఉండు అని కార్తీక్ దీపకు చెప్తాడు.
టాపిక్