Karthika deepam october 28th episode: వ్రతానికి రమ్మని శ్రీధర్ కి ఆర్డర్ వేసిన కాంచన-ఆస్తి కోసం పెద్ద ప్లాన్ వేసిన పారు
Karthika deepam 2 serial today october 28th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఆశీర్వదించేందుకు మీ పక్కన మావయ్య శ్రీధర్ ఉండాలని దీప కండిషన్ పెడుతుంది. దీంతో శ్రీధర్ ని వ్రతానికి రమ్మని కాంచన ఆర్డర్ వేస్తుంది.
Karthika deepam 2 serial today october 28th episode: సుమిత్ర ఇంటికి రాగానే గుడికి అని చెప్తే నేను వచ్చే దాన్ని కదాని పారిజాతం అడుగుతుంది. మనశ్శాంతి కోసం వెళ్ళాను ఇలాంటి మాటలు మాట్లాడి నా కూతురి మనసు చెడగొట్టారని గడ్డి పెడుతుంది. వీలైతే మంచి మాటలు చెప్పి నా కూతురి మనసు మార్చండి అని అంటుంది.
వ్రతం చేస్తాను కానీ షరతు
దీప కాపురం ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తుంది. అటు దీప ఇంటికి వస్తే కాంచన నిన్ను ఒక విషయం అడగాలి అంటుంది. నేను అదే మాట్లాడాలని అనుకుంటున్నాను. మా ఇద్దరినీ పీటల మీద కూర్చుని మా ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని అనుకుంటున్నారంట కదా.
కార్తీక్ బాబు నేను భార్యభర్తలుగా పీటల మీద కూర్చోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. మీరు ఎప్పడంటే అప్పుడు వ్రతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటుంది. రేపే వ్రతం చేయిస్తానని కాంచన అంటుంది. కానీ ఒక షరతు అని దీప మెలిక పెడుతుంది.
శ్రీధర్ గారు మీ పక్కన ఉండాలి
షరతు కాదు నా కోరిక భార్యాభర్తలం వ్రతం చేసుకుంటే వ్రతం పూర్తయిన తర్వాత అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అత్తగారిగా దీవించడానికి మీరు ఉన్నారు మామయ్య గారు శ్రీధర్ కూడా మీ పక్కన ఉండాలి అనేసరికి కాంచన షాక్ అవుతుంది.
మీ భార్యాభర్తలు ఇద్దరూ పక్కపక్కన నిలబడి దీవిస్తాను అంటే వ్రతం చేసుకోవడానికి ఇబ్బంది లేదని అంటుంది. అర్థం లేని కోరికలు కోరద్దు అని కార్తీక్ అంటాడు. పద్దతి ప్రకారం జరగాలి అనుకున్నప్పుడు ఇది కూడా కావాలని దీప చెప్తుంది. అమ్మ పక్కన నాన్న ఎందుకు లేడో నీకు తెలియదా అని కార్తీక్ కోపంగా అంటాడు.
వ్రతం ఆగడానికి వీల్లేదు
ఎందుకు ఆవేశపడుతున్నావ్ దీప చెప్పిన డానికి నేను ఒప్పుకుంటున్నాను. దీప నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని కాంచన మాట ఇస్తుంది. తండ్రిగా ఆశీర్వదించే హక్కు, ఇది నా సంతోషం కోసం జరుగుతున్న కార్యక్రమం. మీ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పమని అంటుంది.
వ్రతం ఆగడానికి వీల్లేదని కాంచన చెప్తుంది. కొన్ని కావాలని అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలని కాంచన అనుకుంటుంది. గుడిలో దీపను కలిసిన విషయం సుమిత్ర దశరథకు చెప్తుంది. జరిగిన దానికి దీప బాధపడుతున్నది నిజమే అయితే బలవంతంగా తాళి కడితే తను ఎందుకు ఊరుకుంటుంది?
దీపను నేను నమ్మను
నువ్వు దీపను నమ్ముతావ్ ఏమో కానీ నేను నమ్మను అని దశరథ అంటాడు. మనం ఏదో ఒకటి చేయాలి లేదంటే మన ఇంటి తిండి తిని మనలనే మోసం చేస్తుందా అని పారిజాతం ఎక్కించడానికి చూస్తుంది. ఇక్కడ దీప మాత్రమే కాదు నా చెల్లి, బావ అందరూ మోసం చేశారు.
ఇప్పుడు నేను నా కూతురి పెళ్లి గురించి మాత్రమే ఆలోచిస్తానని అంటాడు. అది కార్తీక్ ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదని పారిజాతం చెప్తుంది. ఇక నుంచి కార్తీక్ గురించి ఆ మనుషుల గురించి మాట్లాడుకోవడం అనవసరమని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు.
ఆస్తి కోసం ప్లాన్
పారిజాతం జ్యోత్స్నకు చెత్త ఐడియా ఇచ్చేందుకు సిద్ధపడుతుంది. ఆస్తి మొత్తం ఉమ్మడిగా ఉంది. మీ మేనత్తకు వాటా ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మీ తాత ఆస్తి రాసిస్తాడు. కూతురి మీద ప్రేమతో తనకు అన్యాయం మాత్రం చేయించడు. ఆ అన్యాయం మీ తాతతో మనమే చేయించాలి.
మనం ఏదైనా పెద్ద గొడవ జరిగేలా చేసి మీ ఆస్తి మాకు వద్దని కాంచన లేదా కార్తీక్ తో అనిపించాలి. అప్పుడు దీప కారణంగా ఆస్తి పోగొట్టుకున్నాడు అనేది అర్థం అయ్యేలా చేసి ఆస్తి కావాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలనే కండిషన్ పెడదామని జ్యోత్స్న అంటుంది.
బావతో తాళి కట్టించుకుంటా
దీపకు ఏమైనా కోట్లు ఉన్నాయా వీళ్లందరినీ పోషించడానికి. అప్పుడు దీపను ఊరికి పంపించేసి దీన స్థితిలో ఉన్న బావను ఇంటికి తెచ్చుకుందామని జ్యోత్స్న ఐడియా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటుంది. బావ కండిషన్ కు లొంగడు దీప తనకు కరెక్ట్ కాదు అని అనుకోవాలి.
మనం రెండు కుటుంబాల మధ్య కాదు భార్యాభర్తల మీద గొడవ పెట్టాలి. అలాగే నా మీద బావకు సింపథీ కలగాలి. అప్పుడే బావతో తాళి కట్టించుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. భలే ఐడియా ఇచ్చావని జ్యోత్స్న గ్రానిని మెచ్చుకుంటుంది. నీ జీవితం కోసం ఎంతమంది జీవితాలనైనా నాశనం చేస్తానని పారిజాతం అంటుంది.
తండ్రిగా వచ్చి ఆశీర్వదించండి
కాంచన వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఆమె రమ్మని పిలిస్తే వెళ్లిపోతారా అని కావేరీ అనుమానంగా అడుగుతుంది. శ్రీధర్ ఇంటి గుమ్మం బయట కాంచన వాళ్ళు ఉంటారు. ఏం మాట్లాడాలి అంటే మాట్లాడటానికి కాదు మిమ్మల్ని పిలవడానికని కాంచన అంటుంది.
శుభకార్యానికి పిలవడానికి వచ్చాను. వేంకటేశ్వర స్వామి గుడిలో నా కొడుకు, కోడలితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని అనుకుంటున్నాను. కార్తీక్ కి మీరు తండ్రి కదా వచ్చి ఆశీర్వదించి వెళ్ళమని కాంచన పిలుస్తుంది. నేను అవసరం లేనప్పుడు నా ఆశీర్వాదం ఎందుకని శ్రీధర్ ఎదురు ప్రశ్నిస్తాడు.
వ్రతానికి రమ్మని ఆర్డర్
నేను నా భర్తగా రమ్మనలేదు కార్తీక్ కి తండ్రిగా రమ్మన్నాను. వచ్చి కొత్త జంటకు ఆశీర్వదించి వెళ్ళమని చెప్తుంది. మధ్యలో కల్పించుకున్న కావేరికి కాంచన చురకలు వేస్తుంది. మీ బాధ్యత మరచిపోవద్దు, జంటగా వస్తారో ఒంటరిగా వస్తారో మీ ఇష్టం. మీరు నా పక్కన నిలబడి నా కొడుకు, కోడలికి అక్షింతలు వేస్తే చాలు అంటుంది.
నేను వ్రతానికి రాకపోతే అని శ్రీధర్ అడుగుతాడు. కార్తీక్ తండ్రిగా మీరు వస్తారు అని కాంచన ఆర్డర్ వేస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగం
కాంచన ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్లారని దీప అడుగుతుంది. నీ కోసమే నీ కోరిక తీర్చడం కోసం మీ అత్తగారు తన ఆత్మాభిమానం పక్కన పెట్టి వెళ్ళి మీ మావయ్యను పిలిచిందని అనసూయ చెప్తుంది. రేపు ఉదయం గుళ్ళో వ్రతం చేయిస్తున్నాను ఆ వ్రతంలో మీ దంపతులను దీవించడానికి మా దంపతులు వస్తారు. నా కోడలికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నానని చెప్తుంది. కార్తీక్ రెడీ అవుతుంటే వ్రతంలో పీటల మీద కొత్త పెళ్లి కూతురిలా మీ పక్కన కూర్చుని వ్రతం నేను చేయలేను దీన్ని మీరే ఎలాగైనా ఆపాలని దీప కార్తీక్ ని అడుగుతుంది.
టాపిక్