Karthika deepam october 26th episode: దీపతో మాట్లాడిన సుమిత్ర- సత్యనారాయణ వ్రతం ఆపేందుకు ప్లాన్ చేసిన వంటలక్క-karthika deepam 2 serial today october 26th episode deepa plans to stop the pooja with karthik ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 26th Episode: దీపతో మాట్లాడిన సుమిత్ర- సత్యనారాయణ వ్రతం ఆపేందుకు ప్లాన్ చేసిన వంటలక్క

Karthika deepam october 26th episode: దీపతో మాట్లాడిన సుమిత్ర- సత్యనారాయణ వ్రతం ఆపేందుకు ప్లాన్ చేసిన వంటలక్క

Gunti Soundarya HT Telugu
Oct 26, 2024 07:12 AM IST

Karthika deepam 2 serial today october 26th episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప గుడిలో కూర్చుని బాధపడుతుంది. అప్పుడే సుమిత్ర గుడికి వచ్చి దీపను చూసి మాట్లాడుతుంది. తన కూతురి కోసం పూజారి ఇచ్చిన ప్రసాదం దీపకు ఇచ్చి వెళ్ళిపోతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today october 26th episode: శౌర్య అమ్మానాన్న మధ్యలో పడుకుని చాలా సంతోషపడుతుంది. ఇద్దరికీ ముద్దు పెడుతుంది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, మీరు నాతో ఉన్నారు కదా ఇప్పుడు నాకు భయం కూడా లేదని అంటుంది. శౌర్య కార్తీక్, దీప చేతులు తన మీద పెట్టుకుంటుంది.

నరసింహ నీ మనసులో ఉన్నాడా?

కార్తీక్ చెయ్యి తగలగానే దీప భయంతో తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. మీరు ఆవేశంలో తప్పు చేశారు కార్తీక్ బాబు అని దీప అనుకుంటుంది. శౌర్య కథ చెప్పమంటే కార్తీక్ దీప జీవితాన్ని కథగా మార్చి చెప్తాడు. కథలు వింటూ శౌర్య నిద్రపోతుంది.

హమ్మయ్య అనుకుని దీప వెంటనే లేచి వెళ్ళిపోతుంది. అనసూయ దీపను చూస్తుంది. కార్తీక్ బాబుతో నీకు పెళ్లి అయ్యింది. నీకు ఇప్పుడు తను భర్త. ఒక భార్య భర్తతో ఎలా ఉండాలో అలాగే ఉండమని అనసూయ అంటుంది. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ మనసులో నరసింహ ఉన్నాడా?లేదు కదా?

వ్రతం చేయాలి

కానీ నీ తండ్రి కోసం తలవంచి కాపురం చేశావు. వెధవ నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. భగవంతుడు నీ మంచితనానికి మరొక అవకాశం ఇచ్చాడు. ఇది నీ కోసం కాదు నీ కూతురి కోసం అనుకోకు. ఈ బంధం నీకోసం కూడా. నీ కూతురి కోసం అనుకుంటే కార్తీక్ బాబుకు అన్యాయం చేసిన దానివి అవుతావు.

కార్తీక్ బాబుకు కొన్ని ఆశలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. తాళి కట్టిన భర్తకే కాదు మీ అత్తకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. పెళ్ళైన తన కొడుకు, కోడలితో సత్యనారాయణ వ్రతం చేయించాలని అనుకుంటున్నారు. కార్తీక్ బాబుకు ఏ అభ్యంతరం లేదు.

భార్యగా ఉండలేను

నువ్వు సరే అంటే కాంచనమ్మతో చెప్తానని అనసూయ చెప్తుంది. ఈ పెళ్ళిని మీరు అనుకున్నట్టు నేను తీసుకోలేను. బతికినంత కాలం నేను ఇలాగే ఉంటానని దీప అంటుంది. అందమైన జీవితాన్ని ముక్కలు చేసుకోవద్దని అనసూయ హెచ్చరిస్తుంది.

నా కూతురి కోసం తాళి నా మెడలో ఉంటుంది. కానీ నేను అతడి భార్య స్థానంలో ఉండలేనని అంటుంది. ఇది జరగాల్సిన ముచ్చట కోడలిగా, కార్తీక్ బాబు భార్యగా నువ్వు సరే అనాలి. లేదంటే మీ అత్త నిన్ను అడుగుతారని చెప్తుంది. ఎన్ని చెప్పినా కూడా దీప మాత్రం ఒప్పుకోదు.

దీపను కలిసిన సుమిత్ర

దీప గుడిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఉంటే బాగుండేది నా బాధను అర్థం చేసుకునేదని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడే గుడికి సుమిత్ర వస్తుంది. జ్యోత్స్న మనసు మార్చి మంచి జీవితం ఇవ్వమని సుమిత్ర దేవుడిని వేడుకుంటుంది.

పూజారి జ్యోత్స్నకు తినిపించమని స్వామి వారి ప్రసాదం ఇస్తాడు. అది సుమిత్ర తీసుకుని వస్తుంటే చేజారి దీప దగ్గరకు వెళ్తుంది. సుమిత్ర దాన్ని తీసుకోవడం కోసం దీప దగ్గరకు వస్తుంది. నేను అవకాశవాదిని కాదు. జ్యోత్స్నకు అన్యాయం చేశానని దీప బాధపడుతుంది.

భగవంతుడు రాసి పెట్టాడు

తప్పు జరగలేదు పెళ్లి జరిగింది. మీ ఇద్దరికీ భగవంతుడు రాసి పెట్టాడు. అందుకే నా కూతురి మెడలో పడాల్సిన తాళి నీ మెడలో పడింది. ఇప్పుడు నా బాధ అంతా జ్యోత్స్న గురించి. అది కార్తీక్ ని మర్చిపోదు మరొక పెళ్లి చేసుకోదు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి కొంత టైమ్ పడుతుంది.

కానీ తల్లి మనసు కదా బిడ్డ బాధను చూడలేదు. నువ్వు ఎలా ఉన్నావ్, నువ్వు బాధలో ఉన్నావని నీ మొహం చెప్తుందని సుమిత్ర అడుగుతుంది. ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళికి బాధ కాకుండా ఇంకేముంటుందని దీప అంటుంది. ఇది నా జీవితంలోకి రావాలని కోరుకోలేదని చెప్తుంది.

కార్తీక్ ఇప్పుడు నీ భర్త

కార్తీక్ ని నువ్వు భర్తగా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. నేను బతుకుతుంది శౌర్య కోసం, ఈ తాళి నా మెడలో పడింది కూడా శౌర్య కోసమే. నా మెడలో తాళి కట్టి కార్తీక్ బాబు నా బిడ్డకు తండ్రి అయ్యాడు ఏమో కానీ నేను భర్తగా ఎలా అనుకొనని బాధపడుతుంది.

నువ్వు అనుకున్నా అనుకొకపోయినా కార్తీక్ ఇప్పుడు నీ భర్త. పెళ్లి జరిగింది దీన్ని ఎవరూ మార్చలేరు. అందరిలాగా నేను నిన్ను తిట్టలేను. ఒకప్పుడు నేనే అన్నాను. నువ్వు నా కూతురివి. నా కూతురిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది నా సంకల్పం దాన్ని నువ్వు వేరే రకంగా నిజం చేశావు.

పూజారి నా కూతురి కోసం ఇచ్చిన ప్రసాదం జ్యోత్స్న కంటే నీకే ఎక్కువ అవసరం ఉండేలా ఉందని దాన్ని దీపకు ఇచ్చి వెళ్ళిపోతుంది. వ్రతం వాళ్ళంతట వాళ్ళే ఎలాగైనా ఆపేలా చేయాలని దీప అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

దీప ఇంటికి వస్తే కాంచన మాట్లాడాలి అంటుంది. మా ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని అనుకుంటున్నారంట కదా. కానీ నాది ఒక షరతు. నిజానికి ఇది షరతు కాదు కోరిక. భార్యాభర్తలు వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అత్తగారిగా దీవించడానికి మీరు ఉన్నారు. మావయ్య గారు శ్రీధర్ కూడా మీ పక్కన ఉండాలని దీప అనడంతో కాంచన షాక్ అవుతుంది.

Whats_app_banner