Karthika deepam october 29th episode: కార్తీక్ భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని దీపకు చెప్పిన అనసూయ- వ్రతం జరుగుతుందా?
Karthika deepam 2 serial today october 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. వ్రతం ఆపేందుకు దీప వేసిన ప్లాన్ కి కాంచన చెక్ పెడుతుంది. శ్రీధర్ ని వ్రతానికి రమ్మని ఆర్డర్ వేస్తుంది. విషయం తెలిసి దీప షాక్ అవుతుంది.
Karthika deepam 2 serial today october 29th episode: కాంచన శ్రీధర్ ఇంటికి కార్తీక్, దీపతో వ్రతం చేయిస్తున్నాను తండ్రిగా వచ్చి ఆశీర్వదించమని పిలుస్తుంది. రావాల్సిందేనని గట్టిగా ఆర్డర్ వేస్తుంది. మీరు ఈయనతో పాటు వ్రతానికి వస్తే రెండో పెళ్ళాం గురించి సమాజం చులకనగా చూస్తుంది. పోయేది నీ పరువే వ్రతానికి నువ్వు రాకపోతేనే మంచిదని అనసూయ కావేరికి వార్నింగ్ ఇస్తుంది.
వ్రతానికి వెళ్తాను
వ్రతానికి వెళ్తారా అని కావేరి శ్రీధర్ ని అడుగుతుంది. నేను వెళ్లకపోతే కార్తీక్ కి తండ్రిగా అనిపించుకోను వ్రతానికి వెళ్తానని చెప్తాడు. ఆత్మాభిమానం చంపుకుని మీరు మీ భర్తను పిలవలేరు వ్రతం జరగదని దీప మనసులో అనుకుంటుంది. శౌర్య స్టైల్ మారిపోతుంది.
కొత్త డ్రెస్ వేసుకుని కనిపిస్తుంది. ఎక్కడివి అంటే నానమ్మ కొనిచ్చిందని చెప్తుంది. దాసు కుబేర ఫోటో పట్టుకుని నీకోసం తెగ వెతుకుతున్నాను కనిపించు. ఆరోజు నీతో పాటు తీసుకెళ్లింది అనాథను కాదు ఒక కోటీశ్వరుడి కూతురివి. జరిగేవి చూస్తుంటే మా అమ్మ ఆస్తి కోసం ఇంకేం చేస్తుందోనని భయంగా ఉంది.
దీపకు షాకిచ్చిన కాంచన
నిన్ను కనిపెట్టి ఆ అమ్మాయికి నువ్వు దశరథ, సుమిత్ర కూతురివని చెప్పాలి అనుకుంటాడు. నువ్వు నాకు ఎదురవకపోయిన నిన్ను చూసి గుర్తు పట్టేవాళ్ళు అయిన దొరుకుతారు. నేను చేసిన పాపానికి నిజం చెప్పి ప్రక్షాళన చేసుకుంటాను అనుకుంటాడు.
కాంచన వాళ్ళు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్లారని దీప అడుగుతుంది. నీ కోరిక తీర్చడం కోసం వెళ్ళాం. రేపు ఉదయం గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు కదా. ఈ దంపతులను దీవించడం కోసం మా దంపతులం వస్తామని కాంచన చెప్పడంతో దీప షాక్ అవుతుంది.
మాట నిలబెట్టుక
మీ అత్త నీకోసం తన ఆత్మాభిమానం పక్కన పెట్టి మీ మావయ్యను వ్రతానికి పిలిచింది. ఆయన వస్తారు వ్రతం జరుగుతుందని అనసూయ చెప్తుంది. నా కోడలి కోసం ఏదైనా చేస్తాను. తను కోరుకున్న దాని ప్రకారం నేను చేస్తాను తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదాని కాంచన అంటుంది.
దీప పీటల మీద కూర్చుంటుందిలే అని అనసూయ చెప్తుంది. దీప ఒంటరిగా ఉండి బాధపడుతుంటే అనసూయ వచ్చి పలకరిస్తుంది. మీ అత్త నీకోసం తన పంతాన్ని పక్కన పెట్టి ఆ ఇంటి గడప తొక్కింది అంటే తన కొడుకు జీవితం కోసం ఏమైనా చేస్తుందని అర్థం కాలేదా?
వాళ్ళు కలిసే రాత లేదు
అసలు నువ్వు ఎవరు? కార్తీక్ బాబు నీ మెడలో ఎందుకు తాళి కట్టాలి? నీ మంచి కోసం కాదా? నీ బిడ్డ కోసం కాదా? ఏ సంబంధం లేని వాళ్ళు నీ కోసం ఇంత చేస్తుంటే ఇచ్చిన వరాన్ని కళ్ళకు అద్దుకుని పాపిట్లో సింధూరం దిద్దుకోకుండా ఏడుస్తావ్ ఏంటని అనసూయ తిడుతుంది.
సుమిత్రమ్మ కూతురికి, కార్తీక్ బాబుకు కలిసే రాత లేదు. నువ్వు కార్తీక్ బాబును దేవుడిగా పూజించాలి. నరసింహ కత్తికి అడ్డు వచ్చి నీ ప్రాణాలు కాపాడాడు. నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని కాపాడాడు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి మంచి వాళ్ళు. ఏదో నీ బిడ్డ అదృష్టం కొద్ది దొరికారు.
భార్యగా నడుచుకో
నువ్వు ఎవరి గురించో ఆలోచించి అందరినీ బాధపెట్టడం పాపం. కాంచన గారికి కొడుకు సంతోషంగా ఉండటం తప్ప వేరే ఏ ఆశలు లేవు. దానికోసం నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక పద్ధతి గల భార్య భర్తతో ఎలా ఉండాలో అలా ఉండు చాలు.
దీప నువ్వు నీ గుండెల మీద చెయ్యి వేసుకుని నేనెదైన తప్పు చేశానా అని అడుగు. కార్తీక్ బాబుకు సుమిత్రమ్మ కూతురంటే ఇష్టం ఉంటే తననే పెళ్లి చేసుకునేవాడు కదా. ఏ ఆలోచన లేకుండానే కార్తీక్ నీ మెడలో తాళి కట్టాడా?చంటి దాని కోసమే కదా ఇదంతా చేశాడు.
నీ మాట నిలబెట్టుకో
కార్తీక్ బాబు పక్కన భార్యగా నిలబడే అర్హత నీకు ఉంది. నువ్వు అన్న మాట మీ అత్త నిలబెట్టుకుంది. ఇప్పుడు నీ మాట నిలబెట్టుకో అంటుంది. భార్యగా కార్తీక్ బాబు పక్కన కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదని దీప ఏడుస్తుంది. ఏదో తప్పు చేస్తున్నట్టు మనసుకు అనిపిస్తుంది.
నీ భయాలు దాటి అడుగు ముందుకు వేయమని అనసూయ ధైర్యం చెప్తుంది. అన్నీ మర్చిపోయి బిడ్డ భవిష్యత్ గురించి ఆలోచించు. మీ జీవితాలు చూసి మీ నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుందని నచ్చజెప్తుంది. అమ్మానాన్న వ్రతం చేసుకుంటున్నారని చంటిది చాలా సంతోషపడుతుంది దాని కోసమైన వ్రతంలో కూర్చోమని చెప్తుంది.
నిజం తెలుసుకున్న పారిజాతం
పారిజాతం దాసుకు ఫోన్ చేసి కలవాలని అంటుంది. ఈరోజు కుదరదని అంటాడు. అప్పుడే స్వప్న వచ్చి వ్రతానికి వెళ్దామని అంటుంది. ఆ మాట కాస్త పారిజాతం చెవిలో పడుతుంది. అబద్ధం చెప్పి దాసు కవర్ చేస్తాడు. కానీ కాశీ మాత్రం నానమ్మకు చిన్న ఝలక్ ఇవ్వాలి అని నిజం చెప్పేస్తాడు.
మేము కార్తీక్ బావ దీపక్క చేసుకునే సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నామని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కార్తీక్ వ్రతానికి రెడీ అవుతుంటే దీప వచ్చి మాట్లాడుతుంది. ఈ వ్రతంలో పీటల మీద కొత్త పెళ్లి కూతురిలా మీ పక్కన కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం నేను చేయలేను. దీన్ని మీరే ఎలాగైనా ఆపాలని దీప అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో
కార్తీక్, దీప ఇద్దరూ పీటల మీద కూర్చుంటారు. కార్తీక్ దీప నుదుట సింధూరం పెడతాడు. జ్యోత్స్న వచ్చి గొడవ చేస్తుంది. నా మెడలో కట్టాల్సిన తాళి దీప మెడలో కట్టాడని అంటుంది. జరిగింది తెలియకుండా మాట్లాడొద్దని దీప కోపంగా అంటుంది. నీ స్వార్థం కోసం పక్క వాళ్ళ మనిషిని లాక్కుని పోయే నీచమైన మనిషివి నువ్వు అని జ్యోత్స్న నోరు పారేసుకుంటుంది.
టాపిక్