పిల్లల దీర్ఘాయువును ఇవ్వమని కోరుకుంటూ తల్లులు చేసే వ్రతం అహోయి అష్టమి. ఈ ఉపవాసం పిల్లలకు ఆయుష్హు, ఆనందం, శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. ఈ సంవత్సరం అహోయి అష్టమి 24 అక్టోబర్ 2024, గురువారం జరుపుకోనున్నారు.
ఈ రోజున తల్లులు నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే మంచి నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఆచరించడం పిల్లల బాధలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్హు లభిస్తుందని నమ్ముతారు. పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం ఈరోజు వ్రతం ఆచరించి పార్వతీ దేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుంది. అహోయి అష్టమి నాడు అహోయి మాతను పూజిస్తారు. ఆహోయి అష్టమి వ్రతం సాయంత్రం పూట నక్షత్రాలను చూసి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు. కొన్ని ప్రదేశాలలో చంద్రుడిని చూసి ఉపవాసం విరమించే సంప్రదాయం కూడా ఉంది.
అష్టమి తిథి అక్టోబర్ 24 తెల్లవారుజాము 01:18 నుండి అక్టోబర్ 25వ తేదీ తెల్లవారుజామున 01:58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అహోయి అష్టమి ఉపవాసం 24 అక్టోబర్ 2024న జరుపుకుంటారు. అహోయి అష్టమి పూజ ముహూర్తం- సాయంత్రం 5.45 గంటల నుంచి రాత్రి 7.02 గంటల వరకు.. నిడివి ఒక గంట 17 నిమిషాలు
అహోయి అష్టమి రోజున నక్షత్రాలు కనిపించే సమయం సాయంత్రం 06:06 గంటలకు. చంద్రోదయ సమయం- అహోయి అష్టమి రోజున చంద్రోదయ సమయం రాత్రి 11.54.
ముందుగా సూర్యోదయానికి ముందు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. అహోయి అష్టమి ఉపవాసం నీరు లేకుండా ఆచరిస్తారు. ఇందులో రోజంతా ఏదైనా తినడం లేదా త్రాగడం నిషేధించబడింది. అహోయి అష్టమి వ్రతం సమయంలో నక్షత్రాలు లేదా చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఎలాంటి వాగ్వాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండాలి.
అహోయి అష్టమి వ్రతంలో స్త్రీలు మట్టికి సంబంధించిన పనులు చేయకూడదు. ఈ రోజున నలుపు, నీలం రంగుల బట్టలు ధరించరాదు. ఈ రోజున, చంద్రునికి లేదా నక్షత్రాలకు అర్ఘ్యం సమర్పించడానికి కంచు పాత్రను ఉపయోగించకూడదు. ఈ రోజు తామసిక ఆహారం తీసుకోకూడదు. ఉపవాసం ఉండే స్త్రీలు నిద్రపోకూడదు.
పిల్లల దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసం అహోయి మాతను ప్రార్థించాలి. ఈ రోజున దానధర్మాలు చేయాలి. మనస్సు ధ్యానం, ఆరాధనకు అంకితం చేయాలి. అహోయి వ్రత కథను తప్పనిసరిగా పఠించాలి. ఈరోజు పార్వతీ దేవి అహోయి రూపాన్ని పూజిస్తారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.