Karthika deepam 2 serial today october 30th episode: పీటల మీద కొత్త పెళ్లి కూతురిలా మీ పక్కన కూర్చుని వ్రతం చేయలేనని దీన్ని ఎలాగైనా ఆపమని దీప కార్తీక్ ని అడుగుతుంది. నీకు నేను సాయం చేయాలి అంటే కాసేపు నిజాలు మాట్లాడుకుందామని అంటాడు. హాస్పిటల్ లో నువ్వు నాకు రక్తం ఇవ్వకపోతే నేను పోయేవాడిని అప్పుడు ఏం చేస్తావ్.
జీవితాంతం బాధపడేదాన్ని అంటుంది. ఒకవేళ నరసింహ కత్తిపోటు నీకు దిగి నువ్వు చనిపోతే అప్పుడు ఏం జరిగేది అంటే శౌర్య మీ దగ్గర పెరిగేది. నేను ఏం చేసిన శౌర్య కోసమే అది నీ మెడలో తాళి కట్టడం కూడా. నేను దాని మొహంలో ఆనందం చూడాలి.
నువ్వు నాన్నగా ఉంటావా అని అడిగింది ఉండాలని అనిపించింది. నీకు శ్రేయోభిలాషిగా దానికి నాన్నగా ఉండటం కోసం మీ మెడలో తాళి కట్టడం తప్ప వేరే దారి కనిపించలేదు. నీ విషయంలో మీ నాన్న తీసుకోవాల్సిన బాధ్యతను నేను తీసుకున్నానని చెప్తాడు.
శౌర్య సంతోషంగా నాన్న అని పిలుస్తూ వచ్చి తన డ్రెస్ ఎలా ఉందని అడుగుతుంది. బుట్టబొమ్మలా ఉన్నావని అంటాడు. మరి మీ అమ్మను అడగవా అని కాంచన అంటే నాన్న చెప్తే అమ్మ చెప్పినట్టే వాళ్ళిద్దరూ ఒకటే కదా అంటుంది. ఆ మాటకు కాంచన సంతోషపడుతుంది.
నువ్వు ఏ ఆలోచనలు మనసులో పెట్టుకోకు. నీ కూతురి సంతోషం కోసం చెయ్యి. నువ్వు మా అమ్మకు మాట ఇచ్చావ్ దీప మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని కార్తీక్ అంటాడు. ఇంత చెప్పినా నీ మనసు మార్చుకోకపోతే ఏం చేయలేను వ్రతం చీరలో వస్తే గుడికి వెళ్దాం లేదంటే ఆపేద్దామని చెప్తాడు.
దీప చక్కగా రెడీ అయి వస్తుంది. తనని చూసి కాంచన, అనసూయ, కార్తీక్ చాలా సంతోషిస్తారు. దీప చాలా అందంగా ఉందని కాంచన అనుకుంటుంది. కారులో దీప, కార్తీక్ ని పక్కన కూర్చోబెడతారు. పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్ళి గుడిలో మీ బావ, దీపకు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారని చెప్తుంది.
అసలు ఈ వ్రతానికి దీప ఎలా ఒప్పుకుంది. అంటే పెళ్ళిని ఒప్పుకున్నట్టే కదా. వంట మనిషిని పక్కన కూర్చోబెట్టి వ్రతం ఎలా చేస్తాడో చూస్తానని జ్యోత్స్న ఆవేశంగా బయల్దేరుతుంది. పారిజాతం తాను కూడా వస్తానని అంటే వద్దని తోసేసి వెళ్లిపోతుందీ. సుమిత్ర వాళ్ళు వచ్చి ఏమైందని అంటుంది.
జ్యోత్స్న ఎంత వద్దని చెప్పినా గుడికి గొడవ చేయడానికి వెళ్తుందని చెప్తుంది. వెంటనే శివనారాయణ కుటుంబం మొత్తం కూడా గుడికి బయల్దేరుతుంది. మన పెళ్ళిని నీ మనసు ఒప్పుకోవడం లేదని అర్థం అయ్యింది. కానీ నేను నీకు భర్తగానే ఉంటానని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
గుడిలో స్వప్న వాళ్ళు ఉంటారు. పంతులు దీప, కార్తీక్ ని పీటల మీద కూర్చోమని చెప్తాడు. దాంపత్యం చల్లగా ఉండాలని కోరుకుంటూ దీపం వెలిగించమని అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి పూజ చేయడం చూసి కాంచన పట్టరాని సంతోషంతో పొంగిపోతుంది.
పీటల మీద దీప కార్తీక్ పక్కన కూర్చుంటుంది. దీప నుదుట కార్తీక్ సింధూరం పెట్టి కంకణం కడతాడు. పంతులు ఇద్దరితో వ్రతం చేయిస్తాడు. జ్యోత్స్న ఆవేశంగా గుడికి వస్తుంది. దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్