Brahmamudi October 30th Episode: బ్రహ్మముడి- రుద్రాణిని ఏమార్చిన స్వప్న- అనామికకు కావ్య దెబ్బ- రైటర్‌కు బానిసలా కల్యాణ్
Brahmamudi Serial October 30th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో స్వప్నకు కాల్ చేసి రుద్రాణి పొగరు దించేందుకు ఓ ప్లాన్ ఉందని చెబుతుంది. అలాగే స్వప్న చేస్తుంది. రుద్రాణిని ఏమార్చి అరవింద్ కంపెనీ గురించి చెబుతుంది. అది విన్న రుద్రాణి అనామికకు కాల్ చేసి లాభాలు వస్తాయని చెబుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నష్టాల్లో ఉన్న అరవింద్‌తో డీల్ కుదుర్చుకున్న కావ్య లాభాలు తెచ్చేలా చేస్తానని, వేళంలో కలుద్దామని హామీ ఇస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి హాఫ్ డిన్నర్ గాడు ఎందుకు వచ్చాడు. అయినా వాడి కంపెనీ సగానికి పడిపోయింది అని అంటాడు. వేళంపాటలో అతని కంపెనీని కొంటున్నాం. అందుకు అన్నీ రెడీ చేయమని కావ్య చెబుతుంది.
మిస్టర్ మేనేజర్
నీకేమైనా పిచ్చా. వాడి కంపెనీ కొనడం ఏంటీ అని రాజ్ అంటాడు. నేను చెప్పింది చేయండి మేనేజర్. నా డెసిషిషన్ చెప్పాను అని కావ్య అంటుంది. చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావ్. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్. తాతయ్య నమ్మి కంపెనీ నీ చేతుల్లో పెడితే ఇలా చేస్తావా అని రాజ్ అంటాడు. మిస్టర్ మేనేజర్ చెప్పింది చేయండి అని కావ్య అంటుంది. తర్వాత కాస్తా ఆలోచించిన కావ్య స్వప్నకు కాల్ చేస్తుంది. కొత్త పోస్ట్ ఎలా ఉందని స్వప్న అంటుంది.
బలం పెరిగేకొద్దీ బాధ్యతలు పెరుగుతాయ్ కదా. నాకు బంపర్ ఆఫర్ ఒకటి వచ్చింది అని కావ్య అంటుంది. నక్కను గానీ పెంచుకుంటున్నావా ఏంటీ. నక్కతోక తొక్కినట్లు అన్ని ఆఫర్స్ నీకే వస్తాయేంటీ. నాకు రావేంటీ అని స్వప్న అంటే.. ఇది నీకు కూడా బంపర్ ఆఫరే. ఎన్నోరోజులగా రుద్రాణి పొగరు అణచాలని అనుకుంటున్నామ్ కదా. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది అని కావ్య అంటుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఏం చేయాలో చెప్పు ఇరగదీస్తాను అని స్వప్న అంటుంది.
ఒక కంపెనీ దివాళ తీసి వేళంపాటకు వచ్చింది అని కావ్య ఏదో ప్లాన్ చెబుతుంది. దాంతో మనం దెబ్బకు దెబ్బ కొట్టొచ్చు అని కావ్య అంటుంది. ఇప్పుడు మా అత్తను వాడుకుని అనామికను దెబ్బకొట్టి దీన్ని పిచ్చిదాన్ని చేయాలి అంతేగా అని స్వప్న అంటుంది. జాగ్రత్తగా ఉండు. కొంచెం కూడా డౌట్ రాకూడదు అని కావ్య అంటుంది. నమ్మించడంలో నేను ఖిలాడీని చూస్తుండు అని స్వప్న కాల్ కట్ చేస్తుంది. అనామిక నా కంపెనీనే దెబ్బ కొట్టాలని చూశావ్ కదా. ఇప్పుడు చూడు నేను కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో అని కావ్య అనుకుంటుంది.
ఆరు అడుగులు ముందే
మరోవైపు చెస్ ఆడుకుంటున్న రాహుల్, రుద్రాణిల దగ్గరికి వెళ్లి చూస్తుంది స్వప్న. రణరంగంలో అయినా, చదరంగలో అయినా శత్రువు ఆలోచనను ఆరు అడుగులు ముందుగానే పసిగట్టాలి. లేకపోతే ఇలాగే చనిపోతారని రాహుల్‌తో డైలాగ్ కొడుతుంది రుద్రాణి. దాంతో ఏంటీ కావ్య, అరవింద్ కంపెనీ కొంటే కోట్లల్లో లాభాలు వస్తాయా అని కావాలనే రాహుల్, రుద్రాణికి వినిపించేలా మాట్లాడుతుంది స్వప్న. ఇది కావ్యతో మాట్లాడుతుందా, మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అని రాహుల్ అంటాడు.
ఉండరా అని దగ్గరికి వెళ్లి రుద్రాణి వింటుంది. నష్టాల్లో ఉన్న కంపెనీని నీకెలా లాభం వస్తుంది. ఆ అరవింద్ కంపెనీకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారా. ఫారెనర్స్‌కు నష్టం విషయం తెలియక ముందే డీల్ క్లోజ్ చేసి బిజినెస్ సక్సెస్ చేస్తావన్న మాట. నీ ఐడియా సూపర్ ఉంది. కంపెనీకి కోట్లల్లో లాభాలు వస్తాయి. అప్పుడే తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటావ్. అప్పుడే నిన్ను సీఈఓగా పెట్టుకోవడాన్ని తప్పుబట్టినవాళ్ల నోరు మూతలు పడతాయి అని స్వప్న కాల్ కట్ చేస్తుంది.
రుద్రాణి, రాహుల్ తిరిగి వెళ్లి కూర్చుంటే.. హో.. మీరు ఇక్కడే ఉన్నారా. మిమ్మల్ని గమనించలేదు అని స్వప్న అంటుంది. ఏం మాట్లాడావో అర్థం కాలేదు. ఏంటీ విషయం అని రుద్రాణి అడిగితే.. ఎందుకు అది చెడగొట్టడానికా. మా కావ్య సక్సెస్ అవ్వడానికి ఏదో చేస్తుంది అని వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత వెంటనే రుద్రాణి అనామికకు కాల్ చేస్తుంది. అదే విషయం రాహుల్‌కు చెప్పడం విన్న స్వప్న.. అబ్బ గాలానికి భలే పడింది చేప అని అనుకుంటుంది.
ఊరికే ఒప్పుకోదు
అరవింద్ కంపెనీని కావ్య కొంటుందని స్వప్న మాట్లాడింది అంతా అనామికకు చెబుతుంది రుద్రాణి. నాకు మొత్తం అర్థమైంది. అంతా నేను చూసుకుంటాను అని అనామిక కాల్ కట్ చేస్తుంది. ఏం చేసుకుంటావ్. ఆ అరవింద్ కంపెనీ దివాళ తీసింది. వాడి కంపెనీ కొనడం ఏంటీ అని సామంత్ అంటుంది. ఆంటీ చెప్పింది కదా. ఆ కావ్య ఊరికే ఏదో ఒకటి చేయదు. అది ఒప్పుకుంది అంటే ఏదో ఉంది. ఆ స్వరాజ్ కంపెనీని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అని అనామిక అంటుంది.
నువ్ బిజినెస్ సంగతి చూసుకో నేను ఆ కావ్యను తొక్కడానికి ఏం చేయాలో అది చేస్తాను అని అనామిక అంటుంది. తర్వాత రాత్రి అందరూ ఇంట్లో భోజనం చేస్తుంటారు. రాజ్ వచ్చి బాగా భోజనం చేయండి. రేపటి నుంచి ఇలా ప్రశాంతంగా తినకుండా చేస్తుంది మీ సీఈఓ అని కావ్య అంటుంది. నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని కొనాలనుకుంటుంది. దానివల్ల కోట్లల్లో నష్టాలు వస్తాయి అని రాజ్ సీరియస్‌గా చెబుతాడు. కానీ, సీతారామయ్య మాత్రం వంట గురించి మాట్లాడుతాడు.
కావ్య వేళంపాట పాడకుండా ఇక్కడే అడ్డుకోవాలి. కావ్య గెలిస్తే మా నాన్న కిరిటీం పెట్టిన పెడతాడు అని వాడు అంతలా చెబుతుంటే పట్టించుకోరేంటీ అని రుద్రాణి సపోర్ట్‌గా మాట్లాడుతుంది. నీ కొడుకు వెళ్లి పదికోట్లు నష్టం తెచ్చాడు. ఏమైనా అన్నామా. రాజ్ వెళ్లి పదేళ్లుగా వచ్చిన అవార్డ్ తీసుకురాకపోయాడు. ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే ఫిర్యాదులు చేస్తున్నాడు అని ఇందిరాదేవి అంటుంది. కష్టపడటం కాదు నష్టాలు తెస్తుంది అని రాజ్ అంటాడు.
అధికారం ఎవరికీ లేదు
విన్నారా అని రుద్రాణి సీరియస్‌గా అంటుంది. వంటలు చాలా బాగున్నాయి అని సీతారామయ్య పట్టించుకోనట్లు అంటాడు. అపర్ణ చేసింది. అందుకే ఇంత బాగున్నాయ్ అని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ, ప్రకాశం కావ్య వంటపై పొగడ్తలు కురిపిస్తారు. ధాన్యలక్ష్మీ కూడా అనడంతో సీతారామయ్య లేచి.. సీఈఓని పెట్టాకా మొత్తం హక్కులన్నీ వారికే ఉంటాయి. అదేంటీ అని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. ప్రతీ విషయంలోను జోక్యం చేసుకోని అదేంటీ, ఇదేంటీ అని అడిగితే ఇక సీఈఓ ఎందుకు అని సీతారామయ్య అంటాడు.
నేనే వెళ్లి పనిచేయించుకుంటాను కదా. కావ్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎందుకు కొంటదు. ఏదో లాభం ఉంటేనేకదా అని సీతారామయ్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. విన్నావు కదా. వచ్చి తిను అని ఇందిరాదేవి అంటే.. పెట్టారుగా గడ్డి. నెమరేసుకుంటూ ఉంటానులే అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. మీరంతా ఇలాగే కావ్యను సమర్ధిస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మనం రోడ్డున పడటం ఖాయం అని రుద్రాణి అంటుంది.
మరోవైపు లక్ష్మీకాంత్ చెప్పిన అమ్మ సీన్ పాటను ఫోన్‌లో పాడి వినిపిస్తాడు కల్యాణ్. అద్భుతంగా ఉంది అని లక్ష్మీకాంత్ అంటాడు. నువ్ నీ గురించి ఇచ్చిన బిల్డప్ విని క్లాప్స్ కొట్టాలనిపించింది. కానీ, జస్ట్ యావరేజ్‌గా ఉంది తమ్ముడు అని లక్ష్మీకాంత్ అంటాడు. దాంతో అప్పు కోపంగా ఫోన్ లాక్కుంటుంది. కల్యాణ్ ఆపుతాడు. చెప్పాను కదా నీలో విషయం ఉందని, నీలోని రైటర్‌ను బయటకు తీసుకొస్తా. నువ్ పాడిన పాటను మెసేజ్ చేయి. నీకు ఐదు వేలు పంపిస్తున్నా అని రైటర్ లక్ష్మీ అంటాడు.
జీతం అనే మత్తు పదార్థం
థ్యాంక్యూ అని కల్యాణ్ అంటాడు. మీరు డబ్బులు ఇస్తున్నారా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని లక్ష్మీ పక్కన ఉన్న అతను అంటాడు. పాట అద్భుతంగా రాశాడురా. వాడిలో చాలా విషయం ఉంది. ఈ పాట జనాల్లోకి వెళితే ఆ విషయం వాడికి కూడా అర్థం అవుతుంది. సొంత ప్రయత్నాలు చేస్తాడు. అందుకే వాడిని నా గుప్పిట్లో పెట్టుకుంటున్నాను. జీతం అనే మత్తు పదార్థం వాడికి అలవాటు చేసి నా బానిసను చేసుకోవాలి. వాడి టాలెంట్ మొత్తం వాడుకోవాలి అని లక్ష్మీ అంటుంది.
వాడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. అందుకే నీ పాట గురించి తక్కువ చేసి మాట్లాడాడు అని అప్పు అంటుంది. ఎందుకు ఆవేశపడుతున్నావ్. నిన్నటి వరకు ఈ అవకాశం కూడా మన దగ్గర లేదు కదా. ఎలాగోలా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరి అవకాశాలు అందుకోవాలి అని కల్యాణ్ అంటాడు. వాడు నీకు ఆ ఛాన్స్ ఇస్తాడని అనిపించట్లేదు. వాడు నిన్ను పూర్తిగా వాడుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత నీ ఇష్టం అని అప్పు అంటుంది.
ఇంతకీ పాట ఎలా ఉందో చెప్పలేదు అని కల్యాణ్ అంటే.. ప్రేమగా మురిసిపోతుంది అప్పు. దాంతో కల్యాణ్ చాలా సంతోషిస్తాడు. మరోవైపు భోజనం చేస్తున్న కావ్యకు సీతరామయ్య కాల్ చేస్తాడు. రాజ్ చెప్పిన విషయం గురించి చెబుతాడు సీతారామయ్య.
నీ మీద నమ్మకం ఉంది కాబట్టి వాడి మాటలను కొట్టేశాను. ఎందుకైనా మంచిదని నువ్ జాగ్రత్తగా ఉండాలని కాల్ చేశాను. మనం ప్రయత్నం సరిగా ఉన్నా మన చుట్టు ఉన్న వాళ్లు మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారమ్మా అని కావ్యకు సలహా ఇస్తాడు సీతారామయ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.