Brahmamudi October 29th Episode: బ్రహ్మముడి- రాజ్‌కు తగిలిన శాపం- అనామికకు షాక్- రుద్రాణి పొగరు దించేందుకు కావ్య ప్లాన్-brahmamudi serial october 29th episode kavya deal with aravind loss company star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 29th Episode: బ్రహ్మముడి- రాజ్‌కు తగిలిన శాపం- అనామికకు షాక్- రుద్రాణి పొగరు దించేందుకు కావ్య ప్లాన్

Brahmamudi October 29th Episode: బ్రహ్మముడి- రాజ్‌కు తగిలిన శాపం- అనామికకు షాక్- రుద్రాణి పొగరు దించేందుకు కావ్య ప్లాన్

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial October 29th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో మేనేజర్‌గా రాజ్ ఆఫీస్‌కు వెళ్తాడు. క్లైంట్స్ అందరికీ ఉన్న ఫొటోను అనామికకు పంపిస్తుంది కావ్య. అది చూసి అనామిక షాక్ అవుతుంది. అకౌంటెంట్ శాపం రాజ్‌కు తగిలిందని తనతోనే చెబుతాడు ప్యూన్. నష్టాల కంపెనీతో కావ్య డీల్ చేసుకుంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 29 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌ కావ్య గురించి రాజ్‌కు గొప్పగా చెబుతారు. పోస్ట్ మారిన నిన్ను చాలా గౌరవిస్తుందని అంటారు. లేదంటే కావ్య తెలివితేటల ముందు నువ్వేందుకు పనికిరావని భయపడి ఆఫీస్ మానేశావని అందరూ అనుకుంటారు అని అపర్ణ అంటాడు. అందరూ నాక్ కాల్ చేసి రాజ్‌ అసమర్థుడా. ఆఫీస్‌కు వెళ్లట్లేదా అని అడుగుతున్నారు అని ప్రకాశం అంటాడు.

అత్తను చూసి నేర్చుకున్నావా

కావ్యకు భయపడుతున్నావా అని అపర్ణ అంటే కావ్యపై గెలవలేవా అని ఇందిరాదేవి అంటుంది. రాహుల్‌లా ఇంట్లో ఉంటావా అని స్వప్న అంటుంది. అందరూ ఇలా అంటుంటే ఒక్కసారిగా ఆపమని రాజ్ అంటాడు. నాకు నచ్చక నేను వచ్చాను. భయపడి కాదు. ఆ కళావతి సీఈఓగా పనికిరాదని నిరూపించగలను అని రాజ్ అంటే.. పక్కవాళ్లను తొక్కడం మీ రుద్రాణి అత్తయ్యను చూసి నేర్చుకున్నావా అని అపర్ణ అంటుంది.

అదంతా పై నుంచి రాహుల్ వింటాడు. నా వారసుడు ఏ పోస్ట్‌లో ఉన్నాడనేది ముఖ్యం కాదు. కంపెనీకి లాభాలు తీసుకురావడం ముఖ్యం అని సీతారామయ్య అంటే.. వాడు అందులో సమర్థుడు కాదు. ఇంట్లో పనివాళ్లందరిని పంపించి రాజ్‌తోనే పనులు చేపిద్దామని ఇందిరాదేవి అంటుంది. దాంతో తాను ఆఫీస్‌కు వెళ్తానని, కావ్యకంటే ఎందులోనూ తక్కువ కాదని రాజ్ ఛాలెంజ్ చేస్తూ కిందపడతాడు. ఛాలెంజ్ చేసి కిందపడిపోయావేంట్రా అని ఇందిరాదేవి అంటుంది.

తర్వాత రాజ్ ఒప్పుకుని ఇంట్లోకి వెళ్తాడు. దాంతో అంతా సక్సెస్ అని అపర్ణ వాళ్లు అనుకుంటారు. పైనుంచి అదంతా చూసిన రాహుల్‌ వెళ్లి రుద్రాణికి జరిగింది చెబుతాడు. రాజ్ ఆఫీస్‌కు వెళ్లడు. కావ్యతో తప్పులు చేయించి వెళ్లగొడతా అన్నావ్. ఇప్పుడు వాడు ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఆఫీస్‌లోనే చిలకగోరింకల్లా కాపురం పెడతారు అని రాహుల్ అంటాడు. ముందు ఆ మేనేజర్ గాడికి కాల్ చేసి అక్కడ కావ్య ఏం చేస్తుందో అడుగు అని రుద్రాణి అంటుంది.

చాడీలు చెప్పిన సెక్యురిటీ గార్డ్

మేనేజర్‌కు రాహుల్ ఫోన్ చేస్తే.. కావ్య చేసింది చెబుతాడు. దాంతో రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. వాడు కాకపోతే ఇంకొకడు. నేను తెలుసుకోకపోతానా ఏంటీ అని రుద్రాణి వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీస్‌కు రాజ్ వెళ్తాడు. అక్కడ మేనేజర్‌ను గుర్తు పట్టడు రాజ్. మీలాంటి ఎండీనే మేనేజర్‌ను చేశారు. మేనేజర్‌ను సెక్యూరిటీ గార్డ్‌ను చేశారు కావ్య మేడమ్ అని చాడీలు చెబుతాడు మేనేజర్. ఏంటీ దౌర్జన్యం అని రాజ్ ఫైర్ అవుతాడు. అడిగేస్తాను కడిస్తాను అని రాజ్ అంటాడు.

అలా మేనేజర్‌ను పట్టుకుని రాజ్ కావ్య దగ్గరికి వెళ్లి భారీ డైలాగ్స్ కొట్టి నిలదీస్తాడు. ఇలా చేసినందుకు నాకు సమాధానం కావాలి అని రాజ్ అంటాడు. మిమ్మల్ని మేనేజర్ పోస్ట్‌కు పడేశారు. మీరేం చేశారు అని కావ్య అడుగుతుంది. నా కంపెనీలో నేను ఏ పోస్ట్‌లో అయినా ఉంటాను అని రాజ్ అంటాడు. సరే అతని మేనేజర్ పోస్ట్ అతనికి ఇస్తాను. మీరు మేనేజర్ పోస్ట్ నుంచి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ ప్లేసులో ఉండండి. డ్రెస్ తీసుకోండి అని కావ్య అంటుంది.

దాంతో సెక్యురిటీ గార్డ్‌కు ఇక్కడ పనేంటీ అని ఫైర్ అవుతాడు రాజ్. దాంతో అప్పటిదాకా మాట్లాడిన రాజ్ డైలాగ్స్‌పై కౌంటర్స్ వేస్తుంది కావ్య. తర్వాత మెల్లిగా వాడిని ఎందుకు తీసేసావ్ అని రాజ్ అడుగుతాడు. మీరు ఇంతకుముందు అలా ఎందుకు చేశారు. తప్పు చేశారనే కదా అని కావ్య చెబుతుంది. ఇంతలో శ్రుతి వచ్చి మీటింగ్‌కు అందరూ వచ్చారు అని చెబుతుంది. ఎవరు అని రాజ్ అంటే.. జరిగింది చెబుతుంది శ్రుతి. మేనేజర్‌ను కూడా రమ్మను అని కావ్య అంటే.. అతన్ని కూడా పిలువు అని రాజ్ అంటాడు.

ఇబ్బందులు పెట్టాడు

మీరే సర్.. మీకు ఇంకా డైజెస్ట్ కానట్టుంది అని శ్రుతి అంటుంది. తర్వాత ముగ్గురు కాన్ఫరెన్స్ హాల్‌లోకి వెళ్తారు. అది ఫొటో తీసి అందరిని తనవైపు తెచ్చుకున్నట్లు అనామికకు ఫొటో పంపిస్తుంది కావ్య. అది చూసి అనామిక షాక్ అవుతుంది. ఇన్నాళ్లు మీకు లాభాలు తెచ్చిన కంపెనీ విడిచి పక్క కంపెనీకి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని కావ్య అడుగుతుంది. కరెక్ట్ కాదు. కానీ, రాహుల్ మాకు స్మగుల్డ్ గోల్డ్ అమ్మేందుకు ఆశ చూపాడు. ఒప్పుకోకుంటే ఇబ్బందులకు గురి చేశాడు అని వారు అంటారు.

తర్వాత రాజ్ సర్ బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా పోస్ట్‌లో లేరు. ఇప్పుడు మీరు సీఈఓగా వచ్చారు. మీరెంత కాలం ఉంటారో తెలియదు. కాబట్టి రిస్క్ చేయలేం. మీరు మా పెట్టుబడితో జూదం ఆడుతున్నారు. కంపెనీపై గౌరవంతో వచ్చాం తప్పా. జాయిన్ అవ్వాలని కాదు అని అంతా వెళ్లిపోతారు. దాంతో రాజ్ చప్పట్లు కొట్టి. చాలానే సాధించావ్. పిలిచి మరి కంపెనీని అవమానించావ్. నీకు ఇవన్ని చాతకాదు. మళ్లీ వెళ్లి మట్టి పిసుక్కోవాల్సిందే అని రాజ్ అంటాడు.

మీ కోపం నా మీద కంపెనీ మీద కాదు. వాళ్ల కోపం మెనేజ్‌మెంట్ మీద నామీద కాదు. చెప్పిన వినకుండా రాహుల్ లాంటి అసమర్థుడుని కూర్చోబెట్టారు. పిచ్చోడి చేతిలో రాయిలా మారి అవమానించేలే చేశాడు. వాళ్లు నన్ను అన్నారని సంబరపడుతున్నారు. కానీ, కంపెనీని అన్నారని బాధపడట్లేదు. అవమానం మీదు, కంపెనీది, దుగ్గిరాల కుటుంబానిది. మీరెళ్లి మీ క్యాబిన్‌లో కూర్చోండి. మీరు ఏం చేయాలనేది తర్వాత చెబుతాను అని కావ్య అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు.

శాపం తగిలింది

తర్వాత అరవింద్ వచ్చారని శ్రుతి వచ్చి కావ్యకు చెబుతుంది. మరోవైపు రాజ్ క్యాబిన్‌లో ప్యూన్ కుర్చీ తుడుస్తుంటాడు. మీరు ఇక్కడే ఉంటారట కదా సార్. అందుకే మీ కుర్చీని క్లీన్‌గా తుడుస్తున్నాను. మీరు నన్ను అకౌంటెంట్ నుంచి ప్యూన్‌ను చేశారు. మీరు ఎంండీ నుంచి మెనేజర్ అయ్యారు. మా అమ్మ మాట నిజమైంది సార్. మీకు నా ఉసురు మీకు తగులుతుందని శాపం పెట్టింది సార్ అని ప్యూన్ అంటాడు. దాంతో రాజ్ అరవడంతో ప్యూన్ పారిపోతాడు.

మరోవైపు కావ్యతో అరవింద్ మాట్లాడుతాడు. నేను మీ కంపెనీతో పదేళ్లుగా పని చేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయి నా కంపెనీ డెబ్ట్‌కు వెళ్లింది. నా కంపెనీని వేళానికి వేశారు. అందరూ తక్కువగా పాడుకోవాలని చూస్తున్నారు. నాకు పది కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు వేళానికి వెళ్తే నా ఇల్లు అమ్మిన అప్పు కట్టలేను. దయచేసి మీ కంపెనీ నా కంపెనీని టేక్ ఓవర్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. మీ కంపెనీ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలదు అని అరవింద్ అంటాడు.

శ్రుతి వచ్చి ఫైల్ ఇస్తే.. రాజ్ సర్‌ను రమ్మని చెబుతుంది కావ్య. ఇప్పుడు రాజ్ సర్‌ను పిలిస్తే నన్ను తిడతాడు. పిలవకుంటే ఈమె సెక్యురిటీ గార్డ్‌గా పెడుతుంది అని శ్రుతి అనుకుంటుంది. రాజ్‌కు వెళ్లి కావ్య చెప్పింది చెబుతుంది శ్రుతి. దానికి అవాక్కయిన రాజ్ చచ్చినా రాను అని అంటాడు. సర్ ప్రొడక్షన్ ఆఫీస్‌లో సెక్యురిటీ గార్డ్ పోస్ట్ ఉంది. అది మీకో నాకో అని శ్రుతి అంటే.. నేను వస్తాను అని రాజ్ వెళ్తాడు. అరవింద్ మీరు వేళానికి వెళ్లండి. లాభం వచ్చేలా నేను చూస్తాను. కానీ, లాభం వస్తే 50 శాతం మాకు ఇవ్వాలి అని కావ్య అంటుంది.

లాభాలు వచ్చేలా చేస్తాను

అది ఓకే లాభం వస్తే మొత్తం మీరే తీసుకోండి. లాభం వస్తే అంతకంటేనా అని అరవింద్ అంటాడు. మీ కష్టం మాకొద్దు. మీ కంపెనీ కాపాడుకోవటం కోసం చాలా కష్టపడ్డారు. దాంతో మీకు లాభం రావాలి కదా. అది వచ్చేలా నేను చేస్తాను అని కావ్య అంటుంది. మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉన్నా. ఆశగా ఉంది అని అరవింద్ అంటాడు. వేళం పాటలో కలుద్దామని కావ్య అంటుంది. దాంతో అరవింద్ వెళ్లిపోతాడు. తర్వాత స్వప్నకు కాల్ చేసి రుద్రాణి అత్త పొగరు దించేందుకు అవకాశం వచ్చిందని కావ్య చెబుతుంది.

ఏం చేయాలో చెప్పు ఇరగదీస్తాను అని స్వప్న అంటే కావ్య ఏదో చెబుతుంది. తర్వాత నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీ నీ మనవరాలు కొనబోతుంది అని సీతారామయ్యకు రాజ్ చెబుతాడు. నాకు కావ్య సమర్థతపై నమ్మకం ఉందని, కావ్య నిర్ణయానికి ఎదురుచెప్పే అధికారం ఎవరికీ లేదని సీతారామయ్య అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.