Brahmamudi October 2nd Episode: బ్రహ్మముడి.. రుద్రాణి ప్లాన్ బయటపెట్టిన స్వప్న.. రాజ్‌తో అనామిక ఛాలెంజ్.. కావ్యకు షాక్-brahmamudi serial october 2nd episode anamika samanth optimistic swapna reveals rudrani plan brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 2nd Episode: బ్రహ్మముడి.. రుద్రాణి ప్లాన్ బయటపెట్టిన స్వప్న.. రాజ్‌తో అనామిక ఛాలెంజ్.. కావ్యకు షాక్

Brahmamudi October 2nd Episode: బ్రహ్మముడి.. రుద్రాణి ప్లాన్ బయటపెట్టిన స్వప్న.. రాజ్‌తో అనామిక ఛాలెంజ్.. కావ్యకు షాక్

Sanjiv Kumar HT Telugu
Oct 02, 2024 07:29 AM IST

Brahmamudi Serial October 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పోకి రాజ్ వాళ్లు వస్తారు. అక్కడికి కావ్య రావడం చూసి షాక్ అవుతారు. ఎక్స్‌పోలో సామమంత్‌తో అనామికను చూసిన రాజ్ షాక్ అవుతాడు. రాజ్‌తో తామే అవార్డ్ గెలుస్తామని అనామిక ఛాలెంజ్ చేస్తుంది. బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అవార్డ్స్ ఎక్స్‌పోకి కావ్య వస్తుంది. అటు వైపు నుంచి రాజ్ వాళ్లు వస్తారు. ఎలా ఉన్నావమ్మా అని సుభాష్ అడిగితే.. కారు పోయి కాలి నడకన వస్తుందన్నయ్య. రాతలు రాజ్యాలు ఏలుతుంటే బుద్ధులు కుప్పతోటలపై ఉంటే ఎవరేం చేస్తారు అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. ఇప్పుడు మీ గురించి ఎవరికి చెబుతున్నారు అని స్వప్న పంచ్ వేస్తుంది.

ఎవరు పిలిచారంటా అని రాజ్ అంటే.. ఈ బిల్డింగ్ ఎప్పుడు కొన్నారంటా.. చెప్పక్కా.. నేను వేరే పనికి వచ్చాను. ఎవరు పిలిస్తే రాలేదు. కలవడానికి రాలేదు అని కావ్య అంటుంది. ఇలా మాటికి ఎదురుపడి రాజ్‌కు దగ్గర అవుదామనుకుంటున్నావేమో రాజ్ ఎప్పటికీ అలా జరగనివ్వడు అని రుద్రాణి అంటుంది. మీ ఆయన నీతో విడిపోయి ఇప్పటికీ క్షమించలేదట కదా. మీలాగే అందరి కాపురాలు ఉంటాయా అని స్వప్న అంటుంది.

ఢీ కొనడానికి రాలేదు

రాజ్ నాకు చాలా అవమానంగా ఉంది. ఎంతో స్థాయి ఉన్న వాళ్లు వచ్చే ఇక్కడికి కుండలకు రంగులు వేసుకునే వాళ్లు ఎలా వస్తారు అని రుద్రాణి అంటుంది. స్థాయి అనేది కుండలకు రంగులు, కాన్వాసులు వల్ల రాదు. కళలు వేసే నైపుణ్యంతో వస్తుందని కావ్య అంటుంది. అలా అని కొండలతో ఢీ కొంటే పగిలేది కుండలే అని రుద్రాణి అంటుంది. ఇక్కడ ఎవరు ఢీ కొనడానికి రాలేదని కావ్య అంటుంది. మరి ఇంటికి రాని వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని రాజ్ అంటాడు.

ఇంటికి రాడానికి నెలకు ఇంతని శరాబు కట్టేవాళ్లు ఇక్కడ ఉండరనుకున్నాను. తమరు వస్తారని నాకేం తెలుసు అని కావ్య అంటుంది. దాంతో సుభాష్, రుద్రాణి, స్వప్న డౌట్ పడతారు. ఏంటమ్మా నువ్ అనేది అని సుభాష్ అంటే.. మీ అబ్బాయినే అడగండి అని కావ్య అంటుంది. ఏంలేదు డాడ్ కొన్ని పీడకలలు తెల్లవారగానే మర్చిపోవాలి అని రాజ్ అంటాడు. ఎదుటివాళ్ల కళలలు ఆశలు తొక్కిపారేసి మర్చిపోవాల్సిందేనా అని కావ్య అంటుంది.

నిన్ను డిజైనర్‌ని చేసింది నేను. సపోర్ట్ చేసింది నేను అని రాజ్ అంటే.. నాకు కళ నేర్పింది కూడా మీరేనా అని కావ్య అంటుంది. దాంతో రాజ్‌కు కోపం వస్తుంది. ఎలాగో వచ్చింది ఎందుకు గొడవపడతారు. రాజ్ అవార్డ్ తీసుకుంటుంటే చూద్దామని వచ్చినట్లుంది అని స్వప్న సర్ది చెబుతుంది. ఇంకా ఎక్కడున్నావ్ అక్క. నా మొహమే చూడొద్దన్న మనిషి కోసం ఎందుకు వస్తాను. పుట్టింటికి బారం కాకుడదని ఏదో బతుకుతెరువు వెతుక్కుంటున్నాను అని కావ్య అంటుంది.

పొగరు తగ్గదు

ఇదంతా ఒక సాకు. ఇక్కడికి అంతా వస్తారు. తనను తీసుకెళ్తారని వచ్చినట్లుంది రాజ్. పొరపాటున కూడా తన కుండలో పడకు అని రుద్రాణి అంటుంది. కాపురాలు కూల్చే మీరుండగా.. మళ్లీ నన్ను కాపురానికి ఎందుకు తీసుకెళ్తారు రుద్రాణి గారు అని కావ్య అంటుంది. ఎప్పటికీ ఆ పొగరు తగ్గదు అని రాజ్ వెళ్లిపోతాడు. సుభాష్ పలకరిస్తాడు. అత్తయ్య బాధపడుతుంది అని సుభాష్ అంటాడు. అక్కడికి నేను రావాలని, వస్తే భయపడేవారు ఎవరో నాకు తెలుసు మావయ్య అని కావ్య అంటుంది.

మరి ఇన్ని తెలిసి రాజ్‌ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని సుభాష్ అంటాడు. మూసి ఉన్న పుస్తకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నాకోసం అందులో ఒక్క పేజీ లేదన్నారు. నా పేరు లేని ఆ గ్రంథం ఎంత గొప్పదైతే నాకేందుకు. ఆల్ ది బెస్ట్ మావయ్య. ఈ అవార్డ్ మన కంపెనీకే రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. తర్వాత రాజ్‌కు అనామికతో సామంత్ ఎదురుపడతాడు. నువ్వేంటీ ఎక్కడ అని రుద్రాణి అంటుంది.

ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏం లేదు. కానీ, సామంత్‌తో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక షేర్ ఇచ్చాడు అని అనామిక అంటుంది. ఇతన్ని పట్టావా అని రుద్రాణి అంటుంది. పట్టడం ఏంటీ నేను అనామికను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సామంత్ అంటాడు. నన్ను కాలేజ్ నుంచే ప్రేమిస్తున్నాడు. నేనే గ్రహించలేదు. కల్యాణ్ వదిలేశాక తెలిసిందని అనామిక అంటుంది. మీ కంపెనీ నా కంపెనీ పోటీ పడుతుంది. ఇక నుంచి మీకు అడుగడుగునా పోటీ ఇస్తుంది. ఈసారి పోటీ ఈ ఎక్స్‌పో నుంచే మొదలు అవుతుందని సామంత్ అంటాడు.

స్పోర్టివ్‌గా తీసుకోవాలి

అయితే, ఆల్ ది బెస్ట్ అని రాజ్ చెబుతాడు. ఈసారి మేమే గెలుస్తామని అనామిక అంటుంది. నువ్ ఇతన్ని ఎందుకు ఎంచుకున్నావో నాకు అర్థమైంది. ఈసారి చాలా ఊహించుకున్నంటున్నావ్. నా కంపెనీ పతనమైనట్లు చాలా ఆశలే పెట్టుకున్నట్లున్నావ్. కానీ అలా జరగదు అని రాజ్ అంటాడు. అది చూద్దాం రాజ్ అని అనామిక అంటుంది. మాకు అవార్డ్ వస్తే స్పోర్టివ్‌గా తీసుకోని చప్పట్లు కొట్టాలి అని అనామిక అంటుంది.

ఇంతలా దిగజారిపోయినందుకు కచ్చితంగా చప్పట్లు కొడతామని స్వప్న అంటుంది. చురకలు వేయడానికి నువ్ ఉన్నావని చూల్లేదు. నా తర్వాత మీ కావ్యను ఇంట్లోంచి పంపిచారంటా కదా. తర్వాత క్యూలో నువ్వే ఉన్నావ్. జాగ్రత్త అని అనామిక అంటుంది. నీకు కావ్యకు పోలిక ఏంటీ. వీడికేదో కంపెనీ ఉందని చేరిపోయావ్. పాపం వీడిని చూస్తేనే జాలి వేస్తుంది. నువ్ అడుగుపెట్టగానే కంపెనీ దివాల తీస్తుంది. వెంటనే జెల్లకాయి కొట్టి నువ్ వేరేవాన్ని చూసుకుంటావని వీడికేం తెలుసు అని స్వప్న అంటుంది.

రుద్రాణి ఏదో వార్నింగ్ ఇచ్చినట్లు నాటకం ఆడి వెళ్లిపోతుంది రుద్రాణి. కాసేపట్లో వాళ్లెవరు ఊహించని బాంబ్ పేలుతుందని తెలియకా అలా మాట్లాడుతున్నారని అని అనామిక అంటుంది. ఆ ఇంట్లో అంతా ఇంత అహకారంగా ఉంటారా అని సామంత్ అంటే.. మెడపై చేయి వేసి కంట్రోల్ చేస్తుంది అనామిక. మరోవైపు ఇంట్లో సత్యభామ సీరియల్ చూస్తారు అంతా. అపర్ణ వచ్చి న్యూస్ ఛానెల్ పెట్టమంటుంది. ప్రకాశం, ధాన్యలక్ష్మీ ఒకరికొకరు పంచ్‌‌లు వేసుకుంటారు.

టెన్షన్‌లో ఉన్నారు

ఎక్స్‌పోను లైవ్‌గా చూపిస్తారు. అది అపర్ణ, ఇందిరాదేవి వాళ్లు చూస్తారు. ఈ అవార్డ్ పదిహేను ఏళ్లుగా స్వరాజ్ గ్రూప్‌కు వస్తుంది. మరి ఇప్పుడు అదే కంపెనీకి వస్తుందా.. కొత్త కంపెనీకి వస్తుందా అని న్యూస్ చెబుతారు. ఇంతలో సురేష్ దగ్గరికి వెళ్లిన కావ్య ఆ క్లైంట్ ఎవరో పరిచయం చేస్తే వెళ్లిపోతాను అని కావ్య అంటుంది. ఇప్పుడు క్లైంట్స్ అందరూ టెన్షన్‌లో ఉన్నారు అని సురేష్ అంటాడు. అవార్డ్ ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఇంకో పావుగంట వెయిట్ చేయలేవా అని సురేష్ అంటాడు.

దాంతో కావ్య సురేష్‌తో కూర్చుంటుంది. అదంతా రాజ్ చూస్తాడు. రాజ్ అవార్డ్ తీసుకోడానికి వచ్చాడంటే నేను నమ్మలేకపోయాను. అసలు ఎందుకు వచ్చావ్. నిజం చెప్పు. నేను ఏం అనుకోను అని స్వప్న అడుగుతుంది. ఇది ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం అనుకున్న రుద్రాణి రాజ్ అవార్డ్ తీసుకోవడం కోసమే అని చెబుతుంది. పోను నేను ఏమనుకుంటున్నానో సరదాగా చెప్పనా. అనామిక ఈ పోటీలో ఉందని నీకు తెలుసు. ఇద్దరికీ పోటీ జరగుతోందని తెలుసు. ఇక్కడికి కావ్య వస్తుందని తెలుసు. వాళ్లు ఎక్కడ కలిసిపోతారో అని భయపడి వచ్చావ్ కదా. ఏయ్ దొంగ అని స్వప్న అంటుంది.

దాంతో రుద్రాణి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అవార్డ్ మనకు వస్తుందని రాజ్‌కు ధైర్యం చెబుతుంది. ఓడిపోతానని కాదు డాడ్. కచ్చితంగా గెలవాలి అని. మన కంపెనీ పరిస్థితుల్లో అవార్డ్ గెలిస్తే మార్కెట్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. తాతయ్యకు అదే మాటిచ్చాను. కచ్చితంగా గెలవాలి. దీంతో మన కంపెనీ భవిష్యత్ ముడిపడి ఉందని రాజ్ అంటుంది. అసలు కావ్య ఎందుకు వచ్చిందో అని అడిగి తెలుసుకుందామని కావ్య దగ్గరికి వెళ్తుంది.

మనం తిప్పికొట్టాలి

కావ్యను పక్కకు తీసుకెళ్లి స్వప్న మాట్లాడుతుంది. నువ్ ఇక్కడికి రాజ్ కోసమే వచ్చావ్ కదా అని స్వప్న అంటుంది. ఆయన గారి కోసం రాలేదు. నేను ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ మేనేజర్ ఇక్కడ క్లైంట్స్ ఉన్నారు మాట్లాడాలి అంటే వచ్చాను అని కావ్య అంటుంది. నువ్ ఇక్కడికి వస్తావని రుద్రాణికి తెలిసి మీరిద్దరి విడిపోయేందుకు ప్రయత్నించాడనికి వచ్చింది. దాన్ని మనం తప్పి కొట్టాలి. ఎక్స్‌పోలో రాజ్‌కు అవార్డ్ వచ్చాకా వెళ్లి కంగ్రాట్స్ చెప్పు. జరిగినదానికి సారీ చెప్పు. దాంతో రాజ్ కూల్ అయి ఒప్పేసుకుంటాడు అని స్వప్న చెబుతుంది.

నేను సారీ చెప్పడమేంటీ. నేనేం తప్పు చేశాను అని కావ్య ఒప్పుకోదు. తర్వాత ఇప్పటివరకు స్వరాజ్ గ్రూప్ ఈ అవార్డ్ గెలుచుకుంటూ వస్తోంది. మరి ఇప్పుడు కూడా అదే కంపెనీ గెలుస్తుందా. ఇంకేదైనా గెలుస్తుందా ఇప్పుడు చూద్దాం అని అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అవార్డ్ ప్రకటిస్తారు. దాంతో రాజ్, కావ్యతోపాటు సామంత్ కూడా షాక్ అవుతాడు.