Music Shop Murthy: మిడిల్ క్లాస్ కష్టాలతో మ్యూజిక్ షాప్ మూర్తి.. ఎమోషనల్‌గా చాందినీ చౌదరి అజయ్ ఘోష్ మూవీ
Music Shop Murthy Trailer Released: చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. మిడిల్ క్లాస్ కష్టాలతో తెరకెక్కిన మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్ విడుదల అయింది. మరి ఈ ట్రైలర్ విశేషాల్లోకి వెళితే..
Music Shop Murthy Trailer Released: అజయ్ ఘోష్ Ajay Ghosh, చాందినీ చౌదరి (Chandini Chowdary) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి అండ్ రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాగా రాబోతోన్న ఈ మూవీ టీజర్, పాటలు, పోస్టర్లు ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy Release Date) సినిమాను జూన్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్‌ను (Music Shop Murthy Trailer) తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తే నవ్వించేలా, ఏడిపించేలా ఉంది. మిడిల్ క్లాస్ కష్టాలను, కల కనడానికి, ఆ కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనేలా ఈ చిత్రంలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
‘అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’ అంటూ అజయ్ ఘోష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. మూడు నిమిషాల రన్ టైమ్‌తో ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తిగానే ఉంది. ఇక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జూన్ 14న థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.
ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో అజయ్ ఘోష్, చాందిని చౌదరితోపాటు సీనియర్ హీరోయిన్ ఆమని (Actress Aamani), అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కాగా, తెలుగులో అనేక సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు అజయ్ ఘోష్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప మూవీలో (Pushpa Movie Villain) విలన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు.
అలాగే మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur Kaaram Movie), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) మంగళవారం (Mangalavaram Movie), కార్తికేయ గుమ్మకొండ బెదురులంక 2012, రుద్రామాంబపురం వంటి అనేక సినిమాల్లో మంచి పాత్రలతో ఆకట్టుకున్నారు అజయ్ ఘోష్. ఇక చాందినీ చౌదరి హీరోయిన్‌గా బాగా రాణిస్తోంది. ఆమె చేతిలో యేవమ్, సంతాన ప్రాప్తిరస్తు వంటి సినిమాలు ఉన్నాయి. ఇటీవలే గామితో మంచి పేరు తెచ్చుకుంది.