Ajay Ghosh Chandini Chowdary: పుష్ప విలన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో మూవీ.. మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్-ajay ghosh chandini chowdary music shop murthy release date announced music shop murthy gets new release date june 14 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajay Ghosh Chandini Chowdary: పుష్ప విలన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో మూవీ.. మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

Ajay Ghosh Chandini Chowdary: పుష్ప విలన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో మూవీ.. మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 02:20 PM IST

Ajay Ghosh Chandini Chowdary Music Shop Murthy: పుష్ప విలన్, నటుడు అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రిలీజ్ డేట్‌ను దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

పుష్ప విలన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో మూవీ.. మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్
పుష్ప విలన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో మూవీ.. మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

Music Shop Murthy Release Date: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు.

చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇంకా ఈ సినిమాలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరితోపాటు సీనియర్ హీరోయిన్ ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.

ఇదిలా ఉంటే, తెలుగులో అనేక చిత్రాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ తనదైన ముద్ర వేసుకున్న నటుడు అజయ్ ఘోష్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో విలన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే మహేష్ బాబు గుంటూరు కారం, పాయల్ రాజ్‌పుత్ మంగళవారం, కార్తికేయ గుమ్మకొండ బెదురులంక 2012, రుద్రామాంబపురం వంటి అనేక సినిమాల్లో మంచి పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఇక చాందినీ చౌదరి హీరోయిన్‌గా బాగా రాణిస్తోంది. ఆమె చేతిలో యేవమ్ అనే మరో సినిమా ఉంది. ఇందులో చాందినీ చౌదరి పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటిస్తోంది. ఇంతకుముందు ఎప్పుడు చాందినీ పోలీస్‌గా నటించలేదు. ఇది కాకుండా ఇటీవలే గామి సినిమాతో అలరించింది చాందినీ చౌదరి. ఇందులో సైంటిస్ట్‌గా హీరో విశ్వక్ సేన్‌కు సహాయం చేసే యువతిగా అలరించింది.

చాందినీ చౌదరి యేవమ్ సినిమాతోపాటు సంతాన ప్రాప్తిరస్తు అనే మూవి కూడా చేస్తోంది. ఇందులో హీరోగా విక్రాంత్ నటిస్తున్నాడు. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో తెరకెక్కిన ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో చాందినీ చౌదరి చాలా బిజీగా ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024