Saba Nayagan OTT: ఓటీటీలోకి చాందిని చౌదరి రొమాంటిక్ డ్రామా.. వాలంటైన్స్ డే స్పెషల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Saba Nayagan OTT Release Date: ఓటీటీలోకి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ మూవీ రానుంది. కలర్ ఫొటో ఫేమ్ చాందిని చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. సబా నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
Saba Nayagan OTT Streaming Date: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వచ్చి సందడి చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ప్రేమికుల దినోత్సవం అయిన వాలంటైన్స్ డేకు స్పెషల్ ఉండాలిగా. అందుకే ఈ ఏడాది వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఓ రొమాంటిక్ డ్రామా మూవీ ఓటీటీలోకి రానుంది. అందులో కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే సబా నాయగన్.
భద్రమ్, మన్మధ లీల, పోర్ తొళిల్, పిజ్జా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశోక్ సెల్వన్. అతను నటించిన అనేక తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దాంతో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితుడు. అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్. 2023లో డిసెంబర్‌లో విడుదలైన సబా నాయగన్ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు.
సబా నాయగన్ మూవీలో అశోక్ సెల్వన్, చాందినీ చౌదరితోపాటు మరో హీరోయిన్స్‌గా మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్ చేశారు. ముగ్గురు హీరోయిన్లతో అశోక్ సెల్వన్ చేసిన రొమాంటిక్ డ్రామానే సబా నాయగన్. ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన ఇంతకుముందు కమల్ హాసన్ విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సబా నాయగన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ డ్రామా అయిన సబా నాయగన్‌ను విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్‌కు, ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
రొమాంటిక్ డ్రామా, లవ్ స్టోరీస్ నచ్చే వారికి, లవర్స్‌కు సభా నాయగన్ మూవీ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సబా నాయగన్ మూవీలో హీరో ముగ్గురు హీరోయిన్లతో పాటు మైల్ సామి, మైఖేల్ తంగదురై, ఉడుమలై రవి, అరుణ్ కుమార్, జైశీలన్ శివరామ్, శ్రీరామ్ క్రిష్, షెర్లిన్ సేథ్, వివియశాంత్, అక్షయ హరిహరన్, తులసి శివమణి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని క్లియర్ వాటర్ ఫిల్మ్స్, మెగా ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించాయి.
సబా నాయగన్ ఒక న్యూ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా. మూడు దశల్లో ముగ్గురు యువతులతో హీరో సాగించిన లవ్ ట్రాక్, రొమాన్స్ కథాంశంతో సబా నాయగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సబా (అశోక్ సెల్వన్) అనే వ్యక్తి బాగా తాగి పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసిన కారణంగా అరెస్ట్ అవుతాడు. హార్ట్ బ్రేక్ అయిన మరో ఖైదీతో సబా చెప్పే లవ్ స్టోరీసే ఈ సినిమా. ఇక అశోక్ సెల్వన్ రొమాంటిక్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. ఇప్పిటికీ ఓ మై కడువలే (తెలుగులో ఓరి దేవుడా), మన్మధ లీల చిత్రాలతో ఆకట్టుకున్నాడు.
ఇక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన చాందినీ చౌదరి కలర్ ఫోటో, సమ్మతమే, హౌరా బ్రిడ్జి, బొంబాట్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. లై, చల్ మోహన్ రంగ సినిమాలతో మేఘా ఆకాష్ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్. ఇటీవలే రవితేజ రావణాసుర సినిమాలో కీ రోల్ ప్లే చేసింది. ఇదిలా ఉంటే సబా నాయగన్ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు.