OTT Horror Series: వెన్నులో వణుకు పుట్టించే టాప్ హారర్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?-ott top horror web series adhura typewriter betaal ghoul to watch on on netflix amazon prime jio cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Series: వెన్నులో వణుకు పుట్టించే టాప్ హారర్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

OTT Horror Series: వెన్నులో వణుకు పుట్టించే టాప్ హారర్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 26, 2024 03:54 PM IST

Top OTT Horror Series: ఓటీటీల్లో హారర్ చిత్రాలు చూసే వారి సంఖ్య. అన్నికంటే ఎక్కువగా హారర్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మూవీ లవర్స్. అందుకే ఎప్పుటకప్పుడు కొత్త హారర్ చిత్రాలతోపాటు సిరీసులు వచ్చి సందడి చేస్తుంటాయి. అలా ఓటీటీల్లో వచ్చిన బెస్ట్ హారర్ సిరీసులపై లుక్కేస్తే..

వెన్నులో వణుకు పుట్టించే టాప్ హారర్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
వెన్నులో వణుకు పుట్టించే టాప్ హారర్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Best Horror Series OTT: హారర్ మూవీస్‌, వెబ్ సిరీసులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే భయపెట్టే హారర్ చిత్రాలు, సిరీసులను చూసేవారి కోసం ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తుంటాయి. ఈ ఏడాది వెన్నులో వణుకు పుట్టించే టాప్ ఓటీటీ హారర్ వెబ్ సిరీస్ లిస్ట్ మీకోసం. ఏది ఎక్కడ ఉందో లుక్కేయండి.

అధుర

బోర్డింగ్ స్కూల్ నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన ఓటీటీ హారర్ మూవీ అధుర. దీనికి అనన్య బెనర్జీ, గౌరవ్ కె చావ్లా దర్శకత్వం వహించారు. అలాగే ఇష్వాక్ సింగ్, రసిక దుగ్గల్, శ్రేనిక్ అరోరా, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఊహకందని ట్విస్టులతో కథా నేపథ్యానికి సంబంధం లేకుండా వచ్చే మలుపులు వీక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది అధుర. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

టైప్‌ రైటర్

సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన హిందీ భయానక సిరీస్ టైప్ రైటర్. ఒక రహస్యమైన పాత విల్లాను పరిశోధించడానికి గోస్ట్ హంటర్స్ బృందం వెళ్తుంది. ఆ విల్లాలో ఉన్న చీకటి రహస్యాలను బట్టబయలు పెట్టేందుకు వెళ్లిన వాళ్లకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, వాళ్లు ఎలాంటి భయాందోళనకు గురి అయ్యారు. అక్కడ ఏం జరిగిందనే కథాంశంతో టైప్ రైటర్ తెరకెక్కింది. పలోమి ఘోష్, పురబ్ కోహ్లీ, సమీర్ కొచ్చర్ ప్రధాన పాత్రల్లో నటించిన టైప్ రైటర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

బేతాల్

ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే జానపద కథలు, అతీంద్రియ అంశాలను మిళితం చేసిన హారర్-థ్రిల్లరే బేతాల్. పాట్రిక్ గ్రాహం రచన, దర్శకత్వం వహించగా అతనికి నిఖిల్ మహాజన్ సహ-దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. కలోనియల్ కాలం నాటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ బేతాల్, అతని బెటాలియన్ జోంబీలుగా మారడం తదితర అంశాలతో బేతాల్ తెరకెక్కించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న బేతాల్ వెబ్ సిరీసులో వినీత్ కుమార్ సింగ్, అహానా కుమ్రా, సుచిత్రా పిళ్లై, జితేంద్ర జోషి కీలక పాత్రలు పోషించారు.

ఘౌల్

ఘౌల్ మూడు ఎపిసోడ్‌లతో కూడిన సూపర్‌నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆగస్టు 2018లో విడుదలైంది. ఈ సిరీస్ స్టోరీ ఓ సీక్రెట్ జైలులో ఇంటరాగేషన్‌తో సాగుతోంది. ఇందులో బోల్డ్ బ్యూటి రాధికా ఆప్టే ప్రధాన పాత్ర పోషించింది. రాధికా ఆప్టే విచారించే సమయంలో ఖైదీల నిజాలు తెలుసుకుంటోంది. ఈ క్రమంలో జరిగే సంఘటన సముహారమే ఘౌల్. ఇది ప్రస్తుతం నె‌ట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

గెహ్రైయాన్

బెంగుళూరులో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తరువాత రేనా అనే యువతి తన కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ముంబైకి వెళ్తుంది. ముంబైలో కొత్త జీవితం ప్రారంభించిన రేనాకు వింత సంఘటనలు (పారానార్మల్) జరుగుతుంటాయి. ఈ సంఘటనల వల్ల ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాటి వెనుకు ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిస్తుంది. సిధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ సిరీస్‌లో సంజీదా షేక్, వత్సల్ షేత్, రాధికా బంగియా ఇతరులు నటించారు. ఇది జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ది వాకింగ్ డెడ్

రాబర్ట్ కిర్క్‌మాన్, టోనీ మూర్, చార్లీ అడ్లార్డ్ రూపొందించిన కామిక్ బుక్ సిరీస్ నుంచి తెరకెక్కించిన టీవీ షోనే 'ది వాకింగ్ డెడ్'. జోంబీ వ్యాప్తితో నాశనమైన ప్రపంచంతో ది వాకింగ్ డెడ్ ప్రారంభం అవుతుంది. చనిపోయాకే నడిచే శవాలను వాకర్స్ అని పిలుస్తారు. అందుకే వాకింగ్ డెడ్ అని టైటిల్ పెట్టారు. ఈ సిరీస్ వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయింది. ప్రస్తుతం ది వాకింగ్ డెడ్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner