OTT: ఓటీటీలోకి 2250 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?-hollywood news the marvels ott release date and ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి 2250 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

OTT: ఓటీటీలోకి 2250 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 26, 2024 01:13 PM IST

The Marvels OTT Release Date: గతేడాది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మరో మూవీ ది మార్వెల్స్. నవంబర్ 10 2023న విడుదలైన ది మార్వెల్స్ ఓటీటీలోకి మూడు నెలల తర్వాత విడుదల అవుతోంది. మరి ది మార్వెల్స్ మూవీని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే..

ఓటీటీలోకి 2250 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి 2250 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

The Marvels OTT Streaming: వరల్డ్ వైడ్‌గా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మార్వెల్ సంస్థ (Marvel Cinematic Universe). దీని నుంచి వచ్చే ప్రతి మూవీ, సిరీస్‍పై అంచనాలు పెద్ద ఎత్తున ఉంటాయి. మొన్నటివరకు సూపర్ హీరోలతో సినిమాలు, సిరీసులుగా రాగా ఈ మధ్య సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ను ప్రధాన పాత్రలుగా తీర్చిదిద్దుతూ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అలా మార్వెల్ సంస్థ నుంచి లోకి, సీక్రెట్ ఇన్వాసియన్, మూన్ నైట్ వంటివి చాలా వచ్చాయి.

ఇక మార్వెల్ సంస్థలోని ప్రధాన పాత్రలతో వచ్చిన సినిమాలు ఈ మధ్య అంతగా ఆకట్టుకోలేదు. ఎటర్నల్స్, థోర్ లవ్ అండ్ థండర్, యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా తదితర చిత్రాలు ప్లాప్‌గా నిలవగా.. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 చిత్రాలు విజయం సాధించాయి. ఇక గతేడాది మార్వెల్ నుంచి వచ్చిన మరో లేడి సూపర్ హీరో మూవీ ది మార్వెల్స్.

అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ది మార్వెల్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతేడాది నవంబర్10న విడుదలైన ది మార్వెల్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సుమారు రూ. 270కి పైగా మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ది మార్వెల్స్ మూవీని తెరకెక్కించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 2250 కోట్లకుపోగా వెచ్చించి భారీ వ్యయంతో ది మార్వెల్స్‌ను తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ది మార్వెల్స్ మొత్తంగా 206 మిలియన్ డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది.

అంటే, సుమారు రూ. 1712 కోట్ల మాత్రమే ది మార్వెల్స్ మూవీ రాబట్టింది. ఈ కలెక్షన్స్ గతంలో వచ్చిన కెప్టెన్ మార్వెల్ కంటే చాలా తక్కువ. అంతేకాకుండా ది మార్వెల్స్ మూవీ ఉత్తర అమెరికాలో విడుదలైన మొదటి రోజు 46.1 మిలియన్ డాలర్లు వసూలు చేసి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చరిత్రలోనే చెత్త ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఇలాంటి ది మార్వెల్స్ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ది మార్వెల్స్ మూవీ వచ్చే నెల అంటే ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ది మార్వెల్స్ మూవీ హాట్‌స్టార్‌లో ఇంగ్లీషుతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ తెలిపింది. సాధారణ ప్రేక్షకులతో పోల్చుకుంటే థియేటర్లలో మిస్సయిన మూవీ లవర్స్, మార్వెల్ ప్రియులు మాత్రం ఓటీటీలో ది మార్వెల్స్ మూవీని చూసే అవకాశం ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే దాదాపు చాలా చిత్రాలు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే ముగ్గురు లేడి సూపర్ వుమెన్స్ నటించిన చిత్రంగా ది మార్వెల్స్ ఘనత సాధించింది. ఇందులో మూడు ప్రధాన పాత్రలు ఉంటాయి. ఆ మూడు పాత్రల్లో ఎప్పటిలా మార్వెల్‌గా చేసే బ్రీ లార్సన్ అలరించింది. అలాగే మిస్ మార్వెల్‌గా ఇమాన్ వెల్లని చేసింది. మిస్ మార్వెల్ టైటిల్‌తో హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరో కీ రోల్‌లో జావే ఆష్టన్ నటించింది.

Whats_app_banner