Miss Janaki Movie: హీరోయిన్‌గా బిగ్ బాస్ బ్యూటి అశ్విని శ్రీ.. డీజే టిల్లు రాధికలా గుర్తుండిపోయే పాత్ర!-bigg boss ashwini sree miss janaki movie pooja ceremony launch bigg boss 7 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Janaki Movie: హీరోయిన్‌గా బిగ్ బాస్ బ్యూటి అశ్విని శ్రీ.. డీజే టిల్లు రాధికలా గుర్తుండిపోయే పాత్ర!

Miss Janaki Movie: హీరోయిన్‌గా బిగ్ బాస్ బ్యూటి అశ్విని శ్రీ.. డీజే టిల్లు రాధికలా గుర్తుండిపోయే పాత్ర!

Sanjiv Kumar HT Telugu
Apr 08, 2024 06:30 AM IST

Bigg Boss Ashwini Sree Miss Janaki Movie: హీరోయిన్‌గా మరో బిగ్ బాస్ బ్యూటి మారింది. బిగ్ బాస్ 7 తెలుగుతో పాపులారిటీ తెచ్చుకున్న అశ్విని శ్రీ మిస్ జానకి అనే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులోని పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేసింది అశ్విని శ్రీ.

హీరోయిన్‌గా బిగ్ బాస్ బ్యూటి అశ్విని శ్రీ.. డీజే టిల్లు రాధికలా గుర్తుండిపోయే పాత్ర!
హీరోయిన్‌గా బిగ్ బాస్ బ్యూటి అశ్విని శ్రీ.. డీజే టిల్లు రాధికలా గుర్తుండిపోయే పాత్ర!

Bigg Boss Ashwini Sree Miss Janaki: ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఎంతోమంది సినిమాల్లో మంచి కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. గత చివరి సీజన్ బిగ్ బాస్ 7 తెలుగు ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన అశ్విని శ్రీ. ఇప్పుడు అశ్విని శ్రీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా మిస్ జానకి.

మిస్ జానకి సినిమాను ఎన్ఎన్ చాందిని క్రియేషన్స్ బ్యానర్‌పై నాగరాజు నెక్కంటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సతీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్ జానకి ప్రారంభ పూజా కార్యక్రమాన్ని ఏప్రిల్ 7న (ఆదివారం) నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన విశేషాలు తెలిపారు.

"మంచి కథను అందించాలనే రెండు సంవత్సరాల క్రితం రాసుకున్న కథ. ఇన్నాళ్లకు ఓ మంచిటీమ్‌తో కుదిరింది. ఏప్రిల్ 20 నుంచి ఏకధాటిగా 30 రోజులు రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తరువాత మరో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేస్తాం. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం. నటి అశ్విని శ్రీకి మంచి పేరుతీసుకొస్తుంది" అని నటుడు మహేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

అశ్విని శ్రీ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ తరువాత చాలా స్టోరీలు విన్నాను. కానీ, మిస్ జానకి స్టోరీ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్‌గా ఉందని వెంటనే ఈ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్‌ల అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమానకు నన్ను ఎంచుకున్నందుకు ప్రొడ్యూసర్ నాగరాజు నెక్కంటికి థ్యాంక్స్. డైరెక్టర్ సతీష్ కుమార్ ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటారు" అని అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది.

"ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగరాజు నెక్కంటికి థ్యాంక్స్. అలాగే కథ నమ్మి నాతో జర్నీ చేస్తున్న నటీనటులకు, టెక్నిషన్స్ ధన్యవాదాలు. ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి మంచి అవుట్ ఫుట్ ఇస్తామని నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం" అని మిస్ జానకి డైరెక్టర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు.

శాని సాల్వమని మాట్లాడుతూ.. "సినిమా కథ చాలా బాగుంది. ముఖ్యంగా హీరోయిన్‌కు చాలా మంచి పేరు వస్తుంది. అలాగే ఈ సినిమాలో నాకు ఓ మంచి క్యారెక్టర్‌ను రాశారు, అది తెరపై ఎలా వస్తుందో చూడాలనే అతృతగా ఉంది. డైరెక్టర్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు" అని నటి శాని సాల్వమని తెలిపారు.

డైరెక్టర్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు సినిమా కోసం ఎలా కష్టపడుతున్నారో దగ్గరుండి చూస్తున్నట్ల యాక్టర్ లోబో చెప్పుకొచ్చాడు. "ఇది చిన్న సినిమా కాదు. కథ బాగుండాలి అదొక్కటే టార్గెట్ పెట్టుకోవాలి. అంతేకానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఏమి లేదు. సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకున్న జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇప్పుడు లోబో అంటే అందరూ గుర్తిస్తున్నారంటే దానికి కారణం బిగ్ బాస్" అని లోబో పేర్కొన్నాడు.

"ఈ సినిమాలో లెజండరీ పర్సన్ తనికెళ్ళ భరణితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సినిమాకు మంచి పేరు వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు ధన్యవాదాలు" అని లోబో అన్నాడు. "ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్‌కు థ్యాంక్స్. అలాగే కథ నచ్చి ప్రొడ్యూస్ చేస్తున్న నాగరాజు నెక్కంటికి హీరోయిన్‌గా నటిస్తున్న అశ్విని శ్రీకు, డైరెక్టర్ సతీష్ కుమార్‌కు శుభాకాంక్షలు" అని డాన్స్ మాస్టర్ సత్య తెలిపారు.

IPL_Entry_Point