HIT 2 Trailer Launch Date: హిట్‌ 2 ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే.. నాని, అడివి శేష్ ఫన్నీగా ఎలా అనౌన్స్‌ చూశారో చూడండి-hit 2 trailer launch date announced by nani and adivi sesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hit 2 Trailer Launch Date: హిట్‌ 2 ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే.. నాని, అడివి శేష్ ఫన్నీగా ఎలా అనౌన్స్‌ చూశారో చూడండి

HIT 2 Trailer Launch Date: హిట్‌ 2 ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే.. నాని, అడివి శేష్ ఫన్నీగా ఎలా అనౌన్స్‌ చూశారో చూడండి

HT Telugu Desk HT Telugu
Published Nov 21, 2022 09:57 PM IST

HIT 2 Trailer Launch Date: హిట్‌ 2 ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే అంటూ నాని, అడివి శేష్ చాలా ఫన్నీగా అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ను కూడా ఇలాగే అనౌన్స్‌ చేసిన మేకర్స్‌.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారు.

నాని, అడివి శేష్
నాని, అడివి శేష్

HIT 2 Trailer Launch Date: హిట్‌ 2 మూవీ టీజర్‌ ఇప్పటికే రిలీజై సంచలనాలు సృష్టించింది. హిట్‌ మూవీతో ఓ అదిరిపోయే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను అందించిన శైలేష్‌ కొలను.. ఈసారి సీక్వెల్‌తోనూ అదే మ్యాజిక్‌ చేయడానికి సిద్ధమవుతున్నాడు. టీజర్‌లో కాస్త వయోలెన్స్‌ ఎక్కువగానే ఉన్నా.. ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేసిన థ్రిల్‌ మాత్రం అలాగే ఉంది.

ఇక ఇప్పుడీ సినిమా ట్రైలర్‌ లాంచ్‌కు కూడా ముహూర్తం ఖరారైంది. టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను డైరెక్టర్‌ శైలేష్‌ కొలను, మూవీ హీరో అడివి శేష్‌ కలిసి కాస్త వెరైటీగా అనౌన్స్‌ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఇది ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడీ మూవీ ప్రజెంటర్‌ నాని, హీరో అడివి శేష్‌ అంతే ఫన్నీగా ట్రైలర్‌ లాంచ్ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఈ ట్రైలర్‌ను నవంబర్‌ 23న రిలీజ్ చేయబోతున్నారు.

ఓపెన్‌ చేస్తే.. నాని, శేష్‌ ఎవరి ఫోన్లలో వాళ్లు బిజీగా ఉంటారు. ఈలోపు మన సినిమా రిలీజ్ ఎప్పుడు అని శేష్‌ అడుగుతాడు. మరో పది రోజుల్లో అని పక్క నుంచి ఎవరో చెబుతారు. దీంతో ఈ మూవీ నైజాం హక్కులూ అంటూ శేష్‌ అడగబోతుండగా.. సోల్డ్‌ అని నాని సీరియస్‌గా చెబుతాడు. అలాగే ఆంధ్రా, సీడెడ్‌, ఓవర్సీస్‌ హక్కులు కూడా సోల్డ్‌ అని చెబుతాడు.

శేష్‌ ఏం అడిగినా.. హిట్‌ హిట్టు అంటూ నాని చెబుతుంటాడు. అలా ఎలా చెబుతాం.. ఈ కాలంలో ప్రేక్షకులు ట్రైలర్‌ చూసే చెప్పేస్తున్నారని శేష్‌ అనగా.. నేనూ అదే చూసి చెప్పాను సూపర్‌ అంటూ నాని అంటాడు. నువ్వు చూసేశావా.. మరి వీళ్లకు ఎప్పుడు చూపిద్దామంటూ శేష్‌ అడుగుతాడు. దానికి నాని రిప్లై ఇస్తూ ట్రైలర్‌ ఆన్‌ నవంబర్‌ 23 అంటాడు.

ప్రశాంతి తిపిర్నేని సినిమాను ప్రొడ్యూస్‌ చేయగా.. నాని తన వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ కింద సమర్పిస్తున్నాడు. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌, కోమలీ ప్రసాద్, రావు రమేష్‌, పోసాని ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Whats_app_banner