Unstoppable Episode 3: ప్రొడ్యూసర్‌పై చెక్ బౌన్స్ కేసు గురించి చెప్పిన శర్వానంద్ - అడివిశేష్ ఫస్ట్ లవ్ స్టోరీ రివీల్
Unstoppable Episode 3: బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో యంగ్ హీరోలు శర్వానంద్, అడివిశేష్ గెస్ట్‌లుగా సందడి చేశారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రిలీజైంది. ఇందులో తమ బ్రేకప్, కెరీర్ పరంగా ఎదురైన కష్టాలు, వివాదాల గురించి శర్వానంద్, అడివిశేష్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
Unstoppable Episode 3: బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో విత్ ఎన్‌బీకే సీజన్ 2 అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ షో మూడో ఎపిసోడ్‌కు యువ హీరోలు శర్వానంద్ (Sharwanand), అడివిశేష్ (Adivi sesh) గెస్ట్‌లుగా హాజరయ్యారు. శుక్రవారం ఈ ఎపిసోడ్ రిలీజైంది. ఇందులో తమ కెరీర్, బ్రేకప్స్, వివాదాల గురించి శర్వానంద్, అడివిశేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రొడ్యూసర్‌పై వేసిన చెక్ బౌన్స్ కేసు గురించి శర్వానంద్ ఈ షోలో వెల్లడించాడు.
ప్రొడ్యూసర్స్‌పై నమ్మకంతో ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఓ సినిమా చేశానని అన్నాడు. . కానీ సినిమా రిలీజైన తర్వాత నిర్మాతలు ఫోన్లు ఎత్తడం మానేశారని, కోపంపై వారిపై చెక్ బౌన్స్ కేసు వేశానని చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్ పేరును బాలకృష్ణ అడిగితే శర్వానంద్ మాత్రం చెప్పలేదు. ఇప్పటివరకు తనకు నచ్చిన ప్రతి అమ్మాయికి ఐలవ్‌యూ చెప్పానని, కానీ చాలా మంది నో తనకు చెప్పి వెళ్లిపోయారని శర్వా పేర్కొన్నాడు.
ఈ షోలో రానాకు శర్వానంద్ ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్‌లో చూడటానికి శర్వానంద్ గుడ్‌బాయ్‌లా ఉంటాడని, కానీ అతడి క్యారెక్టర్ ఫుల్ రివర్స్‌గా ఉంటుందని అనడం నవ్వులను పంచింది. జీవితంలో సొంతంగా ఎదగాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని శర్వానంద్ అన్నాడు.
తాను హీరోగా నటించిన ఫస్ట్ సినిమా సరిగా ఆడలేదని, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేసి మళ్లీ హీరోగా నిరూపించుకున్నట్లు శర్వానంద్ చెప్పాడు. తన సినిమాలకు సంబంధించి హీరోయిన్ల ఎంపికలో ఎలాంటి జోక్యం చేసుకోనని శర్వానంద్ పేర్కొన్నాడు.
ఈ షోలో తన ఫస్ట్ క్రష్ గురించి అడివిశేష్ ఇంట్రెస్టింగ్ స్టోరీని రవీల్ చేశాడు. కర్మ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా చేశానని, ఆ సినిమాలో కర్మ సిద్ధాంతం గురించి చెబితే జనాలు తిట్టు అనుకొని సినిమాచూడలేదని అడివిశేష్ చెప్పాడు. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారని, కానీ ఇండస్ట్రీలో ప్రభాస్, శర్వానంద్‌తో పాటు పెళ్లి కావాల్సిన పెద్దలు చాలా మంది ఉన్నారని, వారు పెళ్లి చేసుకున్న తర్వాతే తాను చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
అడివిశేష్ మాటలకు నేను ప్రభాస్ పేరు చెప్పుకొని తిరిగితే నువ్వు నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావా అంటూ శర్వానంద్ పంచ్ డైలాగ్ వేయడం నవ్వించింది. పెళ్లికి టైమ్ పడుతుందనే తన లవ్‌కు బ్రేక్‌ప్ చెప్పానని, ప్రస్తుతం తాను సింగిల్ అని, ఎవరితో మింగిల్ కావడానికి రెడీగా లేనని అడివిశేష్ పేర్కొన్నాడు.
అమెరికాలో స్కూల్ డేస్‌లో 14 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. ఆ సమయంలో తనకు 16 ఏళ్ల వయసు అని అబద్దం చెప్పానని అన్నాడు. కెరీర్‌లో తన జీవితంలో బిగ్ రిగ్రేట్ గురించి చెబుతూ శంకర్ బాయ్స్ సినిమాలో ఆడిషన్ చేసే అవకాశం వచ్చిందని, కానీ దానిని మిస్ చేసుకున్నానని, ఇప్పటికీ ఆ విషయంలో ఫీల్ అవుతున్నానని అడివిశేష్ చెప్పాడు. ఈ షోలో బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు అడివిశేష్, శర్వానంద్ ఫన్నీగా సమాధానాలు చెప్పారు.