Meet Cute Teaser: నాని ప్రొడక్షన్‌లో వెబ్‌సిరీస్.. టీజర్‌కు ముహూర్తం ఫిక్స్-nani sister deepthi ghanta directing meet cute teaser release tomorrow ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Sister Deepthi Ghanta Directing Meet Cute Teaser Release Tomorrow

Meet Cute Teaser: నాని ప్రొడక్షన్‌లో వెబ్‌సిరీస్.. టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

Maragani Govardhan HT Telugu
Nov 11, 2022 03:48 PM IST

Meet Cute Teaser: నేచురల్ స్టార్ నాని నిర్మించిన తాజా వెబ్ సిరీస్ మీట్ క్యూట్. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. నాని సోదరి దీప్తి గంటా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సత్యరాజ్, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీట్ క్యూట్
మీట్ క్యూట్

Meet Cute Teaser: టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా.. నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే అ!, హిట్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను నిర్మిస్తూ దూసుకెళ్తున్న ఆయన.. తాజాగా మరో వెబ్‌సిరీస్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో మీట్ క్యూట్ అనే వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌కు నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా అరంగేట్రం చేస్తోంది. నానితో పాటు ప్రశాంతి తిపిర్నేని మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ టీజర్‌ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ ఆంథాలజీ సిరీస్‌ టీజర్‌ను శనివారం నాడు విడుదల చేయనున్నారు మేకర్స్. ఇది పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ వెబ్‌సిరీస్‌కు వసంత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. విజయ్ బులగానిన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పనులు చూస్తున్నారు.

ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్‌లో సత్య రాజ్, రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన, సంచిత పూంచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మాసూర్య, రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మీట్ క్యూట్ సిరీస్‌ను అర్ధవంతమైన సంభాషణలు, హృదయపూర్వక క్షణాలతో అందమైన యాదృచ్ఛిక సంఘటనలతో తెరకెక్కిస్తున్నారు దీప్తి గంటా. సోదరి కోసం నానినే స్వయంగా ఈ ప్రాజెక్టును నిర్మించడం గమనార్హం.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.