Pat Cummins IPL 2024 Final: కెప్టెన్‍గా ప్యాట్ కమిన్స్ టైటిళ్ల హ్యాట్రిక్ కొట్టేస్తాడా?
Pat Cummins IPL 2024 Final: ప్యాట్ కమిన్స్ కెప్టెన్‍గా ఫుల్ ఫామ్‍లో ఉన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించాడు. ఇప్పుడు సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
Pat Cummins IPL 2024 Final: ఆస్ట్రేలియా కెప్టెన్‍గా ప్యాట్ కమిన్స్ గతేడాది దుమ్మురేపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత్‍ను ఫైనల్‍లో ఓడించి ఆసీస్‍కు టైటిల్‍ను ఎగరేసుకుపోయాడు. భారత్ వేదికగా జరిగిన గతేడాది వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‍లో అజేయంగా ఫైనల్‍కు దూసుకొచ్చిన టీమిండియాను ఫైనల్‍లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఓడించింది. భారత్ ప్రపంచకప్ ఆశలపై దెబ్బకొట్టింది. ఇప్పుడు కెప్టెన్‍గా ప్యాట్ కమిన్స్‌కు హ్యాట్రిక్ టైటిల్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఐపీఎల్ 2024 ఫైనల్‍లో కమిన్స్ సారథ్యంలోని సన్‍రైజర్స్ హైదరాబాద్ రేపు (మే 26) కోల్‍కతా నైట్‍రైడర్స్‌తో తలపడనుంది.
తొలిసారి టీ20 టోర్నీలో సారథిగా కమిన్స్
ఆస్ట్రేలియాకు వన్డేలు, టెస్టుల్లోనే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేస్తున్నాడు. అయితే, ఇంటర్నేషనల్‍తో పాటు లీగ్‍ల్లోనూ ఏ టీ20 జట్టుకు కమిన్స్ పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు నిర్వర్తించలేదు. అయితే, ఐపీఎల్ 2024 వేలంలో ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధరతో సన్‍రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఐడెన్ మార్క్‌రమ్‍ను తప్పించి అతడిని కెప్టెన్‍ను చేసింది. కమిన్స్‌కు అంత భారీ ధర చెల్లించి హైదరాబాద్ పొరపాటు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కమిన్స్ వాటిని బద్దలుకొట్టి.. తన విలువేంటో చాటి చెప్పాడు. కమిన్స్ తన మార్క్ దూకుడును హైదరాబాద్ జట్టులో నింపాడు. దీంతో ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు సాధించడం సహా రికార్డుల మోతతో దుమ్మురేపింది సన్‍రైజర్స్. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలువడంతో పాటు క్వాలిఫయర్-2లో గెలిచి ఫైనల్‍లో అడుగుపెట్టింది.
హ్యాట్రిక్‍పై కమిన్స్ కన్ను
గతేడాది ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‍షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్‍ను కెప్టెన్‍గా ఆస్ట్రేలియాకు సాధించిపెట్టాడు ప్యాట్ కమిన్స్. 2023 వన్డే ప్రపంచకప్ టైటిల్‍ను సారథిగా దక్కించుకున్నాడు. కేకేఆర్‌పై సన్‍రైజర్స్ హైదరాబాద్ రేపు ఫైనల్‍లో గెలిస్తే కెప్టెన్‍గా ప్యాట్ కమిన్స్ టైటిళ్ల హ్యాట్రిక్ పూర్తి చేసుకుంటాడు. గెలుపుపై సన్‍రైజర్స్ హైదరాబాద్ దీమాగా ఉంది. క్వాలిఫయర్-2 చెపాక్‍లోనే ఆడి రాజస్థాన్‍పై గెలువడం హైదరాబాద్‍కు ప్లస్‍గా ఉంది. ఆ స్టేడియం పరిస్థితులు కమిన్స్ సేనకు ఇప్పటికే అర్థమై ఉంటాయి.
సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య రేపు (మే 26) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2024 ఫైనల్ జరగనుంది. కోల్‍కతా, హైదరాబాద్ ఈ సీజన్‍లో అటాకింగ్ మోడ్‍లోనే ఆడి ఫైనల్ చేరాయి. దీంతో ఈ తుదిపోరుపై మరింత ఆసక్తి నెలకొని ఉంది.
హైదరాబాద్‍కు టైటిల్ అందించే మూడో ఆసీస్ కెప్టెన్‍గానూ!
2009లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‍క్రిస్ట్ టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2013లో ఆ స్థానంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. 2016లో సన్‍రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో టైటిల్ కొట్టింది. కోల్‍కతాపై రేపు ఐపీఎల్ 2024 ఫైనల్‍లో హైదరాబాద్ గెలిస్తే.. ఆ జట్టుకు టైటిల్ అందించే మూడో ఆస్ట్రేలియా కెప్టెన్‍గా కమిన్స్ నిలుస్తాడు.
ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ నాలుగోసారి ఫైనల్ చేరింది. 2012, 2014లో ఆ జట్టు టైటిల్స్ సాధించింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇది మూడో ఫైనల్. ఆ జట్టు 2016లో టైటిల్ కొట్టింది. మరి రేపు (మే 26) జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్‍లో హైదరాబాద్, కోల్‍కతాల్లో ఏ జట్టు సత్తాచాటి టైటిల్ కొడుతుందో చూడాలి.