Vijayawada Loan App Threats : రూ.10 వేలకు లక్ష కట్టమన్నారు, లోన్ యాప్ వేధింపులకు విద్యార్థి సూసైడ్
Vijayawada Loan App Threats : విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
Vijayawada Loan App Threats : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరో విద్యార్థి ప్రాణాలు తీశాయి. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మురికింటి వంశీ కృష్ణా నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. మురికింటి వంశీ(22) ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. తన అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్ లో వంశీ రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే లోన్ యాప్ నిర్వాహకులు రూ.లక్ష చెల్లించాలని వేధించారు. విషయం తల్లిదండ్రులు తెలిస్తే బాధపడుతున్నారని ఈనెల 25న వంశీ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అనంతరం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కోసం గాలించిన కుటుంబ సభ్యులు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు చివరిగా అతడి లోకేషన్ ను గుర్తించారు. తాడేపల్లిలోని కృష్ణా నది ఒడ్డున అతడి సెల్‌ఫోన్, చెప్పులు, బైక్‌ను పోలీసులు గుర్తించారు. కృష్ణా నదిలో గాలించిన పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లోన్ యాప్ ఆగడాలకు అడ్డుకట్టపడడంలేదు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా నిత్యం ఎక్కడో ఒకచోట లోన్ యాప్ వేధింపులు వినిపిస్తున్నారు. అత్యవసరం కోసం లోన్ యాప్ లలో అప్పులు తీసుకుని చిక్కుల్లో పడుతున్నారు. తక్కువ మొత్తం నగదు ఇస్తూ తిరిగి అధికంగా చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే లోన్ యాప్ వేధింపులను సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చి ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కానీ తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
పై చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిపల్లెకు చెందిన గుంటిపల్లి సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అయితే అమెరికాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య మృతి చెందింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సౌమ్యను అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సౌమ్య చదువుతో పాటు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఉన్నత చదువులు చదివి పై స్థాయికి వెళ్తుందని ఆశించిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్య మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషయంలో నెలకొంది.
సంబంధిత కథనం