Andhra Pradesh News Live October 3, 2024: Pawan Kalyan in Tirupati : సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను - డిప్యూటీ సీఎం పవన్-today andhra pradesh news latest updates october 3 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 3, 2024: Pawan Kalyan In Tirupati : సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను - డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan in Tirupati : సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను - డిప్యూటీ సీఎం పవన్

Andhra Pradesh News Live October 3, 2024: Pawan Kalyan in Tirupati : సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను - డిప్యూటీ సీఎం పవన్

01:42 PM ISTOct 03, 2024 07:12 PM HT Telugu Desk
  • Share on Facebook
01:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 03 Oct 202401:41 PM IST

Andhra Pradesh News Live: Pawan Kalyan in Tirupati : సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను - డిప్యూటీ సీఎం పవన్

  • సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకి వచ్చి పోరాటం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన.. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణ త్యాగం కూడా చేస్తానంటూ కామెంట్స్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని అన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202412:57 PM IST

Andhra Pradesh News Live: Indian Maritime University : విశాఖ మారిటైమ్ వ‌ర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్

  • Indian Maritime University : విశాఖ ఐఎంయూలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి వర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202412:32 PM IST

Andhra Pradesh News Live: Tirupati Laddu Case : తిరుపతి లడ్డూ కేసుపై విచారణ - దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలన్న సుప్రీం

  • Tirupati Laddu controversy Case : తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సిట్ ద‌ర్యాప్తు కొన‌సాగించాలా? లేక స్వతంత్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు జ‌రిపించాలా? అనే అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గాల‌ని సొలిసిటర్ జ‌న‌ర‌ల్ కు సుప్రీం సూచించింది. రేపటికి విచారణ వాయిదా వేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202410:47 AM IST

Andhra Pradesh News Live: AP Cabinet : ఈనెల 10న ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!

  •  ఈనెల 10వ తేదీన ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఉచిత గ్యాస్ వంటి ప‌లు అంశాల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవకాశం ఉంది. చెత్త‌ ప‌న్ను ర‌ద్దు, వాలంటీర్ల జీతాలతో పాటు రాజధాని నిర్మాణ పనులపై చర్చించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202410:45 AM IST

Andhra Pradesh News Live: Tirumala : అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

  • Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు.. టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం.. అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో మీడియాతో మాట్లాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202410:03 AM IST

Andhra Pradesh News Live: YSRCP : కేసులకు భయపడొద్దు.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్

  • YSRCP : వైసీపీ చీఫ్ జగన్.. జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. తన పార్టీ నాయకులకు ధైర్యం కల్పించారు. మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202408:12 AM IST

Andhra Pradesh News Live: Chandrababu Delhi Tour : అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు.. ఈనెల 7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు!

  • Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కీలక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్చించనున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, అమిత్ షా, రైల్వే శాఖ మంత్రిని చంద్రబాబు కలవనున్నారు. చంద్రబాబు పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202407:15 AM IST

Andhra Pradesh News Live: Insurance frauds: వాహనాల ఇన్సూరెన్స్‌ కంపెనీలు మోసం చేస్తుంటే ఇకపై ఇలా చేయండి.. మరమ్మతులు ఎక్కడైనా చేసుకోవచ్చు…

  • Insurance frauds: రోడ్డు ప్రమాదాలు, ప్రకృత్తి విపత్తుల సందర్భంగా వాహనాలు దెబ్బతింటే బీమా పరిహారాన్ని ఎగ్గొట్టడానికి ఇన్సూరెన్స్‌ కంపెనీలు, కార్ల షోరూమ్‌లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. బీమా ఎగ్గొట్టడానికి కంపెనీలు  ప్రయత్నిస్తే  సెటిల్‌మెంట్‌ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202406:10 AM IST

Andhra Pradesh News Live: Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అజ్ఞాత భక్తుడి కానుక, రెండున్నర కోట్ల విలువైన కిరీటంతో అలంకారం

  • Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అజ్ఞతా భక్తుడు కోట్లాది రుపాయల విలువైన కిరీటాన్ని బహుకరించాడు. దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి రెండున్నర కోట్ల రుపాయల ఖరీదు చేసే బంగారు కిరీటాన్ని అలంకరించారు. ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202405:29 AM IST

Andhra Pradesh News Live: Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి వెళ్లే రైళ్ల‌కు అద‌న‌పు బోగీలు...స్పెష‌ల్ ట్రైన్స్ పొడిగింపు

  • Special Trains : ప్ర‌యాణికుల‌కు సౌత్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. 6 తిరుప‌తి రైళ్ల‌కు అద‌న‌పు బోగీలను అనుసంధానం చేస్తున్న‌ట్లు తెలిపింది. న‌ర‌సాపురం- హైద‌రాబాద్ మ‌ధ్య రెండు స్పెష‌ల్ రైళ్లు పొడిగించిన‌ట్లు వెల్లడించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202403:48 AM IST

Andhra Pradesh News Live: AP Child Murder: కాకినాడ జిల్లాలో ఘోరం, ఆడ‌పిల్ల పుట్టింద‌ని గొంతు నులిమి చంపేశాడు.. చిత్తూరులో శవమై తేలిన చిన్నారి

  • AP Child Murder: కాకినాడ జిల్లా ఘోరమైన హృదయ విదార‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఆ శిశువు గొంతు నులిమి, గోడ‌కేసి కొట్టి క‌ర్క‌శంగా తండ్రే చంపేశాడు. మరో ఘటనలో చిత్తూరు జిల్లాలో  నాలుగు రోజుల క్రితం అదృశ్యంమైన చిన్నారి, చివ‌రికి శ‌వ‌మై ప్ర‌త్య‌క్ష‌మైంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 03 Oct 202411:30 PM IST

Andhra Pradesh News Live: BalaTripura Sundari: బాలత్రిపురసుందరిగా దుర్గమ్మ..ఇంద్రకీలాద్రిపై వైభవంగా మొదలైన దసరా వేడుకలు

  • BalaTripura Sundari: శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి