Union Minister Rammohan Naidu : యువ నేతగా, బలమైన గొంతుకగా..! హ్యాట్రిక్ ఎంపీ 'రామ్మోహన్' ప్రస్థానం ఇదే..!-these are the highlights of tdp mp kinjarapu rammohan naidu political reign ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Union Minister Rammohan Naidu : యువ నేతగా, బలమైన గొంతుకగా..! హ్యాట్రిక్ ఎంపీ 'రామ్మోహన్' ప్రస్థానం ఇదే..!

Union Minister Rammohan Naidu : యువ నేతగా, బలమైన గొంతుకగా..! హ్యాట్రిక్ ఎంపీ 'రామ్మోహన్' ప్రస్థానం ఇదే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 09, 2024 12:25 PM IST

Union Minister Kinjarapu Rammohan Naidu : టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి దాదాపు కేబినెట్ బెర్త్ ఖాయమైంది. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

Union Minister Kinjarapu Rammohan Naidu : కింజరాపు రామ్మోహన్ నాయుడు… తెలుగుదేశం పార్టీ యువ ఎంపీగా పేరొందారు..! ఎర్రన్నాయుడి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన…. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. సందర్భం, సమయాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ తరపున బలమైన గొంతును వినిపిస్తూ…. తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

గతంలో ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ…. పార్లమెంట్ లో  రామ్మోహన్ నాయుడు అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రధానమంత్రితో పాటు కేంద్రమంత్రులను సూటిగా ప్రశ్నిస్తూ…తన మార్క్ ను చూపారు. ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడటంలో రామ్మోహన్ నాయుడు దిట్ట అని చెప్పొచ్చు. గతంలో ఆయన పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలు వింటే అర్థం చేసుకోవచ్చు…! 

ఎర్రన్నాయుడి వారసుడిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు.. పార్టీలో కూడా యువనేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. అధినాయకత్వానికి దగ్గరగా ఉంటూ… పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ… తన శక్తి, సామర్థ్యాలతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు.

హ్యాట్రిక్ ఎంపీగా రామ్మోహన్ నాయుడు - కేంద్రంలో మంత్రిగా…!

తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు.అప్పటికే ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచే వరుసగా మూడుసార్లు రామ్మోహన్ నాయుడు ఎంపీగా విజయం సాధించారు.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు…వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై 127,572 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ.. ఇదే స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు మరోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పై 6,653 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పేరాడ తిలక్ పై ఏకంగా 3,27,901 ఓట్ల తేడాతో భారీ విక్టరీని కొట్టారు.

ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన టీడీపీ… కేంద్రంలోనూ కీలకంగా మారింది. ఎన్డీయే కూటమిలో రెండో అథిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో టీడీపీకి కేబినెట్ బెర్త్ లు ఖరారు కానున్నాయి. ఇందులో భాగంగా రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయమైంది. ప్రస్తుతం కొలువుదీరే మోదీ కేబినెట్ లో అత్యంత తక్కువ వయసు గల కేంద్రమంత్రిగా కూడా రామ్మోహన్ నాయుడు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 38 ఏళ్ల వయసు గల రామ్మోహన్ నాయుడికి కీలక శాఖనే దక్కొచ్చని సమాచారం. ఇవాళ సాయంత్రం మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇక రామ్మోహన్ నాయుడు తండ్రి  ఎర్రన్నాయుడు కేంద్ర రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 1996-1998 మధ్యకాలంలో ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కేబినెట్‌లలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. ఇక ఎర్రన్నాయుడు సోదరుడైన అచ్చెన్నాయుడు…. టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉండే అవకాశం కూడా ఉంది.

 

 

 

Whats_app_banner