Union Cabinet : రామ్మోహన్​ నాయుడికి మోదీ కేబినెట్​లో చోటు! జనసేన నుంచి..-nitish eyes key ministries tdps rammohan naidu poised for cabinet inclusion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Union Cabinet : రామ్మోహన్​ నాయుడికి మోదీ కేబినెట్​లో చోటు! జనసేన నుంచి..

Union Cabinet : రామ్మోహన్​ నాయుడికి మోదీ కేబినెట్​లో చోటు! జనసేన నుంచి..

Sharath Chitturi HT Telugu
Jun 08, 2024 11:31 AM IST

Rammohan Naidu : టీడీపీకి చెందిన రామ్మోహన్​ నాయుడుకు మోదీ కేబినెట్​లో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన నుంచి కూడా ఒకరు మోదీ కేబినెట్​లోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది!

టీడీపీ రామ్మోహన్​ నాయుడికి మోదీ కేబినెట్​లో చోటు! జనసేన నుంచి..!
టీడీపీ రామ్మోహన్​ నాయుడికి మోదీ కేబినెట్​లో చోటు! జనసేన నుంచి..! (HT_PRINT)

Union Cabinet ministers : 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్​లో ఎవరు చోటు దక్కించుకుంటారు? అన్న అంశంపై సర్వత్రా చర్చ జరగుతోంది. ఎన్​డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు తమతమ డిమాండ్​లను మోదీ ముందు పెట్టాయి. వాటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతలో.. మోదీ కేబినెట్​కు సంబంధించిన పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. టీడీపీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్​ నాయుడుకు మోదీ కేబినెట్​లో చోటు దక్కుతుందని సమాచారం.

మోదీ కేబినెట్​లో రామ్మోహన్​ నాయుడు!

మోదీ కేబినెట్​లో టీడీపీ బృందం నాలుగు పోస్ట్​లు అడిగినట్టు సమాచారం. వాటిల్లో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. అయితే.. చంద్రబాబు నాయుడు టీడీపీకి ఒక మంత్రి పదవి, రెండు సహాయ మంత్రుల పోస్టులు దక్కొచ్చని తెలుస్తోంది.

"రామ్మోహన్​ నాయుడుకు మంత్రి పదవి దక్కొచ్చు. రెండు సహాయ మంత్రుల పదవులు కూడా టీడీపీకి వెళ్లొచ్చు. అంతేకాదు.. డిప్యూటీ స్పీకర్​ పోస్ట్​ కూడా టీడీపీకి దక్కొచ్చు," అని సంబంధిత వర్గాలు హిందుస్థాన్​ టైమ్స్​కు వెల్లడించాయి.

అయితే.. యూనియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మినిస్టర్స్​లో ఇద్దరు టీడీపీ నేతలు చేరే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారు.. గుంటూర్​ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్​, నెల్లూర్ ఎంపీ​ ప్రభాకర్​ రెడ్డీ.

Narendra Modi cabinet : "చంద్రశేఖర్​కి ఎన్​ఆర్​ఐ ఇన్​వెస్టర్స్​తో మంచి సంబంధం ఉంది. ప్రభాకర్​ రెడ్డీకి.. కార్పొరేట్​ ప్రపంచంతో కనెక్షన్స్​ ఉన్నాయి. అందుకే వారికి కీలక రోల్స్​ దకొచ్చని ఆశిస్తున్నాము," అని ఓ టీడీపీ నేత హెచ్​టీ తెలిపారు.

ఒకవేళ టీడీపీకి నాలుగు కేబినెట్​ పదవులు దక్కితే.. ఎస్​సీ వర్గానికి చెందిన ఎంపీ పేరును చంద్రబాబు నాయుడు ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.

జనసేన ఎంపీ వల్లభనేని బాల శౌరీకి కూడా మోదీ కేబినెట్​లో చోటు దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. అంతేకాదు.. ఆంధ్ర బీజేపీ ఎంపీల్లో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా మోదీ కేబినెట్​లో చోటు దక్కొచ్చు అని ఓ టీడీపీ నేత.. హెచ్​టీకి వివరించారు.

2024 Lok Sabha election results : మరోవైపు.. కీలక మంత్రి పదవులపై నితీశ్​ కుమార్​ జేడీయూ కన్నేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖల్లో తన ఎంపీలను పెట్టాలని నితీశ్​ కుమార్​ భావిస్తున్నారట. రాజ్యసభ ఎంపీ సంజయ్​ ఝా, రంజన్​ సింగ్​ లలన్​, కౌషలేంద్ర కుమార్​, రామ్​ప్రీత్​ మండల్​, లవ్లీ ఆనంద్​లు మంత్రుల రేసులో ఉన్నట్టు సంబంధిత వర్గాలు పీటీఐకి వివరించాయి.

జూన్​ 9, ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఆ తర్వాత.. మంత్రుల వివరాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం