Arunachalam Tour Package : అరుణాచలేశ్వరుడి దర్శనం, చెన్నై నుంచి ఒకరోజు టూర్ ప్యాకేజీ
Arunachalam Tour Package : ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శించుకోవడానికి తమిళనాడు టూరిజం చెన్నై నుంచి ఒకరోజు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. అతి తక్కువ ధరలో తిరువణ్ణామలైతో పాటు స్థానిక దేవాలయాలను దర్శించుకోవచ్చు.
Arunachalam Tour Package : తమిళనాడులో అరుణాచలం ప్రముఖ శైవక్షేత్రం. దీనిని స్థానికంగా తిరువణ్ణామలై అని పిలుస్తారు. అరుణాచలం సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. తిరువణ్ణామలై కొండల మధ్య పురాతనమైన అరుంచలేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం వాస్తుశిల్పం, నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అద్భుతమైన శిల్పకళ
కాలక్రమేణా ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అరుణాచలేశ్వరుడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భావిస్తుంటారు. ఈ ఆలయ గోడలపై ఒకప్పుడు ఈ ప్రాంతాలను పాలించిన రాజవంశాలు, రాజుల కథలను వర్ణించేలా శిల్పాలు చెక్కి ఉంటాయి. అరుణాచలం అద్భుత శిల్పకళకు ప్రతీతి. ఈ ఆలయం నడిబొడ్డున అన్నామలైయార్ శివ లింగం ఉంది. ఏటా కార్తీకమాసంలో కార్తిగై దీపం ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. రాత్రిపూట వెలిగించి దీపాలు సందర్శకుల హృదయాలను ఆనందంతో, భక్తితో నింపేస్తాయి.
చెన్నై నుంచి ఒక రోజు టూర్ ప్యాకేజీ
తమిళనాడు టూరిజం అరుణాచలం సందర్శనకు చెన్నై నుంచి ఒకరోజు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ttdconline.com ద్వారా ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ లో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, దర్శన టికెట్టు, కోచ్, గైడ్ అందిస్తారు. ఈ టూర్ లో మీనాక్షి అమ్మన్ ఆలయం, మధురై మరియమ్మన్ ఆలయం, వండియూర్ కాళీ అమ్మన్ ఆలయం, మాదపురం వెట్టుదైయార్ కాళియమ్మన్ ఆలయం, విట్టనేరి ముత్తుమారియమ్మన్ ఆలయం, తాయమంగళం రక్కాయి అమ్మన్ ఆలయం, అళగర్కోయిల్ ఆలయాలను దర్శించుకోవచ్చు.
చెన్నైలో పికప్ పాయింట్లు :
చెన్నై టూరిజం కాంప్లెక్స్-ట్రిప్లికేన్ ఉదయం 8.00 గంటలకు, ఉదయం 8.15 గంటలకు సైదాపేట, ఉదయం 8.25 గంటలకు అలందూరు మెట్రో, ఉదయం 8.40 గంటలకు పల్లవరం, క్రోంపేట ఉదయం 8.45 గంటలకు, తాంబరం 8.55 గంటలకు, పెరుంగళత్తూరు ఉదయం 9.00 గంటలకు, ఉదయం 9.05 గంటలకు కిల్లంబాక్కం
డ్రెస్ కోడ్
అరుణాచలం ఆలయ దర్శనానికి డ్రెస్ కోడ్ ఉంది. పురుషులు- చొక్కా/పాంట్‌తో దోతీ, మహిళలు-చీర లేదా దుపట్టాతో చుడీదార్ ధరించాలి. జీన్స్ దుస్తులు అనుమతించరు. ఈ టూర్ ధర ఒక్కొక్కరికి రూ.1850.
టూర్ వివరాలు :
- 08:00 AM - చెన్నై టూరిజం కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
- 10:00 AM - మథురాంతంకంలో అల్పాహారం
- 12:00 PM - తిరువణ్ణామలై తమిళనాడు టూరిజం హోటల్‌కి చేరుకుంటారు. ఇక్కడ ఫ్రెష్ అవుతారు. హోటల్ లోనే మధ్యాహ్న భోజనం ఉంటుంది.
- 03:00 PM - అరుణాచలం ఆలయానికి నడక మార్గం ద్వారా దర్శనానికి వెళ్తారు.
- 04:00 PM -గిరివాలం పర్యటన
- 08:00 PM - రాత్రి హోటల్‌లో డిన్నర్ చేసి తిరిగి చెన్నైకి బయలుదేరతారు.
- తమిళనాడులోని తిరువణ్ణామలైకు సమీప రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గాలు అనుసంధానించి ఉంటాయి. చెన్నై, బెంగళూరు, ఇతర సమీప నగరాల నుంచి అరుణాచలానికి సాధారణ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
- చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అరుణాచలం సుమారు 180 కి.మీ దూరంలో ఉంటుంది.
- తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ
చెన్నై నుంచి అరుణాచలం టూర్ ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం