Arunachalam Tour : 4 రోజుల 'అరుణాచలం' ట్రిప్ - గిరి ప్రదక్షిణతో పాటు ఈ ఆలయాలన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే
- Telangana Tourism Arunachalam Tour : ఈ జూన్ నెలలో అరుణాచలం వెళ్లే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి…..
- Telangana Tourism Arunachalam Tour : ఈ జూన్ నెలలో అరుణాచలం వెళ్లే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి…..
(1 / 7)
తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది.(image source from https://tourism.telangana.gov.in)
(2 / 7)
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లే టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జూన్ 19, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో నెలలో వెళ్లొచ్చు. ఈ తేదీలను త్వరలోనే తెలంగాణ టూరిజం ప్రకటిస్తుంది.(Image Source From Arunachalam Temple FB Page)
(3 / 7)
తొలిరోజు హైదరాబాద్ నుంచి సాయంత్రం 6:30 గంటలకు బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.(Image Source From Arunachalam Temple FB Page)
(4 / 7)
ఇక 3వ రోజు రోజు అల్బాహారం తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.(Image Source From Arunachalam Temple FB Page)
(5 / 7)
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేల టికెట్ ధరగా నిర్ణయించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
(6 / 7)
https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకునే వీలు ఉంటుంది.(Image Source From Arunachalam Temple FB Page)
ఇతర గ్యాలరీలు