ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ  - తెలంగాణ టూరిజం  గోవా టూర్ ప్యాకేజీ ఇదే

By Maheshwaram Mahendra Chary
Jun 06, 2024

Hindustan Times
Telugu

  హైదరాబాద్ - గోవా టూర్(GOA PACKAGE TOUR – ITINERARY) ప్యాకేజీని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది.

image credit to unsplash

హైదరాబాద్ - గోవా ట్రిప్ ప్యాకేజీ   ప్రతి సోమవారం తేదీల్లో జర్నీ ఉంటుంది.

image credit to unsplash

హైదరాబాద్ - గోవా  టికెట్ ధరలు : పెద్దలకు రూ. 11999/- పిల్లలకు రూ. - 9599/, సింగిల్ అక్యుపెన్సీకి రూ. 14900గా నిర్ణయించారు.

image credit to unsplash

    తొలి రోజు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. నైట్ అంతా జర్నీలోనే ఉంటారు. రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు కలంగుట్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి నార్త్ గోవాలోని పలు ప్రాంతాలను చూస్తారు. ఇందులో మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, Fort Aguada, బాగా బీచ్ ను చూస్తారు. మరో రెండు బీచ్ లకు కూడా వెళ్తారు.

image credit to unsplash

    మూడో రోజు సౌత్ గోవాలో ఉంటుంది.ఓల్డ్ గోవా చర్చిలతో పాటు డోనా పౌలా బీచ్ కు వెళ్తారు. Miramar, Mangueshi టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తారు.Pan Jimలో సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీఉంటుంది. దీనికోసం మీరే టికెట్ డబ్బులను చెల్లించాలి. ఒక్కరికి రూ. 500గా ఉంటుంది.    నాల్గో రోజు కలంగుట్ నుంచి మార్నింగ్ 11 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

image credit to unsplash

 https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి హైదరాబాద్ - గోవా ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

గోవా టూర్ ప్యాకేజీకి సంబంధించి  ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

image credit to unsplash

నగ్నంగా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  2016-17లో నేకెడ్ యోగా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.  

pexels