తెలుగు న్యూస్ / ఫోటో /
Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త - అరుణాచలం తరహాలో 'గిరి ప్రదక్షిణ' సేవ, తొలి ఆలయం ఇదే..!
- Giri Pradakshina at Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పింది దేవాదాయశాఖ. అరుణాచలం తరహాలోనే యాదగిరిగుట్టలోనూ 'గిరి ప్రదక్షిణ' సేవ అందుబాటులోకి వచ్చింది. జూన్ 18వ తేదీన ఈ క్రతువు ప్రారంభం కాగా… ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- Giri Pradakshina at Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పింది దేవాదాయశాఖ. అరుణాచలం తరహాలోనే యాదగిరిగుట్టలోనూ 'గిరి ప్రదక్షిణ' సేవ అందుబాటులోకి వచ్చింది. జూన్ 18వ తేదీన ఈ క్రతువు ప్రారంభం కాగా… ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
(1 / 7)
అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణసేవను యాదగిరిగుట్ట దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలిచింది.(Image Source YTDA Website)
(2 / 7)
మంగళవారం(జూన్ 18, 2024) తొలిసారిగా యాదాద్రి ఆలయంలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
(3 / 7)
యాదాద్రీశుడి ఆలయం చుట్టూ ఐదున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిని ఏర్పాటు చేశారు. ఫలితంగా వేలాది వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశం లభించింది.,(Image Source YTDA Website)
(4 / 7)
యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం లభించింది. ఏ మాత్రం ఇబ్బుదుల తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు.(Image Source YTDA Website)
(5 / 7)
అరుణాచలంలో చూస్తే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మాత్రం గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు ఉంటుంది.(Image Source YTDA Website)
(6 / 7)
గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. (Image Source Twitter)
ఇతర గ్యాలరీలు