Attack On Jagan : జగన్ పై దాడి ఆకతాయిలు చేసింది కాదు, ఎయిర్‌గన్ ఉపయోగించినట్లు అనుమానం - సజ్జల-sajjala ramakrishna reddy reaction about attack on ys jagan incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Attack On Jagan : జగన్ పై దాడి ఆకతాయిలు చేసింది కాదు, ఎయిర్‌గన్ ఉపయోగించినట్లు అనుమానం - సజ్జల

Attack On Jagan : జగన్ పై దాడి ఆకతాయిలు చేసింది కాదు, ఎయిర్‌గన్ ఉపయోగించినట్లు అనుమానం - సజ్జల

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 14, 2024 01:45 PM IST

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై జరిగిన దాడిపై(Attack On Jagan) సజ్జల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ఆకతాయిలు చేసిన పని కాదని… పక్కా ప్రణాళిక ప్రకారం ఎయిర్‌ గన్ లాంటి బలమైన వాటితో దాడి చేసినట్టు అనుమానం కలుగుతోందన్నారు.

సజ్జల కీలక వ్యాఖ్యలు
సజ్జల కీలక వ్యాఖ్యలు

Attack On CM Jagan : ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన(Attack On CM Jagan) సంచలనంగా మారింది. శనివారం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై దాడి జరగటంతో… ఇవాళ ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. దాడిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ దాడి ఘటనపై సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పై దాడి ఎవరో ఆకతాయి చేసిన పని కాదన్నారు.చాలా ఫోర్స్ తో రాయి వచ్చి తగిలిందని చెప్పారు. ఈ దాడి ఆకతాయిలు చేసిన పని కాదని.. పక్కా ప్రణాళిక ప్రకారం ఎయిర్‌ గన్(Air gun) లాంటి బలమైన వాటితో దాడి చేసినట్టు అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. దాడి ఘటనను ప్రధానితో సహా చాలా మంది నేతలు ఖండించారని చెప్పారు. కానీ ఎల్లో మీడియా కథనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. కేవలం భద్రతా వైఫల్యం అన్నట్ల కథనాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్ను పోయేది - సజ్జల

జగన్ పై దాడిని(Attack On CM Jagan) వైఎస్‌ఆర్సీపీ(YSRCP) తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు సజ్జల. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడిని కొందరు నటన అంటున్నార.. ఎవరైనా తమపై తామే ఇలాంటి దాడి చేయించుకుంటారా? అని సజ్జల ప్రశ్నించారు. అసలు నటించేది ఎవరో అందరికీ తెలుసంటూ కామెంట్స్ చేశారు. “సీఎం జగన్ కు తలకు కొంచెం కింద తగిలి ఉంటే కన్ను పోయేది. కణతకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం ఉండేది. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు. కడుపుకి అన్నం తినేవారు ఎవరైనా ఇలా అంటారా..?” అని సజ్జల ప్రశ్నించారు.

ఇక వైసీపీలోని మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా….. అనేక అనుమాానాలను వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. నాడు కోడి కత్తి, ఇప్పుడు రాయితో దాడి అంటూ రాసుకొస్తున్నారు. ఇక సామాజిక మాధ్యామాల్లో ఇరుపార్టీల మద్దతుదారులు.,... తీవ్రంగా స్పందిస్తూ పోస్టులు చేస్తున్నారు.

సీఈసీ ఆరా..!

సీఎం జగన్‌పై దాడి(Attack On Jagan) ఘటనపై సీఈసీ(Election Comission) ఆరా తీసింది. ఏకంగా సీఎంపై దాడి జరగడమేంటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఏపీకి చెందిన కొందరు పోలీస్‌ అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. విజయవాడ సీపీ కాంతి రాణాను నివేదికను కూడీ ఈసీ కోరింది.

నేడు యాత్రకు విరామం…

సీఎం జగన్‌ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు నేడు విరామం ఇచ్చారు. గుడివాడలో జరగాల్సిన 'మేమంతా సిద్ధం' సభ రేపటికి వాయిదా పడింది. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్‌కు వైద్యుల సూచించారు. ప్రస్తుతం జగన్… విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం