Attack On CM Jagan : సీఎం జగన్ పై రాయితో దాడి- కన్ను, తలకు స్వల్ప గాయాలు
Attack On CM Jagan : మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. పూలతో పాటు సీఎం జగన్ పై రాయి విసిరారు అగంతులు. రాయి సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంలో తగలడంతో కన్ను స్వల్పంగా వాచింది.
Attack On CM Jagan : విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో(Ysrcp Bus Yatra) సీఎం జగన్(CM Jagan) పై దాడి జరిగింది. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ ఘటన చేసుకుంది. రాయి సీఎం జగన్(Stone Attack on CM Jagan) నుదిటి భాగంలో బలంగా తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది.
టీడీపీ నేతల పనేనంటూ వైసీపీ ఆరోపణలు
సీఎం జగన్(CM Jagan) పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం రాయి తగిలి గాయం అయ్యింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత సీఎం జగన్ మళ్లీ బస్సు యాత్ర (Jagan Bus Yatra)కొనసాగించారు. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రకు భారీగా జనం హాజరయ్యారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా యాత్ర కొనసాగించింది. సీఎం జగన్ భారీ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ(TDP) వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ వైసీపీ నేతలు (Ysrcp Leaders)ఆరోపిస్తున్నారు.
వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి
విజయవాడలో సీఎం జగన్ పై టీడీపీ (TDP)నేతలు దాడికి పాల్పడ్డారని వైసీపీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆరోపించింది. వైసీపీ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ మూకలు పిరికిపంద చర్యకు పాల్పడ్డాయని విమర్శించింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ(Ysrcp) కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారని తెలిపింది.
కేటీఆర్ ట్వీట్
సీఎం జగన్ పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR On Jagan Attack)స్పందించారు. "మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త వైఎస్ జగన్ అన్న. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఈ ఘటనపై ఈసీ కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను" అని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
జగన్ పై దాడి- ఖండించిన షర్మిల
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడిని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila On Jagan attack)ఖండించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై దాడి జరిగి కన్ను పై భాగంగా గాయం కావటం బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నామన్నారు. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు.
సంబంధిత కథనం