EC Notices To CM Jagan : ఎన్నికల కోడ్ ఉల్లంఘన, సీఎం జగన్ కు ఈసీ నోటీసులు-vijayawada ceo mukesh kumar meena notices to cm jagan comments on chandrababu ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Notices To Cm Jagan : ఎన్నికల కోడ్ ఉల్లంఘన, సీఎం జగన్ కు ఈసీ నోటీసులు

EC Notices To CM Jagan : ఎన్నికల కోడ్ ఉల్లంఘన, సీఎం జగన్ కు ఈసీ నోటీసులు

Bandaru Satyaprasad HT Telugu
Apr 07, 2024 04:00 PM IST

EC Notices To CM Jagan : సీఎం జగన్ కు సీఈవో ముకేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

సీఎం జగన్ కు ఈసీ నోటీసులు
సీఎం జగన్ కు ఈసీ నోటీసులు

EC Notices To CM Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి(CM Jagan) ఈసీ నోటీసులు(EC Notices) జారీ చేసింది. సీఎం జగన్ ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించారని టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో ముకేష్ కుమార్ మీనాకు(CEO Mukesh Kumar Meena) ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులపై సకాలంలో స్పందించకపోతే ఈసీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సీఈవో తెలిపారు.

చంద్రబాబుకు ఈసీ నోటీసులు

ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు నోటికి పనిచెబుతున్నారు. దీంతో ఈసీ నేతలను అదుపు చేసేందుకు నోటీసులు ఇస్తుంది. తాజాగా సీఎం జగన్ కు నోటీసులు జారీ చేయగా... అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రులు, వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై చంద్రబాబు(Chandrababu) అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సీఈవో ముకేష్‌ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు(EC Notices To Chandrababu) జారీ చేశారు. నోటీసులపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు ఈసీ సూచించింది. మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ సీఈవోకు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ రాక్షసుడు, జంతువు, దొంగ అని చంద్రబాబు మాట్లాడారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. చంద్రబాబు అనుచిత పదజాలం, దుర్భాషలాడారని, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

ఎంసీసీ ఉల్లంఘిస్తే చర్యలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి(MCC) ప్రకారం... ప్రచారాల్లో అభ్యర్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలను చేయకూడదు. పరిమితులను అతిక్రమించే అసభ్యకరమైన పదజాలం వాడడం, దుర్భాషలాడటం, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా పరిధిదాటి మాట్లాడకూడదు. ఎన్నికల కోడ్(Election Code) ను ఉల్లంఘిస్తే ఈసీ నోటీసులు జారీ చేసి అభ్యర్థుల నుంచి వివరణ కోరుతుంది. సరైన వివరణ ఇవ్వకపోయినా, తగిన సమయంలో స్పందించకపోయినా ఈసీ చర్యలు తీసుకుంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల సంఘం(EC) ఎంసీసీని కట్టుదిట్టంగా అమలుచేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం