YS Sharmila On Jagan : జగన్ గారు... మోసానికే బ్రాండ్ అంబాసిడర్ - వైఎస్ షర్మిల-ys sharmila serious comments on cm ys jagan ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ys Sharmila On Jagan : జగన్ గారు... మోసానికే బ్రాండ్ అంబాసిడర్ - వైఎస్ షర్మిల

YS Sharmila On Jagan : జగన్ గారు... మోసానికే బ్రాండ్ అంబాసిడర్ - వైఎస్ షర్మిల

AP Elections 2024 Updates : సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). ‘జగన్ గారు.... మోసానికే బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్ అయ్యారు.

జగన్ పై షర్మిల ఫైర్ (Twitter)

YS Sharmila On YS Jagan: ఏపీలో ఎన్నికల(AP Elections 2024) వేళ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపుతున్నారు. ఓవైపు నుంచి కామెంట్స్ వస్తే చాలు…అటువైపు నుంచి వెంటనే కౌంటర్ వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ లో చేరి పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల(YS Sharmila) కూడా తీవ్రస్థాయిలో…. వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ఎన్డీయే కూటమిని కూడా ప్రశ్నిస్తున్నారు.

కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల… వివేకా హత్య కేసు విషయంలో అధికార వైసీపీపై సూటిగా విమర్శలు గుపిస్తున్నారు. అయితే తాజాగా సీఎం జగన్ పై ఘాటుగా ట్వీట్ చేశారు. నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ గారు… మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ దుయ్యబట్టారు.  

మోసానికే బ్రాండ్ అంబాసిడర్…

“జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు చేసిన మోసం చాలదని...జాబు రావాలంటే జగన్ కావాలని ఘరానా మోసానికి తెరలేపాడు జగన్ మోహన్ రెడ్డి గారు. 2.32లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు,23వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మీరు...5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి. ఏటా జాబ్ క్యాలెండర్ అని..జంబో డీఎస్సీ అని..APPSC నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ గారు.... మోసానికే బ్రాండ్ అంబాసిడర్. మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం తప్పా...గౌరవంగా చెప్పుకొనే ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా ..? నేటికీ శాఖల పరిధిలో 2.25లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మీ జగన్ మార్క్ పాలనకు నిదర్శనం” అంటూ వైఎస్ షర్మిల(YS Sharmila) ఫైర్ అయ్యారు.