CPI Congress: సిపిఐతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు... నేటి నుంచి కడపలో షర్మిల ఎన్నికల ప్రచారం-adjustment of congress seats with cpi sharmila election campaign in kadapa from today ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cpi Congress: సిపిఐతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు... నేటి నుంచి కడపలో షర్మిల ఎన్నికల ప్రచారం

CPI Congress: సిపిఐతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు... నేటి నుంచి కడపలో షర్మిల ఎన్నికల ప్రచారం

Sarath chandra.B HT Telugu
Apr 05, 2024 08:52 AM IST

CPI Congress: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ పార్టీతో సిపిఐ జత కట్టింది. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి ఓ స్థానాన్ని దక్కించుకున్న సిపిఐ ఏపీలో కూడా ఆ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకుంది.

ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తల్లి విజయమ్మతో షర్మిల
ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తల్లి విజయమ్మతో షర్మిల

CPI Congress: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ Congress పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిపిఐ సిద్ధమైంది. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోCPI సిపిఐ-కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో పాటు సిపిఐ పోటీ చేసిన స్థానంలో కూడా అభ్యర్థి గెలుపొందారు.

జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఐ ఏపీలో కూడా పొత్తును కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. నాటి ఎన్నికల్లో జనసేన రాజోలులో మాత్రమే గెలిచింది. వామపక్షాలకు కనీస ప్రాతినిథ్యం దక్కకుండా పోయింది. ఈసారైనా సిపిఐ అభ్యర్థిని అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.

ఏపీలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్, సీపీఐల మధ్య సీట్ల పంపకంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలరెడ్డి Ys Sharmila, సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో పలుమార్లు చర్చలు జరిపారు.

సీట్ల సర్దుబాటులో భాగంగా ఒక పార్లమెంటు స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది.ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తారు. వీటిలో పోటీ చేసే అభ్యర్థులకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుంది.

CPI అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఇవే…

1. విజయవాడ వెస్ట్

2. విశాఖపట్నం వెస్ట్

3. అనంతపురం

4. పత్తికొండ

5. తిరుపతి

6. రాజంపేట

7. ఏలూరు

8. కమలాపురం

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

కడప పార్లమెంటు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి ఏపి న్యాయ యాత్ర పేరిట బస్సు యాత్ర Bus Yatra ను షర్మిల ప్రారంభిస్తున్నారు.

బద్వేల్ నియోజక వర్గంలోని అమగంపల్లీ వద్ద ఉదయం 10 గంటలకు షర్మిల బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇటుకుల పాడు, సవిషెట్టిపల్లి, వరికుంటల్, బాలయ్య పల్లి, నర్సాపురం, గుంటవారి పల్లి, కాలసపాడు, మహానందిపల్లి, మామిళ్ల పల్లి, లింగారెడ్డి పల్లి, పోరు మామిళ్ళ, పాయల కుంట్ల,బద్వేల్ టౌన్, అట్లూరు మీదుగా షర్మిల బస్సు యాత్ర సాగుతుంది.

ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో "దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నట్లు షర్మిల ట్వీట్ చేశారు. రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.

కడపలో ముక్కోణపు పోటీ…

కడప లోక్‌సభలో షర్మిల పోటీతో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. వైసీపీ తరపున అవినాష్‌ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. క్రియాశీల రాజకీయాాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి షర్మిల రాజకీయాల్లో ఉన్నా అన్నమీద పంతం కొద్ది తమ్ముడి మీద పోటీకి దిగుతుండటంతో వైఎస్ కుటుంబంలో ఎవరిని ఓటర్లు ఆదిరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

WhatsApp channel

సంబంధిత కథనం