YS Sharmila in Kadapa : హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే జగనన్నను ఓడించాలి - ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల-ys sharmila comments on ys jagan and avinash reddy over her election campaign in kadapa ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ys Sharmila In Kadapa : హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే జగనన్నను ఓడించాలి - ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల

YS Sharmila in Kadapa : హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే జగనన్నను ఓడించాలి - ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 05, 2024 05:23 PM IST

YS Sharmila Election Campaign in Kadapa : కడప నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే జగనన్నతో పాటు అవినాశ్ రెడ్డి ఓడించాలని పిలుపునిచ్చారు.

కడపలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల
కడపలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల

YS Sharmila Election Campaign in Kadapa 2024: ఎన్నికల ప్రచారాన్ని(YS Sharmila Election Campaign) ప్రారంభించిన తొలిరోజే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)… ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి తలపెట్టిన బస్సు యాత్రలో పాల్గొన్న ఆమె…. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే… ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

"ఓవైపు ధర్మం వైపు కోసం పోరాడే నేను నిలబడ్డాను. అటువైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) ఉన్నాడు. న్యాయం అన్నది గెలవాలంటే ప్రజలు నిలబడాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. పోలవరం పూర్తి కావాలన్నా... స్టీల్ ప్లాంట్ పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలి. రాజశేఖర్ రెడ్డి ఉంటే స్టీల్ ప్లాంట్ ఇలాగే ఉండేదా..? మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, మన బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, ఈ హత్యా రాజకీయాలను స్వస్తి పలకాలన్న జగనన్నగారిని, అవినాశ్ రెడ్డి ఓడించాలి" అని వైఎస్ షర్మిల(YS Sharmila) పిలుపునిచ్చారు.

కడప జిల్లా నా పుట్టినిల్లు - వైఎస్ షర్మిల

“వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ తరుపున 10 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన ఆశయం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉంది. ముఖ్యమంత్రి జగన్ పాలనలో విభజన హామీలు ఒక్కటి కూడా సాదించుకోలేదు కానీ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనల ప్రాజెక్ట్ చేశారు. బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ది. ఇదే కడప జిల్లా నా పుట్టినిల్లు.ఇక్కడ జమ్మలమడుగు లోనే పుట్టా.ఇవ్వాళ మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. మీ దీవెనలతో ఆశీర్వదించండి గెలిపించండి” అంటూ ప్రజలను షర్మిల కోరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన కిల్లి కృపారాణి

మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇవాళ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతగా పేరొంది కృపారాణి… మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పని చేశారు. వైసీపీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో వైసీపీని వీడిన ఆమె,,,, షర్మిల సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

WhatsApp channel