YS Jagan in Naidupeta : మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టే ఒంటరిగా బరిలోకి దిగాను - వైఎస్ జగన్-ys jagan election campaign in tirupati district addresses public meeting at naidupeta ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ys Jagan In Naidupeta : మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టే ఒంటరిగా బరిలోకి దిగాను - వైఎస్ జగన్

YS Jagan in Naidupeta : మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టే ఒంటరిగా బరిలోకి దిగాను - వైఎస్ జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 04, 2024 06:23 PM IST

YSRCP Public Meeting at Naidupeta: మంచి చేశామన్న విశ్వాసంతోనే ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగామన్నారు వైసీపీ అధినేత జగన్. 2014లో చంద్రబాబు కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేయలేదని… అలాంటి కూటమికి ఈసారి అవకాశం ఇవ్వొద్దని ప్రజలను కోరారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (YSRCP Twitter)

YSRCP Memantha Siddham Yatra Updates : పొత్తులు, ఎత్తులు, జిత్తులతో పని లేదన్నారు వైఎస్ జగన్((YS Jagan).). ప్రతి ఇంటికి మంచి చేశామని... ఎవర్నీ మోసం చేయలేదన్నారు. మంచి చేశాం కాబట్టే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాయుడిపేటలో(YSRCP Public Meeting at Naidupeta) తలపెట్టిన భారీ సభలో మాట్లాడిన జగన్… చేయలేని వాగ్ధానాలను చెప్పి... జగన్ అనే వ్యక్తి మోసం చేయడని చెప్పుకొచ్చారు. పేదలపై జగన్ కు ఉన్న ప్రేమ... ఏ నాయకుడికి లేదన్నారు. జగన్ చేయలేని స్కీమ్... చంద్రబాబుతో పాటు ఆయన జేజేమ్మ కూడా అమలు చేయలేరన్నారు.

వాటితో పోటీ పడలేను - వైఎస్ జగన్

"చంద్రబాబు (Chandrababu) చెప్పే అబద్ధాలతో నేను పోటీ పడాలని అనుకోవటం లేదు. నోటికి ఏది వస్తే అది చెప్పడమే చంద్రబాబు ధోరణి. చంద్రబాబు కిచిడి మెనిఫెస్టోతో పోటీపడలేను. అబద్ధాలను నేను చెప్పలేను. ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతున్నాను... మీకు ఎలాంటి కావాలో నిర్ణయించుకోండి. కేజీ బంగారం, సూపర్ సిక్స్, బెంజ్ కార్లు అంటూ చంద్రబాబు హామీలు ఇస్తున్నాడు. ఎన్నికలు అవ్వగానే చంద్రబాబు మాదిరిగా మెనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రాజకీయాలు చేస్తే ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందా..? కానీ మనం మాత్రం మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం. ఇంత మంచిని చేసిన నేను మీ ముందుకు వచ్చాను. 2014లో కూటమిగా ఏర్పడి మోదీ(Modi), పవన్(Pawan Kalyan) ను తెచ్చుకున్నారు చంద్రబాబు. ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికి పంపించారు. దీనిపై చంద్రబాబు సంతకం కూడా చేశారు. హామీ ఇచ్చిన మాదిరిగా రైతు రుణమాఫీ చేశాడా..? పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పాడు.. మరీ ఒక్క రూపాయి అయినా చేశాడా..? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ స్కీమ్ కింద రూ. 25వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పాడు... ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా..? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తామని చెప్పాడు. అలా కుదరపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నాడు. వీటిని అమలు చేశాడా అని అడుగుతున్నాను" అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్.

2014లో ఇదే కూటమి హామీలను(BJP TDP JSP Alliance) అమలు చేయకుండా... మరోసారి మోసం చేసేందుకు ప్రజల దగ్గరికి వచ్చారని దుయ్యబట్టారు వైఎస్ జగన్(YS Jagan). వారి మోసాల నుంచి కాపాడుకునే ఈ ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్ కావాలన్నారు. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుందన్న జగన్… తన మొట్టమొదటి సంతకం మళ్లీ వాలంటీర్లను తీసుకురావడం కోసమే అని చెప్పారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్న జగన్… చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదన్నారు. చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు మాత్రమే అని దుయ్యబట్టారు.