APPSC Group 2 Results : ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్స్ కు 92 వేల మంది ఎంపిక
APPSC Group 2 Prelims Results : ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఉంచింది. మెయిన్స్ పరీక్షను జులై 28 నిర్వహిస్తారు.
APPSC Group 2 Prelims Results : ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను(APPSC Group 2 Prelims) ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్(Group 2 Mains) కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో ప్రకటించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు.
899 పోస్టులకు భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)899 గ్రూప్-2 పోస్టులకు ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Prelims) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షా విధానం
ఇవాళ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ(APPSC)విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు(Group 2 Mains) అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.
సంబంధిత కథనం