Chandrababu Fires on CM Jagan : జగన్ తండ్రే నాకు భయపడ్డారు, వైసీపీని భూస్థాపితం చేస్తాం- చంద్రబాబు
Chandrababu Fires on CM Jagan : 'సీఎం జగన్ తండ్రే నాకు భయపడ్డారు. అలాంటి జగన్ కు నేను భయపడను' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు.
Chandrababu Fires on CM Jagan : నా అనుభవం ముందు జగన్ ఓ బ* అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రెచ్చిపోయారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో శనివారం నిర్వహించిన రా..కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు డోస్ పెంచారు. టీడీపీ, జనసేన సైన్యాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మన గెలుపు ఖాయమని ముందే నిర్థారణ అవుతుందన్నారు. వైసీపీ(Ysrcp)కి పర్చూరు పౌరుషం చూపించాలని సవాల్ విసిరారు. జగన్(Jagan) కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు... వైసీపీ పాలనకు ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయన్నారు. 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీని భూస్థాపితం చేస్తామని, అడ్డొచ్చిన వైసీపీ నేతలు తొక్కుకుంటా పోతామన్నారు. ఇక ఆగేదే లేదెంటూ కేడర్ లో చంద్రబాబు ఉత్సాహం నింపారు. రాజకీయాలను వైసీపీ కలుషితం చేసిందని మండిపడ్డారు.
జగన్ తండ్రే భయపడ్డారు
"నా రాజకీయ అనుభవం ముందు జగన్ ఓ బ*. జగన్ తండ్రే నాకు భయపడ్డారు. అలాంటి జగన్ కు నేను భయపడను. నన్ను పని చేయకుండా అడ్డుకోవడం నిన్ను పుట్టించిన వాడికి కూడా చేతకాదు. తండ్రిని అడ్డం పెట్టుకుని రూ. 43 వేల కోట్లను జగన్ దోచుకున్నాడని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఎంత దోచుకున్నా జగన్ లో మార్పు రాలేదు. ఊరూరు తిరిగి, తల నిమిరితే మీరు కరిగిపోయి ఓట్లు వేశారు. ఆ తర్వాత మీ ల్యాండ్ , స్యాండ్, వైన్, మైన్ ఇలా ఏదీ వదిలి పెట్టలేదు. జగన్‌కు ఉదయం టిఫెన్ సాండ్, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రికి జే బ్రాండ్ మద్యం కావాలి" - చంద్రబాబు
వైసీపీ పాలనలో అందరం బాధితులమే
ఎన్నికల ముందే టీడీపీ-జనసేన(TDP Janasena) విజయం ఖాయమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదం అన్నారు. జగన్ కు అభ్యర్థులు దొరక్క దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చంద్రబాబాబు ఎద్దేవా చేశారు. జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా గౌరవప్రదమైన రాజకీయాలు నేర్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ఆలోచించి జరుగుతుందో ఆలోచించి ఓటెయ్యాలన్నారు. పర్చూరులో పోలీసుల అండతో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేపడుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో తాను, పవన్ కల్యాణ్ సహా అందరం బాధితులమేనన్నారు. దోపిడీకి అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
మునిగిపోయేది పోలీసులే
ఓడిపోతున్న ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారన్నారు. ఇంకొల్లు సభను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అసలు నోటీసులో ఏం ఉందో చూడకుండానే సభను ఆపాలని ఎస్పీ అంటారా? అని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ(TDP) చట్ట ప్రకారం వెళ్తుందని, అడ్డం వస్తే తొక్కుకుని పోతామన్నారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పర్చూరు నియోజకవర్గంలో అధికారులు వైసీపీ నేతలతో కలిసి గ్రానైట్ వ్యాపారులపై కేసులు పెట్టించి వేధిస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ఊరు మీద పడ్డుతున్నారన్నారు.
సంబంధిత కథనం