CBN Warning: వైసీపీ వాళ్లు చొక్కాలు మడతపెడితే…జనం కుర్చీ మడత పెడతారని చంద్రబాబు వార్నింగ్.. జగన్‌పై ఆగ్రహం-tdp president chandrababu expressed his anger on cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Warning: వైసీపీ వాళ్లు చొక్కాలు మడతపెడితే…జనం కుర్చీ మడత పెడతారని చంద్రబాబు వార్నింగ్.. జగన్‌పై ఆగ్రహం

CBN Warning: వైసీపీ వాళ్లు చొక్కాలు మడతపెడితే…జనం కుర్చీ మడత పెడతారని చంద్రబాబు వార్నింగ్.. జగన్‌పై ఆగ్రహం

Sarath chandra.B HT Telugu
Feb 16, 2024 06:20 AM IST

CBN Warning: జగన్‌, వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే..ఆంధ్రా ప్రజలు కుర్చీమడతపెడతాని, అప్పుడు సీఎంకు కుర్చీనే ఉండదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్

CBN Warning: రాష్ట్ర ప్రజలు బానిసలుగా ఉంటారో...ప్రభుత్వం మీద తిరుగబడతారో ఆలోచించుకోవాలని టీడీపీTDP అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఏపీ సిఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జనసేన Janasena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ Pawan Kalyan తో కలిసి పాల్గొన్నారు.

ప్రజలతో సైకో అని పిలిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి జగనే అని చంద్రబాబుChandrababu ఎద్దేవా చేశారు. బానిసలుగా ఉంటారో...తిరుగబడతారో ఆలోచించాలని పిలపునిచ్చారు. ‘‘వైసీపీ YCP ప్రభుత్వంలో అందరం బాధితులమే. దళితులు, అమరావతి రైతులు, ఉద్యోగులు, పవన్ కళ్యాణ్…తానూ బాధితుడినే అన్నారు.దేశ చరిత్రలో ఒక సీఎం విధ్వంసకర పాలనపై పుస్తకం రాయడం మొదటిసారిగా చూస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఒక ప్రభుత్వం..ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం వివరించారన్నారు.

2019నుండి రాష్ట్రంలో విధ్వంసం

అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ లో రూపాయి కూడా తీసుకోకుండా రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారంటే అది త్యామని, నష్టం జరుగుతుందని రైతులు అనుకుని ఉంటే నాడే నాకు నమస్కారం పెట్టి మా జోలికి రావొద్దు అని చెప్పేవారని, శత్రువుకు కూడా రాని బాధను అమరావతి రైతులు పడ్డారన్నారు.

హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు భూమి విలువ లక్ష..తర్వాత కోట్లకు పెరిగింది. పదేళ్లలో అమరావతిని ఒక నమూనాకు తెచ్చి ఉంటే మీకు పరిహారంతో పాటు...అమరావతిని కట్టి కూడా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని ..అది రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉండేన్నారు. దాన్ని విధ్వసం చేశారన్నారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి రాజధాని కావావాలని ఇప్పుడు అంటున్నారన్నారు. తన ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చారని, ఐదేళ్లుగా శిథిలాలు తొలగించలేదని, అద్దె ఇంట్లో నుండి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించాని. శిధిలాలు తొలగించకుండా వదిలేస్తే దాన్ని చూసి నేను ప్రతిరోజు బాధపడాలని కోరుకునే వ్యక్తిని ఏమనాన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావేదిక ఇవ్వండిని అడిగా...నాకు ఇవ్వకపోతే మరో దానికి వాడుకోవచ్చని, ప్రజలు చూస్తుండగానే దీన్ని కూల్చేయండని చెప్పిన వ్యక్తి సైకో సీఎం కాకపోతే ఏమిటన్నారు.

మానసిక రోగితే రాష్ట్రానికి ఈ పరిస్థితి

జగన్ కూడా సందపాదనే ధ్యేయంగా అమరావతి, పోలవరంను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు. మద్యం, ఇసుక, మైనింగ్ ఏది దొరికితే అది దోచేశాడన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ వంటి వారు ఏకంగా రాజకీయాల నుంచి విరమించుకునేలా చేయగలిగారని, ఫ్యాక్టరీలను హైదరాబాద్‌ తీసుకుపోయే పరిస్థితులు కల్పించారన్నారు.

జగన్‌ తీరుపై ప్రజలు కూడా ఆలోచించాలి..తిరగబడతారా..బానిసలుగా ఉంటారో మరో 54 రోజుల్లో మీరు నిర్ణయించుకోవాలన్నారు. సీఎం ఫిరంగిపురం సభలో మాట్లాడుతూ...చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చింది అంటున్నారని…జగన్, వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారు.

అప్పుడు జగన్‌ కుర్చీయే లేకుండా పోతుంని సీఎం హోదాలో ఉన్నావనే సంగతి గుర్తుంచుకోవాలని.. ఎన్నికలు అంటే ద్వంద యుద్ధం, చొక్కాలు మడతపెట్టడానికి కాదని చంద్రబాబు సూచించారు. మంచికి కూడా హద్దులు ఉంటాని పిచ్చిపిచ్చి కూతలు కూస్తే దానికి ప్రజలు పరిష్కారం చూపిస్తారని హెచ్చరించారు. ఐదేళ్ల నరకాన్ని ప్రతి ఒక్కరూ చర్చించాలని పిలుపు ఇచ్చారు. . సురేష్ కుమార్ ను ప్రజల తరపున అభినందిస్తున్నా.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024