TDP Meeting Permissions: రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు.. టీడీపీ ఆగ్రహం.. బాపట్ల సభ నిర్వహించి తీరుతామంటున్న టీడీపీ-the police obstructed the ra kagudira sabha tdp angry on police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Meeting Permissions: రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు.. టీడీపీ ఆగ్రహం.. బాపట్ల సభ నిర్వహించి తీరుతామంటున్న టీడీపీ

TDP Meeting Permissions: రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు.. టీడీపీ ఆగ్రహం.. బాపట్ల సభ నిర్వహించి తీరుతామంటున్న టీడీపీ

Sarath chandra.B HT Telugu
Feb 15, 2024 02:11 PM IST

TDP Meeting Permissions: టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు ఇంకొల్లులో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకొల్లు టీడీపీ బహిరంగ సభ ఏర్పాట్లను అడ్డుకుంటున్న పోలీసులు
ఇంకొల్లు టీడీపీ బహిరంగ సభ ఏర్పాట్లను అడ్డుకుంటున్న పోలీసులు

TDP Meeting Permissions: అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ సభను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంకొల్లులో రా కదలి రా సభను నిర్వహిస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో శనివారం తలపెట్టిన బహిరంగ సభకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంపై బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకొల్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ ఆరోపించింది.

పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని వైసిపి ప్రభుత్వం రాజకీయానికి తెర లేపిందని జిల్లా నేతలు ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు సభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేశారని టీడీపీ చెబుతోంది.

టీడీపీ అధినేత రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ అండ్ బి అధికారులకు దరఖాస్తు చేశామని, ఇంకొల్లులో లక్షలాది మందితో సభ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేసుకుంటే పోలీసులు, దేవాదాయ శాఖ ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు.

ఇంకొల్లు లోని పావులూరు రోడ్డులో ఉన్న ఓ రైతు దేవాదాయ శాఖ భూములను లీజుకు తీసుకోవడంతో ఆ స్థలంలో సభ నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులకు రైతుల సమ్మతితో దరఖాస్తు చేశామని చెబుతుననారు.

బుధవారం తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలతో బహిరంగ సభకు తారక రామ విజయభేరి ప్రాంగణంగా నామకరణం చేసి భూమి పూజ కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. భూమిని చదును చేసి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రాత్రి సమయంలో దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

దీంతో పోలీసులు పనులు నిలిపివేయాలంటూ హుకుం జారీ చేశారని రైతు ఇష్ట ప్రకారం లిఖితపూర్వకంగా బహిరంగ సభ నిర్వహణకు అన్ని శాఖలకు దరఖాస్తు చేసి వారి అనుమతితోనే పనులు పూర్తి చేశామని చెబుతున్నారు. లక్షలాది మందితో సభ నిర్వహిస్తున్నారని అక్కసుతో సభను భగ్నం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారని టీడీపీ ఆరోపించింది.

దీనిలో భాగంగా బహిరంగ సభను అడ్డుకోవాలనే దురుద్దేశంతో పోలీసులతో వైసిపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందన్నారు. దేవాదాయ శాఖ అధికారులను ఫిర్యాదు కాపీని అడిగినప్పటికీ స్పందించకుండా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బాపట్ల టీడీపీ నేతలు ఆరోపించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సభ నిలిపివేసేందుకు ప్రభుత్వ శాఖలతో అడ్డంకులు సృష్టించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Whats_app_banner