YSRCP Incharges 7th List : ఆగని వైసీపీ కసరత్తు... ఇంఛార్జుల 7వ జాబితా విడుదల - తాజా మార్పులివే
YSRCP Incharges Latest List : కొత్త ఇంఛార్జులకు సంబంధించి ఏడో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం. ఈ లిస్ట్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జులను నియమించింది.
YSRCP Sixth Incharges List 2024: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ తెగ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ… తాజాగా ఏడో జాబితాను కూడా వెల్లడించింది. ఇందులో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా మార్పులతో కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ప్లేస్ లో అరవిందా యాదవ్ ను ఇంఛార్జ్‌గా బాధ్యతలు చూడనున్నారు. ఇక కీలకమైన పర్చూరు నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఖరారు అవుతుందన్న వార్తలు వినిపించినప్పటికీ…. ఈ ప్లేస్ ను ఎడం బాలాజీకి ఖరారు చేశారు.
ఈసారి భారీ మార్పులతో ఎన్నికలకు వెళ్లటానికి సిద్ధమైంది వైసీపీ అధినాయకత్వం. ఇందులో భాగంగా…. ఇంఛార్జులను పెద్ద ఎత్తున మార్చే పనిలో పడింది. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసింది. ఇందులో కీలకమైన స్థానాలు కూడా ఉన్నాయి. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను ప్రకటించగా…. రెండో జాబితాలో 27 మంది పేర్లను ప్రకటించారు. మూడో జాబితాలో 21, నాల్గో జాబితాలో 8 మంది, ఐదో జాబితాలో 7 మందిని కొత్తగా ప్రకటించారు. ఆరో జాబితాలో 10 స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. వీటిలో కొన్ని పార్లమెంట్ స్థానాల ఇంఛార్జులు కూడా ఉన్నారు.
వైసీపీ ఆరో జాబితా :
రాజమండ్రి(ఎంపీ)-గూడూరి శ్రీనివాస్,.
నర్సాపురం(ఎంపీ)-అడ్వకేట్ ఉమా బాల.
గుంటూరు (ఎంపీ) - ఉమ్మారెడ్డి వెంకట రమణ.
చిత్తూరు(ఎంపీ)- ఎన్.రెడ్డప్ప.
మైలవరం(ఎమ్మెల్యే) - తిరుపతి రావు యాదవ్.
మార్కాపురం( ఎమ్మెల్యే)- అన్నా రాంబాబు.
నెల్లూరు సిటీ( ఎమ్మెల్యే)- ఎండీ ఖలీల్.
ఎమ్మిగనూరు ( ఎమ్మెల్యే)- బుట్టా రేణుక.
గిద్దలూరు ( ఎమ్మెల్యే)- కుందూరు నాగార్జున రెడ్డి.
జీడీ నెల్లూరు( ఎమ్మెల్యే) -కె.నారాయణస్వామి.
వైసీపీ ఐదో జాబితా:
అరకు వ్యాలీ(ఎస్టీ)- రేగం మత్స్య లింగం
సత్యవేడు(ఎస్సీ)-నూకతోటి రాజేష్
అవనిగడ్డ- డా.సింహాద్రి చంద్రశేఖరరావు
కాకినాడ(ఎంపీ)- చలమలశెచ్చి సునీల్
మచిలీపట్నం(ఎంపీ)-సింహాద్రి రమేష్ బాబు
నర్సారావుపేట(ఎంపీ)-పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
తిరుపతి(ఎస్సీ)(ఎంపీ)-మద్దిల గురుమూర్తి.
వైసీపీ మూడో జాబితా….
విజయవాడ - కేశినేని నాని(ఎంపీ)
విశాఖపట్నం - బొత్త ఝాన్సీ(ఎంపీ)
కర్నూలు - గుమ్మనూరి జయరామ్(ఎంపీ)
తిరుపతి - కోనేటి ఆదిమూలం(ఎంపీ)
శ్రీకాకుళం - పేరాడ తిలక్(ఎంపీ)
ఏలూరు - సునీల్ కుమార్ యాదవ్(ఎంపీ)
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
గూడురు - మురళి
సత్యవేడు - గురుమూర్తి
పెడన - ఉప్పాల రాము
ఇఛ్చాపురం - పిరియ విజయ
రాయదుర్గం - గోవిందరెడ్డి
దర్శి - శివప్రసాద్ రెడ్డి
చింతలపూడి - విజయరాజు
పూతలపట్టు - సునీల్ కుమార్
చిత్తూరు - విజయానందరెడ్డి
పెనమలూరు - జోగి రమేశ్
మదనపల్లె - నిస్సార్ అహ్మద్
రాజంపేట - అమర్నాథ్ రెడ్డి
ఆలూరు - విరూపాక్షి
కోడుమూరు - డాక్టర్ సతీశ్